మనీషా అశోక్ చౌదరి
మనీషా అశోక్ చౌదరి | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2014 | |||
ముందు | వినోద్ ఘోసల్కర్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | దహిసర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 18 జూన్ మహారాష్ట్ర , భారతదేశం | ||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | అశోక్ చౌదరి | ||
సంతానం | 2 | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
మనీషా అశోక్ చౌదరి మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె మహారాష్ట్ర శాసనసభకు దహిసర్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1]
రాజకీయ జీవితం
[మార్చు]మనీషా అశోక్ చౌదరి భారతీయ జనతా పార్టీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో దహిసర్ శాసనసభ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి వినోద్ ఘోసల్కర్‌పై 38,578 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[2] ఆమె 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి అరుణ్ సావంత్‌పై 63,917 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[3][4][5]
మనీషా అశోక్ చౌదరి 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో దహిసర్ శాసనసభ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన (యుబిటి) అభ్యర్థి వినోద్ ఘోసల్కర్‌పై 44,329 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[6]
ఇతర పదవులు
[మార్చు]- మేయర్- దహను నగర్ పాలికా (1998-2001)
- అధ్యక్షుడు - బీజేపీ థానే రూరల్ జిల్లా (2002-2005)
- అధ్యక్షురాలు - బీజేపీ మహిళా మోర్చా (మహారాష్ట్ర ప్రదేశ్) (2006-2009)
- బీఎంసీ కార్పొరేటర్ - వార్డ్ నం. 9, బోరివలి (2012-2014)
- బీఎంసీ అధ్యక్షుడు- ప్రభాగ్ సమితి R- వార్డ్ (2013-2014)
- బీజేపీ మాజీ జాతీయ కార్యవర్గ సభ్యుడు
- మాజీ చైర్మన్ - మహారాష్ట్ర శాసనసభ మహిళా హక్కులు & సంక్షేమం కమిటీ
అవార్డ్స్ & పురస్కారాలు
[మార్చు]- "ఉత్తమ మహిళా పారిశ్రామికవేత్త అవార్డు" - రాంభౌ మల్గి ప్రబోధిని (2002)
- “రాష్ట్రీయ ఏక్తా అవార్డు” – ఇమేజ్ వెల్ఫేర్ అచీవర్స్ ఫోరమ్ (2003)
- “దహను టౌన్ అభివృద్ధికి ఉత్తమ సామాజిక కార్యకర్త అవార్డు” – రోటరీ క్లబ్ ఆఫ్ దహను (2004)
- “అవార్డ్ ఫర్ బెస్ట్ ఇండస్ట్రియలిస్ట్” – సఖి ఫిట్‌నెస్ సెంటర్-మహిళా వికాస్ ట్రస్ట్
- "అన్నాభౌ సాథే దళిత్ పురస్కార్" - వెనుకబడిన ఎస్సీ సెయింట్ సమాజ్ సేవా సంఘ్
- "థానే జిల్లా భూషణ్ అవార్డు" - మషల్ వీక్లీ
- "ఉత్తమ రాజకీయ నేత అవార్డు"- భారతీ నిర్మాణ్ లోక్ మహితి
- "ఉత్తమ మహిళా పారిశ్రామికవేత్త అవార్డు" - శివముద్ర ప్రతిష్టన్, ముంబై
- "ఉత్తమ ఎమ్మెల్యే అవార్డులు"- ముంబై మ్యాటర్స్
- “లోక్‌మత్ ఉమెన్ అచీవర్స్ ఆఫ్ ముంబై” (2021-2022)
- “జీవన్ గౌరవ్ పురస్కార్”- క్షత్రయ పరిషత్, అలీబాగ్ (2022)
మూలాలు
[మార్చు]- ↑ "Dahisar Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. Archived from the original on 26 December 2024. Retrieved 26 December 2024.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
- ↑ The New Indian Express (24 October 2019). "Maharashtra now has seven more women members in assembly" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ The Times of India (26 October 2019). "Meet Maharashtra's 24 women MLAs". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ The Hindu (24 October 2019). "Only 19 of 235 women contestants taste victory in Maharashtra" (in Indian English). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ "Maharastra Assembly Election Results 2024 - Dahisar". Election Commission of India. 23 November 2024. Archived from the original on 26 December 2024. Retrieved 26 December 2024.