Jump to content

లీలా ట్రీటికోవ్

వికీపీడియా నుండి
లీలా ట్రీటికోవ్
మే 1, 2014న లీలా ట్రీటికోవ్
జననం (1978-01-25) 1978 జనవరి 25 (వయసు 46)
మాస్కో, యుఎస్ఎస్ఆర్
జాతీయతరష్యన్, అమెరికన్
వృత్తివికీమీడియా ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
సుగర్‌సిఆర్‌ఎం (SugarCRM) సాఫ్టువేరు కంపెనీ ఉపాధ్యక్షురాలిగా

లీలా ట్రీటికోవ్ (జననం: జనవరి 25, 1978) రష్యాలో జన్మించింది, ఈమె ఎంటర్ప్రైజ్ సాఫ్టువేర్ లో నిష్ణాతులైన సాంకేతిక నిపుణురాలు. యుక్తవయస్సులోనే యు.ఎస్ కు వలస వచ్చింది, ఈమె 1999లో కాలిఫోర్నియాలో ఒక ఇంజనీర్ గా పని ప్రారంభించి, ఒక కంపెనీ స్థాపించింది, అనేక సాఫ్టువేరు పేటెంట్లు పొందింది, క్రమంగా చివరికి సుగర్‌సిఆర్‌ఎం (SugarCRM) సాప్టువేరు కంపెనీ ఇంజనీరింగ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ గా, ఉపాధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించింది. ఈమె స్యూ గార్డనర్ స్థానంలో మే 2014 లో వికీమీడియా ఫౌండేషన్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.

ప్రారంభ జీవితం, విద్య

[మార్చు]

ట్రీటికోవ్ మాస్కోలో జనవరి 25, 1978 న జన్మించింది, ఈమె తండ్రి ఒక గణిత శాస్త్రజ్ఞుడు, ఈమె తల్లి ఒక చిత్ర నిర్మాత. ఈమె లోమోనోసోవ్ మాస్కో స్టేట్ యూనివర్సిటీలో హాజరయ్యింది, 16 సంవత్సరాల వయస్సులో న్యూయార్క్ వెళ్లింది.