బషీర్‌బాగ్ ప్యాలెస్
బషీర్‌బాగ్ ప్యాలెస్ | |
---|---|
సాధారణ సమాచారం | |
రకం | రాజభవనం |
ప్రదేశం | హైదరాబాదు, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం |
పూర్తి చేయబడినది | సుమారు 1880 |
బషీర్‌బాగ్ ప్యాలెస్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బషీర్‌బాగ్ లో ఉన్న ప్యాలెస్. 1887-1894 మధ్యకాలంలో హైదరాబాద్ రాష్ట్ర ప్రధానమంత్రిగా ఉన్న పైగా వంశానికి చెందిన ఆస్మాన్ జా బషీర్-ఉద్-దౌలా ఫతేమైదాన్ వద్ద ఈ ప్యాలెస్‌ను నిర్మించాడు.[1]
చరిత్ర
[మార్చు]1872లో సాలార్ జంగ్ ఆలోచనలకు అనుగుణంగా 1880లలో నిర్మించిన ప్యాలెస్ పేరుమీద ఈ ప్రాంతానికి బషీర్‌బాగ్ అనే పేరు వచ్చింది. పైగా నవాబు ఉల్ ముల్క్ బహదూర్ దీనిని వేసవికాల ప్యాలెస్‌గా వాడుకునేవాడు.[2] అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో ఉన్న ఈ భవనం భారతదేశ స్వాతంత్య్రం అనంతరం కూల్చివేయబడింది. అందులో మిగిలిన ప్యాలెస్ భవన అవశేషంలోనే ప్రస్తుతం నిజాం కళాశాల ఉంది.[3]
నవాబ్ జహీర్ యార్ జంగ్ పోషణలో హిందూస్థానీ శాస్త్రీయ విద్వాంసుడు బాడే గులాం అలీఖాన్ తన చివరి సంవత్సరాలలో ఈ భవనంలో ఆతిథిగా ఉండి, ఏప్రిల్ 25, 1968 న ఈ ప్యాలెస్ లోనే మరణించాడు.[4]
చిత్రమాలిక
[మార్చు]-
బషీర్‌బాగ్ ప్యాలస్ (1880)
-
సర్ అస్మాన్ జా (1890)
-
బషీర్‌బాగ్ ప్యాలస్ లోని డ్రాయింగ్ రూం (1880)
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ ఆర్కైవ్, సాక్షి ఎడ్యూకేషన్. "అసఫ్ జాహీల నిర్మాణాలు". Archived from the original on 21 April 2018. Retrieved 27 September 2018.
- ↑ "Bashir-bagh Palace, Hyderabad". British Library. Archived from the original on 22 మార్చి 2008. Retrieved 27 సెప్టెంబరు 2018.
- ↑ వెబ్ ఆర్కైవ్, నవ తెలంగాణ (23 July 2018). "విద్యాకుసుమం..నిజాం కళాశాల". Archived from the original on 27 September 2018. Retrieved 27 September 2018.
- ↑ "Archived copy". Archived from the original on 5 జూలై 2008. Retrieved 27 సెప్టెంబరు 2018.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) An ustad's legacy