Jump to content

లంబాడీ హక్కుల పోరాట సమితి

వికీపీడియా నుండి

లంబాడీ హక్కుల పోరాట సమితి (నంగారా భేరి) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లంబాడీ ,బంజారాల హక్కుల కోసం ఏర్పడిన సంఘము. ఈ సంఘాన్ని 01 జూలై 1997 లో తేజావత్ బెల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఆవిర్భావించింది[1].

లంబాడీ హక్కుల పోరాట సమితి ( LHPS)
నంగారా భేరి
ఆశయంలంబాడీ తండాలను,గూడలను గ్రాపపంచాయితీగా గుర్తించుడం
స్థాపనజూలై 01, 1997
వ్యవస్థాపకులుడా.తేజావత్ బెల్లయ్య నాయక్
ప్రధాన
కార్యాలయాలు
హైదరాబాద్, తెలంగాణ
సేవలులంబాడీల హక్కుల సాధన కోసం
వ్యవస్థాపక అధ్యక్ష్యుడుడా. తేజావత్ బెల్లయ్య నాయక్
రాష్ట్ర అధ్యక్షులుముడావత్ రాంబల్ నాయక్
ముఖ్యమైన వ్యక్తులుభుక్య కోట్యా నాయక్,బానోత్ రమేశ్ నాయక్,రామావత్ సక్రునాయక్,కైలాష్ నాయక్, అజ్మీరా స్వామి నాయక్,ముడావత్ సంజీవ్ చౌహన్, ధనావత్ బద్రు నాయక్, బిక్షపతి నాయక్
నినాదంమా తాండా లో మా రాజ్యం

లక్ష్యం

[మార్చు]

లంబాడీ జాతి ఆత్మ గౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం, రాజ్యాధికారం కోసం మా తాండా లో మా రాజ్యం అనే నినాదంతో లంబాడీ తాండా లను ప్రత్యేక పంచాయితీలుగా గుర్తించాలని ,లంబాడీ లకు కుల జనాభా ప్రకారం విద్య,ఉద్యోగ, సాంఘిక,ఆర్థిక ,రాజకీయ రంగాల్లో వాటా సాధించాలని,తద్వారా రాజ్యాధికారంలో సర్వజనులతో పాటు లంబాడీలను భాగస్వాములు చేయాలనే లక్ష్యంతో ఏర్పడిన సంఘం[2][3] .

కమిటీ తిర్మాణాలు

[మార్చు]

లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మా తాండా లో మా రాజ్యం అనే నినాదంతో మేము ఎంత మంది యో మాకు అంత వాటా అనే నినాదంతో 1997 జులై 1 ఒకటవ తారీఖున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నందు లంబాడీ హక్కుల పోరాట సమితి (యల్. యచ్.పి.యస్) అనే సంఘం ఏర్పాటు చేయడం జరిగింది.

మా తాండాలో మా రాజ్యం 500 మంది జనాభా గల తాండాలను ప్రత్యేక గ్రామపంచాయితీలుగా గుర్తించడం[4].

ఫిబ్రవరి 15న లంబాడీల ఆరాధ్యదైవం సంత్ శ్రీ సేవాలాల్ జయింతి సందర్భంగా సేలవు ప్రకటించాలి[5]. ఎస్టీ రిజర్వేషన్ రక్షణ,రాజ్యాంగ బద్ధంగా రావలసిన 10% రిజర్వేషన్లను సాధించాడం[6][7].

బంజారా భాష (గ్వార్ బోలి)భాషను రాజ్యాంగంలో 8 వ‌ షేడ్యూల్ లో చేర్చాలి.

జీ వో నెం 3 ను వెంటనే పునరుద్ధరించాలి

గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు పాసు పుస్తకాలు ఇవ్వాలి.

గిరిజన ఆశ్రమ ,హాస్టల్స్ గురుకులాల్లో డైట్ బిల్లులు సకాలంలో విడుదల చేసి గిరిజన విద్యార్థులకు పౌష్టిక ఆహారంతో కూడిన మెరుగైనా మెను ను వసతులను కల్పించాలి.

ఐటిడిఎ పరధిలోని ఏజెన్సీ విద్యకు పటిష్టం పరచడం కోసం ప్రత్యేక ఏజేన్సి విద్యాధికారిని నియమించడం. ఎస్టీ ఆట్రాసిటి చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడం.

గిరిజన మహిళలు పై జరుగుతున్న దాడులను అరికట్టాలి.

గిరిజన ఉద్యోగులకు ప్రమోషన్ లు రాకుండా జరుగుతున్న అక్రమ కేసులు ఎత్తివేయాలి.

ఏజేన్సిలో గిరిజన చట్టాలను రక్షణ కల్పించాలి[8].

గిరిజన విద్యార్థినులకు కే.జి నుండి పి.జి వరకు విద్య నిందించాలి.డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు స్కాలర్ షిపు సకాలంలో అందించడం,ఎస్టీ బ్యాక్ ఉద్యోగాల భర్తీ ప్రమోషన్ ల్లో ఎస్టీలకు రిజర్వేషన్లు, లంబాడీ తాండా లకు కనీస సౌకర్యాలు,గిరిజన విద్యార్థిని విద్యార్థులకు యువజనులకు, మహిళల సమస్యల పై సమావేశాలు నిర్వహించి చైతన్య పరచడం.

మూలాలు

[మార్చు]
  1. ABN (2022-06-29). "'సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి'". Andhrajyothy Telugu News. Retrieved 2024-06-26.
  2. ABN (2023-08-30). "తండాలను గ్రామ పంచాయతీలు చేశాం". Andhrajyothy Telugu News. Retrieved 2024-06-26.
  3. Velugu, V6 (2023-11-08). "లంబాడీలకు కాంగ్రెస్ అన్యాయం .. లంబాడీ హక్కుల పోరాట సమితి". V6 Velugu. Retrieved 2024-06-26.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  4. ABN (2023-08-30). "తండాలను గ్రామ పంచాయతీలు చేశాం". Andhrajyothy Telugu News. Retrieved 2024-06-26.
  5. Bharat, E. T. V. (2023-12-16). "అసెంబ్లీని ముట్టడించిన గిరిజనుల హక్కుల పోరాట సమితి సభ్యులు". ETV Bharat News. Retrieved 2024-06-26.
  6. editor (2024-06-15). "రిజర్వేషన్ల పరిరక్షణతో పాటు పెంపుదలకు ఉద్యమించాలి". Neti Gadar News (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2024-06-26. Retrieved 2024-06-26. {{cite web}}: |last= has generic name (help)
  7. Bharat, E. T. V. (2020-03-16). "'ఆరున్నర ఏళ్లయింది.. రిజర్వేషన్ల సంగతి ఏమైంది'". ETV Bharat News. Retrieved 2024-06-26.
  8. ABN (2023-06-22). "గడల అవినీతిపై విచారణ జరిపించాలి". Andhrajyothy Telugu News. Retrieved 2024-06-26.