మూఢనమ్మకాలు-దురాచారాలు
Appearance
మన దేశంలో ఎన్నో మూఢనమ్మకాలు -దురాచారాలు న్నాయి. ఆడపిల్లలకు పది సంవత్సరాల వయసు దాటకుండానే బాల్య వివాహాలు చేసేవారు. పెళ్ళికాకముందే రజస్వల అయితే ఆ పిల్ల తల్లితండ్రులకు నరకంలో రజస్వల రక్తాన్ని త్రాగిస్తారట. మూఢనమ్మకంతోటే దురాచారం పుట్టుకొస్తుంది. హేతుబద్దమైన మంచినమ్మకాల వల్ల సదాచారాలూ పుడతాయి. సతీసహగమనం, బాణామతి, అంటరానితనం...ఇవన్నీ మూఢనమ్మకాల వల్ల పుట్టిన దురాచారాలే. అక్కడక్కడా ఈనాటికీ కనబడుతున్నకొన్ని మూఢనమ్మకాలు-దురాచారాలు :
- గొడ్రాలు, విధవరాలు, మాచకమ్మ ఎదురు కావడం అశుభం.
- రోలు, గడప మీద తుమ్మకూడదు, వాటిమీద కూర్చోకూడదు.
- తల్లి దండ్రులు చనిపోయిన సంవత్సరంలోపే యుక్తవయసుపిల్లలకు పెళ్ళిళ్ళు చెయ్యాలి, లేదా మూడేళ్ళు అగాలి.
- భార్య చనిపోయిన వ్యక్తి సంవత్సరంలోపే పెళ్ళిచేసుకోవాలి. లేదా మూడేళ్ళు అగాలి.
- కుడికాలుపెట్టి ఇంట్లోకి రావాలి.
- విధవరాళ్ళు పూలు, బొట్టు, మెట్టెలు, నగలు పెట్టుకోకూడదు.
- నల్ల పిల్లి ఎదురుకాకూదదు.
- బయలుదేరిన వాళ్ళను ఎక్కడికెళుతున్నారని అడుగకూడదు, తుమ్మకూడదు.
- కాకి అరిచినా, దువ్వెన జారవిడిచినా చుట్టాలొస్తారు.
- కత్తిరించిన గోళ్ళను తొక్కినవాడు శత్రువవుతాడు.
- కలలో పెళ్ళైతే మిత్రులమరణం, కలలో చావొస్తే పెళ్ళి జరుగుతాయి.
- ధ్వజస్థంభం నీడ ఇళ్ళమీద పడకూడదు.
- పెళ్ళికాని వారు చనిపోతే ముందు జిల్లేడు చెట్టుతో పెళ్ళి చేశాకే అంత్యక్రియలు చేయాలి
- గర్బిణీ చనిపోతే చెట్టుకు వేళాడదీయాలి కానీ సమాధి చేయకూడదు
- అన్నం తినేటప్పుడు తుమ్మితే చేయి కడుక్కుని మళ్ళీ తినాలి.
- ఎవరైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు తుమ్మితే కాసేపు ఆగి మంచినీళ్లు తాగి వెళ్ళాలి.
- తలగడ మీద కూర్చోకూడదు.
- అరచేయి దురద పెడితే ధనలాభం.
- అరికాలు దురద పెడితే ప్రయాణం.
- బల్లి మీద పడితే అశుభం