బిపర్‌జోయ్ తుఫాను
బిపర్‌జోయ్ అనేది శక్తివంతమైన ఉష్ణమండల తుఫాను, ఇది తూర్పు-మధ్య అరేబియా సముద్రం మీదుగా ఏర్పడింది.[1] భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో తీరప్రాంతాన్ని తాకే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, తుఫాను ఉత్తరం వైపు గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో కదులుతోంది, గుజరాత్‌లోని పోర్‌బందర్‌కు నైరుతి దిశలో సుమారు 290 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలతో పాటు వాటికి ఆనుకుని ఉన్న పాకిస్థాన్ తీరాలను దాటుతుందని భావిస్తున్నారు. ఈ ఏడాదిలో బంగాళాఖాతంలో ఏర్పడిన మోచా తుఫాను తర్వాత ఉత్తర హిందూ మహాసముద్రంలో ఇది రెండో తుఫాను.
వాతావరణ చరిత్ర
[మార్చు]జూన్ 1న, అరేబియా సముద్రంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ (IMD) పర్యవేక్షణ ప్రారంభించింది. గ్లోబల్ ఫోర్‌కాస్ట్ సిస్టమ్ (GFS), యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం-రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్స్ (ECMWF) వంటి గ్లోబల్ ఫోర్‌కాస్ట్ మోడల్‌లు తుఫాను ఏర్పడే అవకాశాన్ని సూచించాయి. జూన్ 5న అరేబియా సముద్రంలో తుఫాను ఏర్పడింది. అదే రోజు, తుఫాను ప్రసరణ ఫలితంగా అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. మరుసటి రోజు, అది తీవ్రరూపం దాల్చేంత ఎక్కువ అయింది. జాయింట్ టైఫూన్ వార్నింగ్ సెంటర్ (JTWC) సిస్టమ్‌పై ట్రాపికల్ సైక్లోన్ ఫార్మేషన్ హెచ్చరికను జారీ చేసింది. ఐఎండీ ఇది తీవ్ర అల్పపీడనంగా, ఆ తర్వాత తుఫానుగా మారిందని తెలియజేసింది. దీనికి బిపర్‌జోయ్ అనే పేరు పెట్టారు.
బిపర్‌జోయ్
[మార్చు]తుఫాను పేరును బిపర్‌జోయ్ అని బంగ్లాదేశ్ సిఫార్సు చేసింది, దీనిని 'బైపోర్‌జోయ్' అని ఉచ్ఛరిస్తారు. బంగ్లాలో, బిపర్‌జోయ్ అనే పదానికి 'విపత్తు' అని అర్థం.[2] ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) జారీ చేసిన డిక్రీ ప్రకారం పేరు పెట్టారు. తుఫానులకు పేర్లు పెట్టడం అనేది ఇప్పటికే ఉన్న కొన్ని మార్గదర్శకాలను అనుసరించి భ్రమణ ప్రాతిపదికన దేశాలు నిర్వహిస్తాయి.
సన్నాహాలు
[మార్చు]పాకిస్తాన్
[మార్చు]సైక్లోన్ బైపర్‌జోయ్ సంభావ్య ప్రభావాలను తగ్గించడానికి, అధికారులు, ప్రావిన్షియల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (PDMA) వారు చురుకైన సన్నాహాలు చేసారు. సమన్వయం, సంసిద్ధత ప్రణాళిక కోసం వాటాదారులతో సమావేశాలు నిర్వహించబడ్డాయి. అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాలను గుర్తించడం, ప్రజలకు అవగాహన కల్పించే ప్రచారాలను ప్రారంభించడం, తరలింపు ప్రణాళికలను సిద్ధం చేయడం, ముప్పు పొంచి ఉన్న తీర ప్రాంతాల నుండి స్థానిక ప్రజలను సురక్షితంగా తరలించేలా చూడడం వంటి బాధ్యతలను పిడిఎంఏ ద్వారా సంబంధిత అధికారులకు అప్పగించారు. అధికారులు కరాచీ అంతటా బిల్‌బోర్డ్‌లు, సైన్ బోర్డులను తొలగించారు,[3] కరాచీలోని తీర నివాస ప్రాంతాలను స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని సూచించారు.
భారతదేశం
[మార్చు]భారత వాతావరణ శాఖ 12 జూన్ 2023న గుజరాత్‌లోని స్థానిక అధికారులను తరలింపునకు సిద్ధం కావాలని హెచ్చరిక జారీ చేసింది. తుపాను భూమికి దగ్గరగా వెళ్లడంతో తీర ప్రాంతాల నివాసితులు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. తుఫాను ప్రాంతాల్లో గుజరాత్ ప్రభుత్వం జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన బృందాలను ఏర్పరిచింది. గుజరాత్‌తో పాటు, భారతదేశంలోని పశ్చిమ, దక్షిణ తీరాలలోని అనేక ఇతర రాష్ట్రాల్లో తుఫాను వర్షాలు కురిసే అవకాశం ఉంది.[4] రానున్న రోజుల్లో మహారాష్ట్ర , కర్ణాటక , గోవాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.
మూలాలు
[మార్చు]- ↑ "How cyclones get their names: Who named cyclone Biparjoy and what it means?". The Economic Times. 2023-06-16. ISSN 0013-0389. Retrieved 2023-06-16.
- ↑ "Cyclone 'Biparjoy': What is the meaning of 'Biparjoy'? Know how tropical cyclones are named and more". WION. Retrieved 2023-06-16.
- ↑ "Cyclone Biparjoy: Karachi Commissioner orders removal of billboards". The Nation. 2023-06-12. Retrieved 2023-06-16.
- ↑ Suri, Rhea Mogul,Sophia Saifi,Manveena (2023-06-16). "Cyclone Biparjoy makes landfall, bringing heavy rainfall to India and Pakistan". CNN. Retrieved 2023-06-16.
{{cite web}}
: CS1 maint: multiple names: authors list (link)