Jump to content

మిథునం (2012 సినిమా)

వికీపీడియా నుండి
మిథునం
మన అమ్మానాన్నల ప్రేమకథ
దర్శకత్వంతనికెళ్ళ భరణి
రచనశ్రీరమణ
స్క్రీన్ ప్లేతనికెళ్ళ భరణి
జొన్నవిత్తుల
ఆనంద్ మువిదా రావు
నిర్మాతఆనంద్ మువిదా రావు
తారాగణంశ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
లక్ష్మి (నటి)
ఛాయాగ్రహణంరాజేంద్రప్రసాద్ తనికెళ్ళ
కూర్పుఎస్. బి. ఉద్దవ్
సంగీతంస్వర వీణాపాణి
పంపిణీదార్లుAMR ప్రొడక్షన్స్
J & J ఫిలింస్
విడుదల తేదీ
డిసెంబరు 21, 2012 (2012-12-21)[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

మిథునం 2012 లో విడుదలైన తెలుగు చిత్రం. సుప్రసిద్ద తెలుగు రచయిత శ్రీ రమణ దాదాపు పాతిక సంవత్సరాల క్రితం రచించిన 25 పేజీల మిథునం కథకు తనికెళ్ళ భరణి అందించిన చిత్రరూపమే ఈ చిత్రం.

అప్పదాసు (శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం) విశ్రాంత ఉపాధ్యాయుడు. అర్ధాంగి బుచ్చి (లక్ష్మి) తో కలిసి స్వగ్రామంలో నివసిస్తుంటాడు. పిల్లలందరూ విదేశాలలో స్థిరపడటం వలన దంపతులిద్దరూ మాత్రమే శేషజీవితాన్ని గడుపుతూ, జీవితాన్ని విచారంగా గాక ఎంత రమణీయంగా...రసమయంగా మలుచుకుని తమ శేషజీవితాన్ని ఓ మధురానుభూతిగా మిగిల్చారన్నదే స్థూలంగా కథ... ఈ క్రమంలో వీరిద్దరి మధ్యన జరిగే విశేషాల సమాహారమే ఈ చిత్రం.

కేవలం రెండు పాత్రలు తప్ప సినిమాలో ఏ పాత్ర కనిపించదు. పద్మభూషణ్‌ కెజె యేసుదాసు ఒక పాట, పాత తరం ప్రముఖ గాయని జమునారాణి ఒక జానపదం గీతం ఈ చిత్రంలో పాడారు. జొన్నవిత్తుల ‘కాఫీ దండకం’ రచించారు. ఈ చిత్రం ఆడియో సి.డి. అమెరికాలోని న్యూయార్క్‌ సిటీలో, డల్లాస్‌లో, న్యూజెర్సీలో ప్రవాసాంధ్రుల సమక్షంలో విడుదల చేశారు.

పాటల జాబితా

1; ఆది దంపతులు ,జేసుదాస్ ,రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు.

2:ఆవకాయ మనందరిది , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, స్వప్న , రచన: తనికెళ్ల భరణి.

3: ఎవరు గెలిచారు ఇప్పుడు , కె.జమునా రాణి , రచన: ఆనంద్ మోయీద రావు.

4: కాఫీ దండకం , జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు

ఆస్కార్ అవార్డుకు నామినేట్

[మార్చు]

సినిమా ఫిల్మ్ ఫెడరేషన్ అఫ్ ఇండియా ఇచ్చిన సూచనల మేరకు ఈ సినిమా ఆస్కార్ అవార్డు కు నామినేట్ అయ్యింది. ఈ చిత్ర నిర్మాతకు 'మిధునం' సినిమా ఉత్తమ విదేశీ భాషా సినిమా అవార్డు క్యాటగిరి' లో నామినేట్ అయినట్లు లెటర్ అందింది.

పురస్కారాలు

[మార్చు]
  1. నంది పురస్కారం - 2012 నంది పురస్కారాలులో తృతీయ ఉత్తమ చిత్రం, ఉత్తమ మాటల రచయిత (తనికెళ్ళ భరణి), ప్రత్యేక బహుమతులు లక్ష్మి, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం) విభాగంలో అవార్డులు వచ్చాయి.[2][3][4][5]

మూలాలు

[మార్చు]
  1. "Midhunam in Cinemas on 21st December". Ragalahari. Archived from the original on 2013-01-02. Retrieved 18 డిసెంబరు 2012.
  2. "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 30 June 2020.
  3. మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 30 June 2020.
  4. సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 30 June 2020.
  5. నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 30 June 2020.

బయటి లంకెలు

[మార్చు]