మానవరహిత వైమానిక వాహనం
స్వరూపం
మానవరహిత వైమానిక వాహనం లేదా డ్రోన్ అనేది వైమానిక వాహన బోర్డు నందే పైలట్ చే ఆపరేటింగ్ కాకుండా రిమోట్ వ్యవస్థ ద్వారా నడిపే వైమానిక వాహనం. డ్రోన్‌లు పవనాలకు, గాలి ఒత్తిడిలో మార్పులకు సర్దుబాట్ల యొక్క జాగ్రత్తలు తీసుకోవడానికి ఒక ఆన్‌బోర్డ్ కంప్యూటర్ కలిగి ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇవి ఒక నిర్దిష్ట లక్ష్యంగా ప్రోగ్రామ్ చేస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు సాధారణంగా నేలపై దాన్ని నిర్వహించే మనుషుల పర్యవేక్షణలో జరుగుతుంటాయి. పెద్ద మానవరహిత వైమానిక వాహనాలు ఎక్కువగా సైనిక దళాలు ఉపయోగిస్తుంటాయి. ఇంకా వీటిని అగ్నిమాపక చర్యలు వంటి వాటికి లేదా ఛాయాచిత్రాలు, వీడియోలు వంటివి తీసుకోవడానికి ప్రజలు ఉపయోగిస్తుంటారు.