బరాక్-1
బరాక్ I | |
---|---|
రకం | తక్కువ పరిధి భూమి నుండి గాల్లోకి క్షిపణి |
అభివృద్ధి చేసిన దేశం | ఇజ్రాయిల్ |
ఉత్పత్తి చరిత్ర | |
తయారీదారు | Israel Aerospace Industries & Rafael Advanced Defense Systems |
విశిష్టతలు | |
బరువు | 98 కి.గ్రా.[1] |
పొడవు | 2.1 మీ.[1] |
వ్యాసం | 170 మి.మీ.[1] |
వార్‌హెడ్ | 22 కి.గ్రా.[1] శకలాలతో కూడిన వార్‌హెడ్ |
పేలుడు మెకానిజమ్ | ప్రాక్సిమిటీ ఫ్యూజు[1] |
వింగ్స్పాన్ | 685 మి.మీ.[1] |
ఆపరేషను పరిధి | 0.5-12 కి.మీ.[1] |
ఫ్లైటు ఎత్తు | 5.5 కి.మీ.[1] |
వేగం | మ్యాక్ 2.1 (720 m/s)[1] |
గైడెన్స్ వ్యవస్థ | Radar CLOS guidance |
లాంచి ప్లాట్ఫారం | Surface Ship |
బరాక్ (హీబ్రూలో మెరుపు అని అర్థం) ఇజ్రాయిల్ అబివృద్ధి చేసిన భూమి నుండి గాల్లోకి ప్రయోగించే క్షిపణి. ఇది విమానాలు, నౌకావ్యతిరేక క్షిపణులు, మానవరహిత ఆకాశ వాహనాలకు వ్యతిరేకంగా నౌకలనుండి ప్రయోగించే క్షిపణి.
స్థూలంగా
[మార్చు]నౌకలకు అతి దగ్గరగా వచ్చిన దాడిని ఎదుర్కొనే ఆయుధ వ్యవస్థను బలోపేతం చేసేందుకు, దాని స్థానంలో ఉపయోగించేందుకూ బరాక్-1 క్షిపణిని రూపొందించారు.ఈ క్షిపణులను 8 సెళ్ళ కంటెయినరులో ఉంచి, నిట్టనిలువుగా పైకి ప్రయోగిస్తారు. దీని C3I రాడారు వ్యవస్థ 360-డిగ్రీల కవరేజి ఇస్తుంది. నౌకకు 500 మీ. దగ్గరగా వచ్చిన శత్రు క్షిపణిని కూడా ఇది కూల్చగలదు. ఒక్కో బరాక్ వ్యవస్థ వెల $2.4 కోట్లు. విమానాలు, క్షిపణులతో పాటు అలల్ని రాసుకుంటూ దూసుకొచ్చే క్షిపణులను కూడ ఇది కూల్చగలదు.[2]
వివాదం
[మార్చు]భారత్ బరాక్-1 కొనుగోలు అవినీతి, అధిక ధరల కారణంగా వివాదాస్పదమైంది. ఆరోపణలపై 2006 లో సీబీఐ విచారణ జరిపి అనేక మందిని అరెస్టు చేసింది. 2013 నాటికి అగు సాక్ష్యాల లేమి కారణంగా దర్యాప్తు అసంపూర్తిగానే ఉంది. కేసును మూసివేసే స్థాయికి చేరుకుంది..[2][3] 2013 డిసెంబరు 23 న రక్షణ కొనుగోళ్ళ మండలి రు. 880 కోట్ల విలువైన 262 బరాక్-1 క్షిపణుల కొనుగోలుకు ఆమోదముద్ర వేసింది.[4]
ఆపరేటర్లు
[మార్చు]వాడుతున్న దేశాలు
[మార్చు]- Chile
- భారతదేశం - శివాలిక్ తరగతి యుద్ధ నౌకలు, ఐ.ఎన్.ఎస్ విరాట్ విమాన వాహక నౌకతో సహా మొత్తం 14 యుద్ధనౌకలపై మోహరించింది.[4] దీన్ని భారత రెండవ విమాన వాహక నౌక, ఐ.ఎన్.ఎస్. విక్రమాదిత్యపై కూడా మోహరించారు.[5]
- ఇజ్రాయిల్
- Singapore
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 "Barak missile" (PDF). Rafael.co.il. Archived from the original (PDF) on 2012-02-29. Retrieved 2012-11-18.
- ↑ 2.0 2.1 "Dubious deal". The Hindu. Retrieved 22 December 2013.[permanent dead link]
- ↑ "Israel rejects bribery charge, Barak missile probe may end". The Hindustan Times. 21 December 2013. Archived from the original on 21 డిసెంబరు 2013. Retrieved 22 December 2013.
- ↑ 4.0 4.1 "Defence ministry finally clears Barak missile deal with Israel". The Times of India. 23 December 2013. Retrieved 23 December 2013.
- ↑ "Four major acquisitions for the Navy and the Army approved". The Hindu. 24 December 2013. Retrieved 24 December 2013.