రాజకీయ పార్టీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాజకీయ పార్టీ అనేది ఒక దేశంలో ఎన్నికలలో పోటీ చేయడానికి అభ్యర్థులను సమన్వయం చేసే సంస్థ. ఒక పార్టీ సభ్యులు రాజకీయాల గురించి ఒకే విధమైన ఆలోచనలను కలిగి ఉండటం సర్వసాధారణం. ఇంకా పార్టీలు నిర్దిష్ట సిద్ధాంతాలను కలిగి ఉండవచ్చు, లేదా విధాన లక్ష్యాలను ప్రోత్సహించవచ్చు.

గత కొన్ని శతాబ్దాలుగా ఆధునిక పార్టీ సంస్థలు అభివృద్ధి చెంది ప్రపంచవ్యాప్తంగా విస్తరించినందున, దాదాపు ప్రతి దేశ రాజకీయాలలో రాజకీయ పార్టీలు ప్రధాన భాగంగా మారాయి. కొన్ని దేశాల్లో రాజకీయ పార్టీలు లేనప్పటికీ, ఇది చాలా అరుదు. చాలా దేశాలు అనేక పార్టీలను కలిగి ఉండగా, కొన్ని దేశాలలో ఒక పార్టీ మాత్రమే ఉంది. నిరంకుశ లేదా ఏకఛత్రాధిపత్య రాజకీయాలు, ప్రజాస్వామ్యాలలో పార్టీలు ముఖ్యమైనవి. అయితే సాధారణంగా ప్రజాస్వామ్యంలో నిరంకుశత్వాల కంటే ఎక్కువ రాజకీయ పార్టీలు ఉంటాయి. నిరంకుశత్వాలు తరచుగా దేశాన్ని పరిపాలించే ఒకే పార్టీని కలిగి ఉంటాయి. కొంతమంది రాజకీయ శాస్త్రవేత్తలు రెండు లేదా అంతకంటే ఎక్కువ పార్టీల మధ్య పోటీని ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన భాగంగా భావిస్తారు.

దిగువ, ఉన్నత వర్గాల మధ్య విభజనల వంటి సమాజంలో ఉన్న విభజనల నుండి పార్టీలు అభివృద్ధి చెందుతాయి. వారు తమ సభ్యులకు సహకరించమని ప్రోత్సహించడం ద్వారా రాజకీయ నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను క్రమబద్ధీకరిస్తారు. రాజకీయ పార్టీలు సాధారణంగా పార్టీ నాయకుడిని కలిగి ఉంటాయి. అతను పార్టీ కార్యకలాపాలకు ప్రాథమిక బాధ్యత వహిస్తాడు; పార్టీ కార్యనిర్వాహకులు, ఎవరు నాయకుడిని ఎన్నుకోవచ్చు, ఇంకా ఎవరు పరిపాలనా మరియు సంస్థాగత పనులను చేస్తారని నిర్ణయిస్తాడు. పార్టీ సభ్యులు, పార్టీకి సహాయం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రావచ్చు, దానికి డబ్బు విరాళంగా ఇవ్వవచ్చు, దాని అభ్యర్థులకు ఓటు వేయవచ్చు. రాజకీయ పార్టీలను నిర్మించడానికి, ఓటర్లతో మమేకం కావడానికి అనేక మార్గాలు ఉన్నాయి. రాజకీయ పార్టీలకు పౌరులు ఇచ్చే విరాళాలు తరచుగా చట్టం ద్వారా నియంత్రించబడతాయి. పార్టీలు కొన్నిసార్లు వారికి సమయం మరియు డబ్బును విరాళంగా ఇచ్చే వ్యక్తులకు అనుకూలంగా పరిపాలిస్తాయి.

అనేక రాజకీయ పార్టీలు సైద్ధాంతిక లక్ష్యాల ద్వారా ప్రేరేపించబడుతున్నాయి. ప్రజాస్వామ్య ఎన్నికలలో ఉదారవాద, సంప్రదాయవాద, సామ్యవాద పార్టీల మధ్య పోటీలు ఉండటం సర్వసాధారణం; చాలా పెద్ద రాజకీయ పార్టీల ఇతర సాధారణ సిద్ధాంతాలలో కమ్యూనిజం, పాపులిజం, జాతీయవాదం మరియు ఇస్లామిజం ఉన్నాయి. వివిధ దేశాలలోని రాజకీయ పార్టీలు తమను తాము ఒక నిర్దిష్ట భావజాలంతో గుర్తించుకోవడానికి తరచూ ఒకే విధమైన రంగులు, చిహ్నాలను అవలంబిస్తాయి. అయినప్పటికీ, అనేక రాజకీయ పార్టీలకు సైద్ధాంతిక అనుబంధం లేదు. దానికి బదులు తమ పార్టీకి పెద్ద మొత్తంలో విరాళాలను సమకూర్చిన వారికి అనుకూలంగానో, లేక పార్టీని స్థాపించిన వారిని, లేదా వారసులను ప్రోత్సహించడమో, లేక వివిధ రకాల సమస్యలతో సతమతమవుతున్న వోటర్లను తమ పార్టీలో ఒకే గొడుకు కిందకు తీసుకురావడమో చేస్తుంటాయి.

మూలాలు

[మార్చు]