Jump to content

భారతదేశంలో మరణశిక్ష

వికీపీడియా నుండి

మరణ శిక్ష, భారతదేశంలో చట్టపరమైన శిక్ష.[1] భారతదేశ రాజ్యాంగంలో 21వ అధికరణం ప్రకారం పౌరులందరికీ జీవించే హక్కు ఉంది. ఈ హక్కుకు భంగం కలిగించడమే ఉరిశిక్షకు ప్రామాణికం.[2] 1995 నుంచి ఇప్పటి దాకా 9 సార్లు ఈ శిక్ష అమలు చేశారు.[3][4][5] హత్య, హత్యాయత్నం, అత్యాచారం చేసి చంపటం, సామూహిక అత్యాచారం, దేశద్రోహం, సైన్యంలో తిరుగుబాటు, మాదక ద్రవ్యాల సరఫరా వంటి తీవ్రమైన నేరాలకు భారతదేశంలో మరణ దండన విధిస్తున్నారు. స్వతంత్ర భారతదేశంలో మొదటి సారిగా మహాత్మా గాంధీ హత్యకేసులో దోషిగా తేలిన నాథూరాం గాడ్సేను 1949లో ఉరి తీశారు. ఇదే కేసులో కుట్రదారైన నారాయణ్ ఆప్టేకు మరణశిక్ష అమలు చేశారు.

గణాంకాలు

[మార్చు]

1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా ఎన్ని మరణ శిక్షలు అమలు చేశారన్న ప్రశ్నకు కచ్చితమైన సమాధానం లేదు.

రాష్ట్రపతి అధికారాలు

[మార్చు]

భారతదేశ రాజ్యాంగం 72 (1)వ అధికరణం ప్రకారం రాష్ట్రపతికి కొన్ని శిక్షల విషయంలో కొన్ని ప్రత్యేకమైన అధికారాలు కల్పించింది. ప్రత్యేకించి మరణ శిక్షల విషయంలో రాష్ట్రపతి నిందితులకు క్షమాభిక్ష పెట్టవచ్చు.

మూలాలు

[మార్చు]
  1. Majumder, Sanjoy. "India and the death penalty." BBC News 4 August 2005.
  2. "గాడ్సే నుంచి నిర్భయ దోషుల వరకు." www.eenadu.net. Retrieved 2020-03-20.
  3. "Yakub Memon, third terror convict executed in 8 years". Archived from the original on 2016-03-04. Retrieved 2020-03-20.
  4. "Explained: In the Supreme Court, some questions of Life and Death". 27 May 2015.
  5. "Yakub Memon case: Death penalty in India, by the numbers". 27 July 2015.