రెండవ బేతరాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రోలుని అనంతరం అతని కొడుకు రెండవ బేతరాజు 1076లో అనుమకొండ రాజ్యాధిపతి అయ్యాడు. చాళుక్య రాజ అంతరకలహాలలో ఇతను విక్రమాదిత్యుని సమర్థించి ఆతని ఆదరానికి పాత్రుడైనాడు. మంత్రి వైజదండనాయకుని రాజనీతితో సబ్బిమండలం చాలావరకు రాజ్యంలో కలుపుకున్నాడు. రెండవ బేతరాజు కాలముఖ శైవాచార్యుడు రామేశ్వర పండితుని నుండి శైవదీక్ష పొంది గురుదక్షిణగా అనుమకొండలో శివపురమనే భాగాన్ని, అందులో బేతేశ్వరాలయాన్ని నిర్మించాడు ఇతని బిరుదులు ' విక్రమచక్ర ', ' త్రిభువనమల్ల ' . అతని కుమారులు దుర్గరాజు, రెండవ ప్రోలరాజు.

దుర్గరాజు

[మార్చు]

రెండో బేతరాజు మరణాంతరము అతని కుమారుడు దుర్గరాజు 8 సంవత్సరాలు పాలించాడు. ఇతని బిరుదు ' త్రిభువనమల్ల దేవ ' ..అని కాజీపేట శాసనము తెలుపుతోంది. అయితే ఇప్పటిదాకా ఇతని పరిపాలనా విశేషాలు తెలియరాకున్నవి.

రెండవ ప్రోలరాజు

[మార్చు]

రెండవ ప్రోలరాజు దుర్గరాజు తమ్ముడు, రెండవ బేతరాజు కుమారుడు. కళ్యాణీ చాళుక్య వంశంలో ఆరవ విక్రమాదిత్యుని తరువాత రాజులు అంతగా సమర్ధులు కారు. అందువలన సామంత రాజులు అనేకులు స్వతంత్రులుగా ప్రకటించుకున్నారు. రెండవ ప్రోలరాజు ఇదే సమయంలో వారి రాజ్యాలపై దండెత్తి ఓడించి తన రాజ్యాన్ని విస్తరించాడు. ఈ విషయాలను హనుమకొండ శాసనం పేర్కొంటుంది.

మూలాలు

[మార్చు]
  • ఆంధ్రుల చరిత్ర,, తెలుగు అకాడమి ప్రచురణ
  • ఆంధ్ర దేశ చరిత్ర - సంస్కృతి, తెలుగు అకాడమి ప్రచురణ