ప్రపంచ పాల దినోత్సవం
ప్రపంచ పాల దినోత్సవం | |
---|---|
జరుపుకొనేవారు | ప్రపంచవ్యాప్తంగా |
రకం | అంతర్జాతీయ |
జరుపుకొనే రోజు | జూన్ 1 |
ఆవృత్తి | వార్షిక |
అనుకూలనం | ప్రతి సంవత్సరం ఒకటే రోజు |
ప్రపంచ పాల దినోత్సవం ప్రతి ఏట జూన్ 1న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. పాలపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ పాల దినోత్సవం ఏర్పాటుచేయబడింది.[1]
ప్రారంభం
[మార్చు]100 శాతం పోషక విలువలు, విటమిన్ బి12 అధికంగా కలిగిన ఆహారమైన పాలు, టీనేజి పిల్లల్లో, విద్యార్థుల్లో, మానసిక, శారీక ఉత్సాహాన్ని, పెరుగుదలను, ఎముకల పటుత్వాన్ని కలిగిస్తాయి. రానురాను వాతావరణ సమతుల్యం లోపం వలన వర్షాలు సరిగ్గా పడక, మేత దొరకక పశుపోషణ కష్టమైంది. దీంతో పాల ఉత్పత్తులు తగ్గిపోయాయి. ఈ పాలను మంచి వ్యాపార వస్తువుగా మలచుకొని అనేక డైరీలు వెలిశాయి. అయితే డైరీల్లో పాలు నిల్వవుండేందుకు అనేక రకాల రసాయనాలు కలుపుతున్నారు. వీటి వల్ల పాలల్లో పోషకాల సంఖ్య తగ్గిపోతోంది. పాల ఉత్పత్తులో ప్రపంచంలో మనదేశం అగ్రభాగాన ఉన్నా, వినియోగంలో మాత్రం పూర్తిగా వెనుకబడ్డాం. ఈ ప్రమాదాన్ని గుర్తించి 2001 జూన్ 1 నుండి ఫుడ్, అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారు పాలను సంపూర్ణ ఆహారంగా మార్చారు.
లక్ష్యాలు
[మార్చు]కల్తీ లేకుంటే పాలకు మించిన పోషకాహారం లేదు. కల్తీ జరగకుండా ప్రభుత్వమే నిరంతర పర్యవేక్షణ చేయాలి. చిన్న, పెద్ద డైరీలు, సహకార సంఘాలు, నష్టాల బారిన పడకుండాను సహకరించాలి.
మూలాలు
[మార్చు]- ↑ ప్రజాశక్తి, సంపాదకీయం (31 May 2017). "పాల ఉత్పత్తులను కాపాడుకుందాం". జోస్యుల వేణుగోపాల్. Archived from the original on 21 May 2018. Retrieved 1 June 2019.