మావల్లి టిఫిన్ రూమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మావల్లి టిఫిన్ రూమ్స్ (ఎంటిఆర్) (The Mavalli Tiffin Rooms (MTR) భారతదేశంలో ఆహార సంబంధిత సంస్థ బ్రాండ్ పేరు. బెంగళూరులోని లాల్‌బాగ్ రోడ్డులో ఉన్న ఈ సంస్థకు బెంగళూరులో పది శాఖలతో కలిపి ఉడిపి, మైసూర్, సింగపూర్, కౌలాలంపూర్, లండన్, దుబాయ్‌లలో ఉన్నాయి. దక్షిణ భారత దేశ అల్పాహారం రవ్వ ఇడ్లీని రూపొందించారు.[1] ప్యాకేజ్డ్ ఫుడ్స్ విభాగాన్ని నార్వేకు చెందిన ఓర్క్లా కొనుగోలు చేయగా, ఎంటిఆర్ గొలుసు రెస్టారెంట్లను ప్రారంభించిన వారే సంస్థను నడుపుతున్నారు.

ఎం టి ఆర్ లోగో

1924వ సంవత్సరంలో ప్రారంభం ఐన చిన్న రెస్టారెంట్‌కు "బ్రాహ్మణ్ కాఫీ క్లబ్" అని పేరు పెట్టి; ఇడ్లీ, కాఫీలతో వ్యాపారం మొదలు పెట్టారు. మూడవ సోదరుడు యజ్ఞనారాయణ మైయా కూడా కొన్నేళ్ల తర్వాత వ్యాపారంలో చేరి సహాయం చేశాడు.[2]

చరిత్ర

[మార్చు]
ఎం టి ఆర్ భోజనం

1920 సంవత్సరంలో పరమేశ్వర మైయా, గణపయ్య మైయా, యజ్ఞనారాయణ మైయా అనే ముగ్గురు సోదరులు ఉడిపి సమీపంలోని చిన్న గ్రామం పరంపల్లి నుంచి బెంగళూరు రావడంతో సంస్థ ప్రారంభమునకు ఆరంభం అయినది. ఈ ముగ్గురు సోదరులు వంటళ్లలో ప్రావీణ్యం ఉన్నవారు, వారు బెంగళూరు వచ్చిన వెంటనే పలువురు ప్రముఖుల ఇళ్లలో వంటవాళ్లుగా పనిచేయడం మొదలుపెట్టారు. ఈ వృత్తిని వారు సుమారు నాలుగు సంవత్సరాలు చేసారు. ఈ ముగ్గురు బెంగళూరులోని లాల్ బాగ్ రోడ్ ప్రాంతంలో ఒక చిన్న రెస్టారెంట్ ను ప్రారంభించి దానికి 'బ్రాహ్మణ కాఫీ క్లబ్' అని పేరు పెట్టడం జరిగింది. మొదట్లో కేవలం ఇడ్లీలు, కాఫీలు మాత్రమే అమ్మేవారు. రుచికరమైన ఇడ్లీలను రుచిని ప్రజలు ఆదరించారు[3].

అభివృద్ధి

[మార్చు]

మావల్లి టిఫిన్ రూమ్స్( ఎం టి ఆర్) దేశానికి స్వాతంత్ర్యం వచ్చే సమయానికి వినియోగ దారులలో పేరు పొందింది. 1950 సంవత్సరంలలో యజ్ఞనారాయణ మాయా అప్పటికి వ్యాపారాన్ని బలంగా నడిపిస్తూ, దానిని అభివృద్ధి పథంలో వ్యాపారంను విస్తరించడం చేసే ఆలోచన ప్రారంభించాడు. రెస్టారెంట్ సమీపంలో కొంత భూమిని కొనుగోలు చేసి రెస్టారెంట్ నిర్మించడం ప్రారంభించారు. 1960 సంవత్సరంలో, మావల్లి టిఫిన్ రూం పేరు మీద ప్రారంభించబడింది. లాల్బాగ్ రోడ్ రెస్టారెంట్ సుమారు 1,000 నుండి 1,500 మందికి సేవలు అందిస్తుంది, ఇక్కడ ప్రతిరోజూ సుమారు 20 కిలోల బిసిబెలే అన్నం వినియోగం అవుతుంది. సుమారు ప్రతిరోజూ ఉదయం 600 నుంచి 700 ఇడ్లీలు చేస్తారు, అవి ఉదయం 9 గంటలకల్లా అయిపోతాయి. ఎం టి ఆర్, తాజాగా రుబ్బిన మసాలా దినుసులతో చేసిన తయారు చేసిన సాంబార్ అల్పాహార ప్రియులకు ప్రత్యక ఆకర్షణగా ఉంటుంది. ఎంటీఆర్ బ్రాండ్ తన విజయానికి కారణం మైయా సోదరులలో చిన్న వాడైన యజ్ఞనారాయణ వ్యక్తిత్వమేనని స్పష్టమైంది, అతను వ్యాపారంలో చేరిన తరువాత రెస్టారెంట్ అభివృద్ధికి కారణం అయినాడు. యజ్ఞనారాయణ ఎప్పుడూ కొత్త ఆలోచనలతో,1951 సంవత్సరంలో ఇంగ్లాండ్ లో అక్కడ రెస్టారెంట్లు ఎలా పనిచేస్తున్నాయో చూడటానికి ఇంగ్లాండ్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అక్కడి రెస్టారెంట్ లలో ఉన్న పరిశుభ్రత, వాటి ప్రమాణాలకు అనుగుణంగా, అతను త్వరలోనే తన రెస్టారెంట్ లలో పాత్రలు, క్రోకరీ, కట్లరీ,ఆవిరి స్టెరిలైజేషన్ చేర్చాడు. అక్కడి రెస్టారెంట్ లలో ఉన్న కాఫీ తాగడానికి ఉపయోగించే కప్పులు, సాసర్లను చూసి, తన రెస్టారెంట్ లో కూడా అవి వాడాలని నిర్ణయించుకున్నాడు. తన రెస్టారెంట్ లలో గ్లాసులకు బదులుగా కెటిల్స్ నుండి కాఫీ పోయడం ప్రారంభమైంది. ఆ తర్వాత వినియోగ దారులకు చిన్న బుక్ లెట్లను పరిచయం చేయడం, భోజన మర్యాదలపై సూచనలు ఇవ్వడం వంటి చర్యలు చేపట్టారు.యజ్ఞనారాయణకు కొత్తదనం పట్ల ఉన్న అభిరుచి ఎం.టి.ఆర్ ఆహారంలో కూడా వ్యక్తమైంది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బియ్యం కొరత కారణంగా రవ్వ ఇడ్లీని కనిపెట్టారు.[4]

ఎం టి ఆర్ ,బెంగళూర్
రెస్టారెంట్ వ్యవస్థాపకుడు పారంపల్లి యజ్ఞనారాయణ మైయా..
రెస్టారెంట్ వ్యవస్థాపకుడు పారంపల్లి యజ్ఞనారాయణ మైయా.. 
స్వచ్ఛమైన నెయ్యి, సాంబార్ తో ఉండే ఇడ్లీ
స్వచ్ఛమైన నెయ్యి, సాంబార్ తో ఉండే ఇడ్లీ 
సిల్వర్ కాఫీ కప్పుల్లో ఎంటీఆర్ కాఫీ
సిల్వర్ కాఫీ కప్పుల్లో ఎంటీఆర్ కాఫీ 

సమస్యలు

[మార్చు]

1968 సంవత్సరంలో యజ్ఞనారాయణ మైయా మరణించాడు. అత్యవసర పరిస్థితి ( ఎమర్జెన్సీ 1975) సమయంలో పలహార హోటళ్లలో తినే పదార్థాల ధరలను తగ్గించాలని ఆదేశంతో, ఎం టి ఆర్ సంస్థకూడా ధరలను తగ్గించింది. ధరలను తగ్గించినా, టిఫినన్లలో నాణ్యత తగ్గించలేదు. ప్రతిరోజూ చౌకగా అందించే పదార్థాల వల్ల నష్టమును, రోజు ఒక బోర్డులో వ్రాసే వారు, కొన్ని దినాలకు మూసివేయడం జరిగింది. యాజమాన్యం ఇంతవరకు సంస్థలో పనిచేసిన భవిష్యత్ వారి గురించి ఆలోచన చేసి, ఇంతలో ప్రతిరోజూ వాళ్ళు చేసే సాంబారు పొడిని వినియోగదారులు తీసుకువెళ్లేది వాళ్లకు గుర్తుకు వచ్చి, 1983 సంవత్సరంలో తెరిచి , ఎం టి ఆర్ సంస్థ బ్రాండ్ పేరుతొ సాంబార్ పొడి, రసంపొడి, కూర పొడి,చట్నీ పొడి , అదే పేరుతొ రెడీ టు ఈట్ ఫుడ్ అనే నినాదంతో బిసిబిల్లా బాత్, పొంగల్, తమతో బాత్ ,పులిహోర, పాయసం, ఇడ్లీ, ఇతర శ్రేణులతో రెడీ టు ఈట్ ఫుడ్ ను తయారు చేసి, వినియోగ దారులకు అందిస్తున్నది. ఎం టి ఆర్ వ్యాపారాన్ని కొనుగోలు చేయడానికి విదేశీ సంస్థలు పోటీ పడి చివరకు ,నార్వే దేశానికీ చెందిన ఓర్కా సంస్థ 400 కోట్లకు 2007 సంవత్సరంలో ఎం టి ఆర్ రెడీ టు ఈట్ ఫుడ్ వ్యాపారమును కొనుగోలు చేసింది. ప్రస్తుతం 270 రకాల ఉత్పత్తులను అమ్ముతున్నారు. మైయాస్ బ్రాండ్ పేరుతొ గొలుసు కట్టు రెస్టోరెంట్ల ను సదానంద ప్రారంభినాడు. ప్రస్తుతం వారి మూడో తరం వారు ఈ వ్యాపారం నిర్వహిస్తన్నారు[5].



మూలాలు

[మార్చు]
  1. Sep 20, Anoothi Vishal / TNN /; 2020; Ist, 05:00. "Break-up wala butter chicken to sourdough rotis, the pandemic is changing our most popular dishes - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-01-26. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  2. "A tradition from yore". Deccan Herald (in ఇంగ్లీష్). 2015-01-30. Retrieved 2023-01-26.
  3. "From A Local Restaurant To An International Restaurant Chain & A Popular Packaged Food Brand – The Success Story Of MTR". Marketing Mind (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-08-28. Retrieved 2023-01-26.
  4. Vishal, Anoothi. "Mavalli Tiffin Rooms: Taste the secret sauce of the legendary south Indian restaurant chain MTR". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-01-26.
  5. "Login Page". epaper.andhrajyothy.com. Retrieved 2023-01-26.