Jump to content

యూనికోడ్

వికీపీడియా నుండి
తెలుగు
పరిధిU+0C00..U+0C7F
(128 సంకేత బిందువులు(కోడ్ పాయింట్స్)
తలం(ప్లేన్)BMP
లిపులుతెలుగు_లిపి
ప్రధాన వర్ణమాలలుతెలుగు
గోండి
లంబాడీ
వాడినవి96 సంకేత బిందువులు(కోడ్ పాయింట్స్)
వాడనవి32 రిజర్వుడు సంకేత బిందువులు(కోడ్ పాయింట్స్)
మూల ప్రమాణాలుISCII
యూనికోడ్ వెర్షన్ చరిత్ర
1.0.080 (+80)
5.193 (+13)
7.095 (+2)
8.096 (+1)
గమనిక: [1][2]

యూనికోడ్ (సర్వ సంకేత పద్ధతి) అనునది కంప్యూటర్ రంగ అక్షర సంకేత లిపి పద్ధతి.[3]

యూనికోడ్ అవసరం

[మార్చు]

కంప్యూటర్లు ప్రధానంగా అంకెలతో పని చేస్తాయి. ఒక్కో అక్షరానికీ, వర్ణానికీ ఒక్కో సంఖ్యని కేటాయించి నిక్షిప్తం చేసుకొంటాయి. యూనీకోడ్ కనుగొనబడక ముందు, ఈ విధంగా సంఖ్యలని కేటాయించడంకోసం వందలకొద్దీ సంకేతలిపి (encoding) పద్ధతులు ఉండేవి. ఏ ఒక్క పద్ధతిలోనూ చాలినన్ని వర్ణాలు ఉండేవికాదు: ఉదాహరణకు, ఒక్క ఐరోపా సమాఖ్య లోని భాషలకోసమే చాలా సంకేతలిపి పద్ధతులు కావలసి వచ్చేవి. అంతెందుకు, ఒక్క ఇంగ్లీషు భాషలోని అన్ని అక్షరాలు, సాధారణ వాడుకలో ఉన్న వ్యాకరణ, సాంకేతిక వర్ణాలకే ఏ ఒక్క సంకేతలిపి పద్ధతీ సరిపోయేది కాదు.

ఆ సంకేతలిపి పద్ధతుల మధ్య వైరుధ్యాలుకూడా ఉండేవి. అంటే, వేర్వేరు పద్ధతులు ఒక సంకేతసంఖ్యని వేర్వేరు అక్షరాలకు, లేదా వేర్వేరు సంకేతసంఖ్యల్ని ఒకే అక్షరానికి ఉపయోగించేవి. కంప్యూటర్లు (ముఖ్యంగా సర్వర్లు) చాలా రకాలైన సంకేతలిపి పద్ధతులకు అనువుగా ఉండవలసి వచ్చేది; అయినా సరే, వివిధ సంకేతలిపి పద్ధతుల లేదా ప్లాట్‌ఫామ్ ల మధ్య డేటా ప్రయాణించినప్పుడు, ఆ డేటా చెడిపోయే ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉండేది.

యూనికోడ్ కల్పన

[మార్చు]

ప్రతీ అక్షరానికీ ఓ ప్రత్యేక సంఖ్యని యూనీకోడ్ అందిస్తుంది..., ప్లాట్‌ఫామ్ ఏదైనా, ప్రోగ్రామ్ ఏదైనా, భాష ఏదైనా సరే. వ్యాపార దిగ్గజాలైన ఆపిల్, HP, IBM, జస్ట్‌సిస్టమ్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, SAP, సన్, సైబేస్, యూనిసిస్, అనేక కంపెనీలు ఈ యూనీకోడ్ ప్రమాణాన్ని స్వీకరించాయి.[3] ఆధునిక ప్రమాణాలైన XML, జావా, ECMAస్క్రిప్ట్ (జావాస్క్రిప్ట్), LDAP, కోర్బా 3.0, WML లాంటివాటికి యూనీకోడ్ అవసరం. అంతేగాక, ISO/IEC 10646 ని అమలుపరచే అధికారిక పద్ధతిది. చాలా ఆపరేటింగ్ సిస్టములూ, అన్ని ఆధునిక బ్రౌజర్లూ ఇంకా అనేక సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులు ఇప్పుడు యూనికోడ్‌ని మద్దతు చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న అత్యంత ప్రముఖ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ ధోరణులలో యూనీకోడ్ ప్రమాణ అవతరణా దానిని అందించే ఉపకరణాల లభ్యత ఉన్నాయి.

క్లయింట్-సర్వర్ లేదా బహుళ స్థాయి సాఫ్ట్‌వేర్ ఉపకరణాలలోనూ, వెబ్‌సైట్‌లలోనూ యూనీకోడ్‌ని వాడి (పాత పద్ధతులతో పోల్చినపుడు) ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఒకే సాఫ్ట్‌వేర్ ఉపకరణము లేదా ఒకే వెబ్‌సైట్... వివిధ ప్లాట్‌ఫామ్‌లకు, భాషలకు, దేశాలకు పనికివచ్చేవిధంగా (మళ్ళీ మళ్ళీ తయారుచేసే అవసరం లేకుండానే) యూనీకోడ్ సుసాధ్యం చేస్తుంది. అనేక సిస్టముల మధ్య రవాణాలో డేటా చెడిపోకుండా ఇది వీలు కల్పిస్తుంది.

యూనీకోడ్ కన్సార్టియం

[మార్చు]

యూనీకోడ్ కన్సార్టియం అనేది యూనీకోడ్ ప్రమాణపు అభివృద్ధి, వ్యాప్తి, విస్తృతికై ఏర్పాటైన లాభాపేక్షలేని సంస్థ. ఈ ప్రమాణం ఆధునిక సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులు, ప్రమాణాలలోనూ వచన ఉపయోగ విధానాన్ని నిర్ధేశిస్తుంది. కంప్యూటరు, సమాచార ఆధారిత పరిశ్రమకు చెందిన విభిన్న వ్యాపార, స్వచ్ఛంద సంస్థలు ఈ సంస్థలో సభ్యులుగా ఉన్నాయి. ఆర్థికపరంగా పూర్తిగా సభ్యత్వ రుసుము మీదే ఆధారపడి సంస్థ నడుస్తుంది. యూనీకోడ్ ప్రమాణాన్ని అమలుపరిచే, దాని వ్యాప్తికి, అమలుకు తోడ్పడాలనుకునే అన్ని సంస్థలు, వ్యక్తులు, ప్రపంచంలో ఎక్కడున్నా, యూనీకోడ్ కన్సార్టియంలో సభ్యత్వం పొందవచ్చు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం శాశ్వత సభ్యత్వం తీసుకుంది తద్వారా మన లిపిలోని అక్షరాలన్నింటికీ వారు కోడ్ కేటాయించారు. ఇంకా కావలసిన అక్షరాలు, పొల్లులు, వాడుకలో లేని అక్షరాలకు కూడా కోడ్ అభ్యర్తించారు.

తెలుగు యూనీకోడు

[మార్చు]

కంప్యూటర్లలో తెలుగు భాష వాడకం మొదలైంది 1993 ప్రాంతంలో ముద్రణా రంగంలో వచ్చిన అనివార్య సాంకేతిక అభివృద్ధి వల్లే. డిటిపి అప్లికేషన్లు తయారవడం, వాటిల్లో వాడటానికి తెలుగు ఫాంట్లు రూపొందించడం, ఇలా తయారైన పేజీలను ముద్రించడానికి లేజర్ ప్రింటర్లు లాంటి అత్యాధునిక పరికరాలు రావడంతో డెస్క్‌టాప్ పబ్లిషింగ్ శరవేగంగా అభివృద్ధి సాధించింది. ఎప్పుడైతే ఇంటర్‌నెట్ రంగప్రవేశం జరిగిందో, అప్పటినుంచే ప్రాంతీయ భాషలను కూడా అంతర్జాలంలో ప్రవేశపెట్టే ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే ఫాంట్లను వెబ్ పేజీల్లోకి చొప్పించడం ప్రయాసతో కూడుకున్న వ్యవహారం కావడం, చదివేవారికి కూడా సాంకేతిక అవగాహన కావాల్సి రావడంతో అంతగా ఆ ప్రయత్నం విజయవంతం కాలేకపోయింది. యూనీకోడ్ ఫాంట్ల (ఏకసంకేత ఖతులు లేదా విశ్వరూప ఖతులు) ప్రవేశం అంతర్జాల భాషావినియోగాన్ని సమూలంగా మార్చివేసింది. ప్రపంచలోని లిపియుక్త భాషలన్నింటికీ అంతర్జాల ప్రవేశాన్ని కల్పించి, వాటి ఉనికిని కూడా కాపాడగలిగింది. ఇప్పుడు తెలుగు భాషలో మంచి యూనీకోడు ఫాంట్లు అభివృద్ధి చేశారు. అందమైన అక్షరాలు రకరకాల పరిమాణాల్లో రూపొందించారు. వీటిలో చాలా వరకు ఉచితంగా లభిస్తాయి . తెలుగు భాష అక్షరాలకు ఈ క్రింది యూనీకోడు బ్లాకు ఇవ్వబడినది 0C00-0C7F (3072-3199).

తెలుగు
యూనీకోడ్.ఆర్గ్ పటం (పీడీఎఫ్)
  0 1 2 3 4 5 6 7 8 9 A B C D E F
U+0C0x      
U+0C1x  
U+0C2x  
U+0C3x         ి
U+0C4x        
U+0C5x             ౘ‍            
U+0C6x    
U+0C7x                 ౿

ఇవీచూడండి

[మార్చు]

బయటి లంకెలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Unicode character database". The Unicode Standard. Retrieved 2016-07-09.
  2. "Enumerated Versions of The Unicode Standard". The Unicode Standard. Retrieved 2016-07-09.
  3. 3.0 3.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-06-30. Retrieved 2009-08-05.
"https://te.wikipedia.org/w/index.php?title=యూనికోడ్&oldid=4104552" నుండి వెలికితీశారు