లూప్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇంట్రా యుటిరైన్ కాంట్రాసెప్టివ్ డివైస్ (Intra Uterine Contraceptive Device=IUCD) నే లూప్ అని వ్యవహరిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళలు కుటుంబ నియంత్రణ కోసం దీనిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇవి వివిధ పరిమాణాలలో, వివిధ ఆకారాలలో లభిస్తాయి. వైద్య నిపుణులు ఒక ప్రత్యేకమైన పరికరం సహాయంతో ఈ లూప్ ను గర్భాశయం లోపల అమరుస్తారు. దీని కుండే రెండు దారాలు గర్భాశయ ముఖద్వారం బయటనే ఉంటాయి. లూప్ సరిగ్గా అమరినదో లేదో చూసుకోవడానికి, లూప్ ను తొలగించే సమయంలో ఇవి ఉపయోగపడతాయి. గర్భాశయంలో లూప్ ను 2 నుండి 3 సంవత్సరాలు ఉంచవచ్చు.

ఇవి సాధారణంగా "T" ఆకారంలో ఉండి, దాని రెండు చేతులు గర్భాశయ గోడల్ని పట్టి ఉంచుతాయి. వీనిలో రెండు ముఖ్యమైన రకాలు. కొన్నింటిలో రాగి మూలకం ఉంటుంది. కొన్నింటిలో ప్రొజెస్ట్రోజెన్ అనే హార్మోన్ ఉంటుంది.

అనుకూలాంశాలు

[మార్చు]
  • తాత్కాలిక సంతాన నియంత్రణకు కచ్చితమైన ఉత్తమ పద్ధతి.
  • చాలా సులువుగా ఈ లూప్ ను అమర్చవచ్చును.
  • ఉపయోగించే వారికి ఇబ్బంది లేకుండా చాలా సహజంగా గర్భాశయంలో ఇది అమరిపోతుంది.
  • శుభ్రపరచడం, తిరిగి అమర్చడం వంటి సమస్యలు ఉండవు.
  • లూప్ వాడుతున్న సమయంలో ఇతర రకాలైన గర్భనిరోధక సాధనాలు ఉపయోగించాల్సిన అవసరం లేదు.

ప్రతికూలాంశాలు

[మార్చు]
  • లూప్ అమర్చిన తర్వాత కొంత మందిలో ఒక మాదిరి నుంచి, తీవ్ర రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది.
  • లూప్ ను ఉపయోగిస్తున్న కొందరిలో ఋతుక్రమం సరిగా లేకపోవడం, బహిష్టు సమయంలో నొప్పులు, నడుం నొప్పి, పొత్తి కడుపులో నొప్పి రావచ్చును.
  • లూప్ అమర్చిన తొలి నెలల్లో గర్భాశయం నుండి ప్రక్కకు తొలగిపోయిన ఉదంతాలు కూడా ఉన్నాయి. లూప్ కున్న దారాలు ఇందుకు నిదర్శనాలు.
"https://te.wikipedia.org/w/index.php?title=లూప్&oldid=2005797" నుండి వెలికితీశారు