మంచి మనుషులు
Appearance
మంచి మనుష్యులు (1974 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వి.బి.రాజేంద్రప్రసాద్ |
---|---|
నిర్మాణం | వి.బి.రాజేంద్రప్రసాద్ |
తారాగణం | శోభన్ బాబు , మంజుల (నటి) |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
గీతరచన | ఆత్రేయ, ఆరుద్ర |
నిర్మాణ సంస్థ | జగపతి పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఇది 1974, అక్టోబర్ 18న విడుదలైన తెలుగు సినిమా. వి.బి.రాజేంద్రప్రసాద్ దర్శకత్వంలో, శోభన్ నటించిన తొలి చిత్రం. హిందీ చిత్రం ఆగలే లగజా ఆధారంగా నిర్మించబడింది. శశికపూర్, శత్రుఘన్ సిన్హా పాత్రల్ని శోభన్ బాబు, జగ్గయ్య ధరించారు. మంజుల శోభన్ బాబుల కాంబినేషన్ కి ఈ చిత్రం నుండి మంచి గుర్తింపు వచ్చింది.
నటీనటులు
[మార్చు]- శోభన్ బాబు
- మంజుల
- జగ్గయ్య
- నాగభూషణం
- ధూళిపాళ
- రావు గోపాలరావు
- కె.వి.చలం
- ముక్కామల
- రాజబాబు
- అంజలీదేవి
- సారథి
- వీరభద్రరావు
- మాస్టర్ టిటూ.
సాంకేతిక వర్గం
[మార్చు]నిర్మాత, దర్శకుడు: వి.బి.రాజేంద్రప్రసాద్
నిర్మాణ సంస్థ: జగపతి పిక్చర్స్
సంగీతం: కె వి మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, ఆరుద్ర
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
విడుదల :18:10:1974.
పాటలు
[మార్చు]ఈ సినిమాలోని పాటలన్నీ జనరంజక మయ్యాయి.
- నిన్ను మరచిపోవాలని అన్ని విడిచివెళ్ళాలని - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం; రచన: ఆత్రేయ
- నేను లేక నీవు లేవు (సంతోషం) - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల; రచన: ఆత్రేయ
- నేను లేక నీవు లేవు (విషాదం) - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల; రచన: ఆత్రేయ
- పడకు పడకు వెంట పడకు - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల; రచన: ఆత్రేయ
- పెళ్ళయింది ప్రేమ విందుకు వేళయింది - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల; రచన: ఆత్రేయ
- వినునా మాట విన్నావంటే జీవితమంతా పూవుల బాట - - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల; రచన: ఆరుద్ర[1]
- హరిలో రంగ హరీ - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల; రచన: ఆత్రేయ
సినిమా విజయం
[మార్చు]"మంచి మనుషులు" హైదరాబాదు "సుదర్శన్ 70 యం యం "లో 175 రోజులు ఏకథాటిగా ఆడిన మొదటి శోభన్ సినిమా. స్వరబ్రహ్మ కె.వి.మహదేవన్ దీనికి సంగీతం సమకూర్చాడు. సగం సినిమా సిమ్లా, మనాలిలో తీసారు.
మూలాలు
[మార్చు]- ↑ కురిసే చిరుజల్లులో, ఆరుద్ర సినీ గీతాలు, 5వ సంపుటం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2003.