రదనికలు
రదనికలు | |
---|---|
This dog's longer pointed cuspids show why they are particularly associated with canines. | |
Permanent teeth of right half of lower dental arch, seen from above. | |
లాటిన్ | dentes canini |
గ్రే'స్ | subject #242 1116 |
MeSH | Cuspid |
రదనికలు (Canines) క్షీరదాలలో విషమ దంత విన్యాసంలో ఉంటాయి. ఇవి కుంతకాలకు వెనుకగా మొనదేలి ఉంటాయి. అడవి పంది మొదలైన మాంసాహార జంతువులల్లో వీటినే కోరలు అంటారు. లాగోమార్ఫా, రొడెన్షియా లలో ఇవి లోపించి ఉంటాయి.
చరిత్ర
[మార్చు]కుక్క కోరలతో పోలిక ఉన్నందున వీటికి కుక్కల పళ్ళు పేరు పెట్టబడ్డాయి. మనుషుల నోటిలో ఈ దంతాలు పొడవుగా, పదునైనవి కావు, కానీ అవి ఒకే తీరుగా , ఇతర దంతాలతో చుస్తే ఇవి ఎక్కువ పొడవుగా ఉంటాయి . అమెరికన్ డెంటల్ అసోసియేషన్ తెలిపిన ప్రకారం, శిశువుకు 16 నెలల వయస్సు వచ్చిన తరువాత మొదటి దవడ పంటి సాధారణంగా పై దవడలో విస్ఫోటనం చెందుతుంది, తరువాత 23 నెలల వయస్సులో అన్ని దంతాలు ( పళ్ళు) రావడం జరుగుతుంది , పిల్లలు 9 నుండి 12 సంవత్సరాల వయస్సులో వారి ప్రాధమిక పళ్ళను కోల్పోతారు. పొడవుగా ఉన్న కోర పళ్ళు ఎందుకు అవసరం? ఈ పళ్లతో తినడం, మాట్లాడటం, పెదవుల ఆకారాన్ని కాపాడుకోవడం తో పాటు ఇతర దంతాలను స్థానానికి మార్గనిర్దేశం చేయడంలో ఈ దంతాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పొడవైన కోర పళ్లతో ఆహారము లో ఉన్న గట్టి పదార్థములను ముక్కలు గా చేయడం, మనుషులు తినే ఆహరం లో తొందరగా జీర్ణం కావడము జరుగుతుంది , మనుషులు మాట్లాడేటప్పుడు పదాలను రూపొందించడంలో సహాయపడతాయి. దవడ తిరగడములో పళ్ళ సమతుల్యతను కోర పళ్ళు సహాయ పడతాయి. కోర పళ్ళు ఆకారం , వాటి నిర్మాణం నోటిలో ఏంతో సహాయ పడతాయి , ఈ కోర పళ్లను బ్రష్ చేస్తున్నప్పుడు జాగ్రత్త తీసుకుంటే మనుషులకు ఏంతో మేలు జరుగుతుంది [1]
నాలుగు కోరలు పదునైన దంతాలు గా అని పిలుస్తారు . ప్రాధమిక వచ్చే కోరలు 16, 20 నెలల మధ్య కనిపిస్తాయి, 9 సంవత్సరాల వయస్సులో విస్ఫోటనం చెందుతాయి, పైన వచ్చే కోర పళ్ళు 11-12 సంవత్సరాల వయస్సులో వస్తాయి. కోరలు దంతాల ‘మూలల్లో’ ఉన్నాయి. ఈ కోర పళ్ల పొడవుగా ,పదునైనవిగా ఉండటంతో ఈ దంతములను మాంసాహార జంతువుల పాలతో పోలుస్తారు. ఈ దంతాల చుట్టూ చిగుళ్ళ కణజాలం క్షీణించే ప్రమాదాన్ని తగ్గించడానికి, పళ్ళు తోముకోవడం లో జాగ్రత్త చాలా అవసరం ఎందుకంటే ఇది చిగుళ్ళు, ఎనామెల్ ఉపరితలాలను రక్షించడంలో సహాయ పడుతుంది .[2]
మూలాలు
[మార్చు]- ↑ "What Is A Canine Tooth?". www.colgate.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-12-14.
- ↑ "What is the role of canine teeth?". www.omdentalllc.com. Retrieved 2020-12-14.
- జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.