మానవరహిత వ్యోమనౌక
మానవరహిత వ్యోమనౌక అంటే మానవ సహాయం లేకుండా అంతరిక్షంలో సంచరించగల ఒక యంత్ర పరికరం (రోబో). స్పేస్ ప్రోబ్ అనేవి వీటికి ఒక ఉదాహరణ. ఇవి భూమి చుట్టూ కాకుండా భూకక్ష్యను దాటి అవతల తిరుగుతుంటాయి.[1] అంతరిక్షంలో ఉష్ణోగ్రత, అయస్కాంత క్షేత్రం లాంటి వివరాలు సంపాదిస్తుంది. ఇందులో మనుషులు ఉండరు కానీ సౌర శక్తితో పనిచేసే ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటాయి. ఇవి చంద్రుడి సమీపానికి వెళ్ళగలవు, గ్రహాంతరాళాలలో ప్రయాణం చేయగలవు. స్పేస్ ప్రోబ్స్ లో ఆర్బిటర్ల, రోవర్లు, ల్యాండర్లు అని పలు రకాలున్నాయి. ఇవి ఇతర గ్రహాల చుట్టూ తిరుగుతాయి, వాటిపైనే ఎగురుతాయి, వాటిమీద దిగుతాయి. అక్కడ సంపాదించిన సమాచారాన్ని తిరిగి భూమికి పంపుతాయి. వాటి ఉపరితలం మీద పదార్థాల్ని సేకరించి భూమిని చేర్చగలవు కూడా.
రష్యా, అమెరికా, భారతదేశం, చైనా, జపాన్ లాంటి దేశాలన్నీ కలిసి అనేకమైన స్పేస్ ప్రోబ్ లను సౌర కుటుంబంలోని గ్రహాలపైకి, చంద్రుడిపైకి, ఇతర ఖగోళ వస్తువులపైకి పంపించారు. ప్రస్తుతం సుమారు 15 క్రియాశీలకంగా ఉన్నాయి.[2]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Space Probes". National Geographic Education. National Geographic Society.
- ↑ "Planetary Exploration Timelines: A Look Ahead to 2016". The Planetary Society.
ఆధారగ్రంథాలు
[మార్చు]- వి. వి. బాలకృష్ణ (1982), అందరకీ అవసరమైన అంతరిక్ష విజ్ఞానం, విజయవాడ: నవరత్న బుక్ సెంటర్, archived from the original on 2019-01-14, retrieved 2019-03-14