Jump to content

రమాకుమారి దేవి

వికీపీడియా నుండి
రమాకుమారి దేవి

మాజీ ఎమ్మెల్యే
పదవీ కాలం
1967-1972
నియోజకవర్గం మాడుగుల శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1930-12-23)1930 డిసెంబరు 23
మరణం 2023 జనవరి 2(2023-01-02) (వయసు 92)
జయపురం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్

రమాకుమారి దేవి (1930, డిసెంబరు 23 - 2023, జనవరి 2) జయపురం ఆఖరి మహారాణి, మాజీ శాసనసభ్యురాలు.[1] కాంగ్రెస్ పార్టీ తరపున 1967 నుండి 1972 వరకు మాడుగుల శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించింది.[2]

జననం

[మార్చు]

రమాకుమారి దేవి 1930, డిసెంబరు 23న జన్మించింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

రమాకుమారి దేవికి జయపురం ఆఖరి మహారాజు రామకృష్ణ దేవ్‌ (సాహిత్య సామ్రాట్‌ విక్రమదేవ్‌ వర్మ కుమారుడు)తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. ఇద్దరు యువరాణిలు (కోడల్లు), మనుమడు విశ్వేశ్వర చంద్రచూడ్‌ దేవ్, మనుమరాలు ఉన్నారు.[3]

యువరాణిగా

[మార్చు]

1951-52 మధ్యకాలంలో జయపురంను పాలించింది. ఆ సమయంలోనే మోతీ ప్యాలస్ హవా మహల్ ను నిర్మించింది. 2018లో ఈ మహల్ బాధ్యతలను తన పెద్ద కోడలు మయాంక్ దేవికి అప్పజెప్పింది.

రాజకీయ జీవితం

[మార్చు]

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రమాకుమారి దేవి, ఆ పార్టీలో కీలక నేతగా వ్యవహరించింది. 1967లో కాంగ్రెస్ పార్టీ తరపున మాడుగుల శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటిచేసి స్వతంత్ర అభ్యర్థి ఎస్. భూమిరెడ్డిపై 20,257 ఓట్ల మెజారిటితో గెలుపొందింది.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
1967 27 మాడుగుల జనరల్ రమాకుమారి దేవి స్త్రీ కాంగ్రెస్ 34,561 ఎస్. భూమిరెడ్డి పు స్వతంత్ర 14,304

మరణం

[మార్చు]

రమాకుమారి దేవి తన 92 ఏళ్ళ వయసులో 2023, జనవరి 2న రాజభవనం మోతీ ప్యాలస్ లో మరణించింది. జయపురం చందన్వాడలోని రాజుల ప్రత్యేక శ్మశాన వాటికలో రాజ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరిగాయి.[4]

మూలాలు

[మార్చు]
  1. "నిరాడంబరంగా రమాకుమారి జన్మదిన వేడుకలు". Prajasakti (in ఇంగ్లీష్). 2021-12-24. Archived from the original on 2021-12-23. Retrieved 2023-01-06.
  2. "జయపురం మహారాణి రమాదేవి కన్నుమూత". EENADU. 2023-01-03. Archived from the original on 2023-01-06. Retrieved 2023-01-06.
  3. "జయపురం మహారాణి ఇక లేరు". Sakshi. 2023-01-03. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-06.
  4. Web, Disha (2023-01-03). "Visakha: జయపురం మహారాణి అంత్యక్రియలు పూర్తి". www.dishadaily.com. Archived from the original on 2023-01-06. Retrieved 2023-01-06.