Jump to content

మద్రాస్ బ్యాంక్ (1683)

వికీపీడియా నుండి
1930 సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ మద్రాస్ వారి భవనం.

మద్రాసు బ్యాంకు (1683) బ్రిటిష్ ఇండియాలో 1683 సంవత్సరంలో స్థాపించబడిన బ్యాంకు. ఈ బ్యాంకు భారతదేశంలోని పురాతన బ్యాంకులలో ఒకటి. బ్యాంకు 1843 సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ మద్రాస్ లో విలీనం చేయబడింది.

మద్రాస్ బ్యాంక్ (1683)
రకంప్రైవేట్ రంగం
పరిశ్రమబ్యాంకింగ్, ఇన్సూరెన్స్, క్యాపిటల్ మార్కెట్స్ అనుబంధ పరిశ్రమలు
స్థాపన21 జూన్ 1683 (1683-06-21) as The Madras Bank (1683)
క్రియా శూన్యత1 జూలై 1843 (1843-07-01)
విధిబ్యాంక్ ఆఫ్ మద్రాస్ (విలీనం)
వారసులుబ్యాంక్ ఆఫ్ మద్రాస్
ప్రధాన కార్యాలయం,
Number of locations
మద్రాస్ ప్రెసిడెన్సీ
సేవ చేసే ప్రాంతము
భారతదేశం
ఉత్పత్తులుడిపాజిట్లు, పర్సనల్ బ్యాంకింగ్ పథకాలు , సి & ఐ బ్యాంకింగ్ పథకాలు, అగ్రి బ్యాంకింగ్ స్కీంలు, ఎస్ ఎం ఇ బ్యాంకింగ్ పథకాలు
సేవలుబ్యాంకింగ్, ట్రేడ్ ఫైనాన్స్
మాతృ సంస్థస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

చరిత్ర

[మార్చు]

గవర్నరు గిఫోర్డ్ 1682-83 సంవత్సరం లోనే ఆయన కౌన్సిల్ మద్రాసు బ్యాంకుచే స్థాపించబడిన ఒక బ్యాంకు ఉండేది, కాని ఒక జాయింట్ స్టాక్ కంపెనీగా విలీనం చేయబడిన మొదటి అధికారిక బ్యాంకు, 1788 సంవత్సరంలో ఫోర్ట్ సెయింట్ జార్జ్ లో స్థాపించబడిన కర్ణాటక బ్యాంకు, తరువాత 1795 సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ మద్రాస్, 1804 సంవత్సరంలో ఏషియాటిక్ బ్యాంక్ ఉన్నాయి. ఈ బ్యాంకులను విలీనం చేసి 1843లో ఫోర్ట్ ఎక్స్చేంజ్ లో రూ.3 మిలియన్ల పెట్టుబడితో బ్యాంక్ ఆఫ్ మద్రాస్ అనే జాయింట్ స్టాక్ బ్యాంకును ఏర్పాటు చేశారు. ప్రభుత్వం 1876 సంవత్సరం వరకు ఈ ప్రెసిడెన్సీ బ్యాంకులో వాటాలను కలిగి ఉంది.[1]

నిర్వహణ

[మార్చు]

మద్రాస్ బ్యాంక్ యూరోపియన్ వ్యాపారుల నిర్వహణలో ఉన్నది, వారు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో కలిసి పనిచేశారు.[2]

భవనం

[మార్చు]

మద్రాస్ బ్యాంక్ భవన నిర్మాణం మొదట స్వింటన్ జాకబ్ చే రూపకల్పన చేయబడి, తర్వాత హెన్రీ ఇర్విన్ చే సవరణ చేయబడింది. భవనం కట్టడంలో మద్రాసు కేంద్రంగా ఉన్న ఇండో-సార్సెనిక్ ఆర్కిటెక్చర్ దానిలో ఒకటి, ఈ శైలిలో ఒక ఉదాహరణ. భవనం నిర్మాణంలో బ్యాంకింగ్ హాల్ విశాలంగా, పాలరాతి-అంతస్తులు, ఒక పెద్ద ఖజానా పైకప్పుతో, మోనోగ్రామ్డ్ గాజు తలుపులు, చెక్క, ఇటుక, గ్రానైట్ తోరణాలతో ఉన్నది. భవనంలో భవనంలో 1200 వందల అందమైన గాజుపలకలు ఉన్నాయని పేర్కొంటారు. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవనంగా ఉన్నది [3].

విలీనం

[మార్చు]
బ్యాంక్ ఆఫ్ మద్రాస్ 1840 సంవత్సరంలో 10 రూపాయల నోటు.

1921 సంవత్సరంలో బొంబాయి, బెంగాల్ బ్యాంకులతో విలీనమై ఇంపీరియల్ బ్యాంకుగా మారింది. ప్రస్తుతం ఉన్న స్టేట్ బ్యాంక్ ఇండియా అప్పుడు బ్యాంక్ ఆఫ్ మద్రాస్ ప్రధాన కార్యాలయంగా ఉన్నది.1955 సంవత్సరంలో ఇంపీరియల్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( మౌంట్ రోడ్) గా మారింది[1].

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Madras Musings - We care for Madras that is Chennai". madrasmusings.com. Retrieved 2022-08-18.
  2. "List of 4 Banks in India Before Independence". Essays, Research Papers and Articles on Business Management (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-08-10. Retrieved 2022-08-18.
  3. DBHKer (2008-11-06), Bank of Madras - Madras - 1895, retrieved 2022-08-18