Coordinates: 15°27′18″N 79°26′20″E / 15.455°N 79.439°E / 15.455; 79.439

బొటికర్లపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రామం
పటం
Coordinates: 15°27′18″N 79°26′20″E / 15.455°N 79.439°E / 15.455; 79.439
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంకనిగిరి మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( 08490 Edit this on Wikidata )
పిన్‌కోడ్523108 Edit this on Wikidata


బొటికర్లపాడు ప్రకాశం జిల్లా కనిగిరి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఈ గ్రామం గురవాజీపేట గ్రామ పంచాయతీలోని ఒక శివారు గ్రామం.పటం

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల[మార్చు]

ఈ గ్రామంలో, ప్రధాన రహదారికి కొద్దిదూరంలో ఉన్న ఈ పాఠశాలలో, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు విద్యాబోధన జరుగుచున్నది. ఇక్కడ 62 మంది విద్యార్థులు విద్యనభ్యసించుచుండగా, ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఉపాధ్యాయులు, చిన్నారులకు పర్యావరణ పరిరక్షణ, ప్రాధాన్యత గురించి వివరించి, వీరిని మొక్కలు నాటేందుకు ప్రోత్సహించారు. చిన్నారులు గూడా ఎంతో ఉత్సాహంగా మొక్కలు సంరక్షించేటందుకు ముందుకు వచ్చారు. గ్రామస్థులు గూడా కొంత స్థలం పాఠశాలకు ఇచ్చారు. రెండు సంవత్సరాల క్రితం, మొదట వీరు పాఠశాల ఆవరణ అంతటకూ ముళ్ళకంచె ఏర్పాటు చేసుకొని, శుభ్రం చేసికొని, తొలివిడతగా నర్సరీ నుండి 150 మొక్కలను తీసికొనివచ్చి పాఠశాల ఆవరణ ముందు నాటినారు. వాటిని కంటికిరెప్పలాగా కాపాడుకుంటూ ప్రతి మొక్కనూ బ్రతికించుకున్నారు. తిరిగి గత సంవత్సరం మరియొక 80 మొక్కలు తీసికొని వచ్చి, పాఠశాల ఆవరణ వెనుక ప్రక్క నాటినారు. ప్రస్తుతం పాఠశాలలో, 230 పైగా మొక్కలు ఏపుగా పెరిగి చెట్లుగా దర్శనమిచ్చుచూ, ఆహ్లాదం పంచుచున్నవి. పాఠశాల ఆవరణ నందనవనాన్ని తలపింపజేయుచున్నది. ఈ పాఠశాల ఆవరణలో వేప, కానుగ, రావి, తురాయి, మామిడి, నేరేడు, గన్నేరు తదితర చెట్లు ఉన్నాయి. ప్రధానోపాధ్యాయుడు, మరి కొందరు, శ్రద్ధపెట్టి వేసవి సెలవులలోగూడా పాఠశాలకు వచ్చి, మొక్కలకు నీరు పెట్టి సంరక్షించుచూ అందరి మన్ననలనూ పొందుచున్నారు.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]