Jump to content

బైపోలార్ డిజార్డర్

వికీపీడియా నుండి
బైపోలార్ డిజార్డర్
మానసిక అసమతౌల్యతలు
ప్రత్యేకతమానసిక వ్యాధులు
లక్షణాలుడిప్రెషన్‌, హైపోమేనియ, మేనియ
సంక్లిష్టతలుఆత్మహత్య
సాధారణ ప్రారంభం25 సంవత్సరాలు పైబడిన వారికి
రకాలుబైపోలార్ I డిజార్డర్, బైపోలార్ II డిజార్డర్
కారణాలుEnvironmental and genetic
ప్రమాద కారకములుchildhood abuse, long-term stress
భేదాత్మక రోగనిర్థారణ పద్ధతిAttention deficit hyperactivity disorder, personality disorders, schizophrenia, substance use disorder
చికిత్ససైకోతెరపి, medication
ఔషధంలితియం
తరుచుదనము1–3%

జీవితంలో మానసికంగా కొన్ని హెచ్చుతగ్గులు సర్వసాధారణం. అయితే బైపోలార్ డిజార్డర్ ఉన్నవారిలో ఈ మానసిక అసమతౌల్యతలు విపరీతంగా ఉంటాయి. అంటే సంతోషంగా ఉన్నప్పుడు మరీ ఎక్కువగా ఎగ్జయిట్‌మెంట్‌కి లోనుకావడం, అలాగే బాధగా ఉన్నప్పుడు మరీ ఎక్కువగా కుంగిపోవడం జరుగుతుంది. ఎక్కువ ఎగ్జయిట్‌మెంట్‌కు లోనుకావడాన్ని హైపోమేనియా అంటారు.

హైపోమేనియాలో ఉన్న వ్యక్తి తనను తాను చాలా శక్తిమంతుడిగా భావిస్తాడు. తిండి, నిద్ర సరిగా లేకపోయినా ఎనర్జిటిక్‌గా, యాక్టివ్‌గానే ఉంటాడు. అన్నిపనులూ వేగంగా ఉంటాయి. లైంగిక ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణా జ్ఞానం తగ్గిపోతుంది. ఒక పని చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో అన్న ఆలోచన రాకపోవడం వల్ల జీవితంలో కొత్త సమస్యలు వస్తాయి.[1]

కుంగిపోవడాన్ని బైపోలార్ డిప్రెషన్ అంటారు. డిప్రెషన్‌లో ఉన్నప్పుడు చిరాకు పడటం, శక్తిహీనుడుగా అయిపోవడం, ఆకలి తగ్గడం లేదా పెరగడం, శరీరం బరువులో మార్పు, నిద్రలేమి, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గిపోవడం వంటి మార్పులు జరుగుతాయి.

మేనియాకు చికిత్స తీసుకుంటున్నప్పుడు డిప్రెషన్, డిప్రెషన్‌కు చికిత్స తీసుకుంటున్నప్పుడు మేనియాలోకి వెళ్లడం జరిగే అవకాశం ఉంటుంది. మానసిక వైద్య నిపుణులను సంప్రదించాలి.

ఈ సమస్య రావడానికి మానసిక పరమైన ఒత్తిడి ముఖ్యకారణం. సాధారణంగా ఆఫీసు ఒత్తిడి, ప్రేమవ్యవహారాలు, జీవితంలో ఓటమి, ఆత్మీయులను కోల్పోవడం వంటి కారణాలు ఉండవచ్చు. కొన్నిసార్లు మాదకద్రవ్యాలు వాడటం, తగినంత నిద్రలేకపోవడం వంటి కారణాల వల్ల కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుంది.[2]

మందులు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Schmitt, Andrea; Malchow, Berend; Hasan, Alkomiet; Falkai, Peter (2014-02-11). "The impact of environmental factors in severe psychiatric disorders". Frontiers in Neuroscience. 8. doi:10.3389/fnins.2014.00019. ISSN 1662-4548. PMC 3920481. PMID 24574956.{{cite journal}}: CS1 maint: unflagged free DOI (link)
  2. Schmitt, Andrea; Malchow, Berend; Hasan, Alkomiet; Falkai, Peter (2014-02-11). "The impact of environmental factors in severe psychiatric disorders". Frontiers in Neuroscience. 8. doi:10.3389/fnins.2014.00019. ISSN 1662-4548. PMC 3920481. PMID 24574956.{{cite journal}}: CS1 maint: unflagged free DOI (link)