Jump to content

రాయల్ రోడ్డు

వికీపీడియా నుండి
అచేమెరిడ్ సామ్రాజ్యం మ్యాప్ లో హీరోడొటస్ ఉదహరించిన రాయల్ రోడ్డు మార్గం.

రాయల్ రోడ్ అనేది ప్రాచీన హైవే. దీనిని క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన పర్షియా సామ్రాజ్యాధిపతి డరియస్ I ఈ దారిని కనుగొని, అభివృద్ధి చేయించారు.[1] పర్షియాలోని సుసా నుంచీ సర్దిస్ వరకూ విస్తరించి ఉన్న విశాలమైన తన సామ్రాజ్యంలో సమాచారం, ప్రయాణా సౌకర్యాల దృష్ట్యా ఈ దారిని అభివృద్ధి చేశారు ఆయన.[2] ఈ దారిలో అంగరియం కొరియర్లు దాదాపు 1677 మైళ్ళు (2699కి.మీ) ఏడు రోజుల్లో దాటేసేవారు. నిజానికి సుసా నుంచీ సర్దిస్ వరకు నడిచి ప్రయాణం చేయడానికి 90రోజులు పడుతుంది.[3] ప్రముఖ గ్రీకు చరిత్రకారుడు హీరోడొటస్ ఈ మార్గం గురించి ప్రస్తావిస్తూ ఈ పెర్షియన్ కొరయర్ల కన్నా వేగంగా ఏమీ ప్రయాణించలేవు. ఎండ కానీ, మంచు కానీ అవేవీ వీటి ప్రయాణాన్ని ఆపలేవు అని రాశారు.

  1. A modern study is D.F. Graf, The Persian Royal Road System, 1994.
  2. Fox, Alexander the Great, 1973:96.
  3. Kia, Mehrdad (2016). The Persian Empire: A Historical Encyclopedia. Santa Barbara: ABC-CLIO. p. 127. ISBN 1610693914.