లింగమనేని రమేశ్
లింగమనేని రమేశ్ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్త. అతను ఎయిర్ కోస్టాకు చైర్మన్‌గా ఉన్నాడు. 1983లో లింగమనేని ఎస్టేట్స్ పేరుతో ఓ కంపెనీని ప్రారంభించాడు. ఈ సంస్ధ ఆంధ్రప్రదేశ్ లోని పలు నగరాల్లో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది.[1][2]
జీవిత విశేషాలు
[మార్చు]అతను విజయవాడలో జన్మించాడు. అతను కామర్స్ లో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందాడు. తన 19వ యేట నుండి తన కుటుంబానికి చెందిన రియల్ ఎస్టేట్ కార్యక్రమాలలో పనిచేసాడు. అతను భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచ-స్థాయి మౌలిక సదుపాయాల అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కృషి చేసాడు[3].
దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయం
[మార్చు]గుంటూరు జిల్లా లోని నంబూరు పంచాయతీ పరిధిలోని లింగమనేని ఎస్టేట్స్‌లో సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో శ్రీ భూ సమేత దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయం అతనిచే నిర్మించబడినది. పద్దెనిమిదేళ్ల క్రితం 2000లో తిరుమల తిరుపతి దేవస్థానంలో అతను స్వామివారిని దర్శించుకొని బయటకు వస్తున్నప్పుడు అతని మనస్సులో తట్టిన ఆలోచనా ఫలితం ఈ ఆలయ నిర్మాణం. 2012లో సుమారు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రాజధాని అమరావతి అంతర్భాగంలో, బెజవాడ దుర్గమ్మకు సమీపంలో ఆలయాన్ని నిర్మించారు.[4]