లెవీ స్ట్రాస్ అండ్ కో.
ISIN | US52736R1023 |
---|---|
పరిశ్రమ | వస్త్రాలు |
స్థాపన | 1853 |
స్థాపకుడు | లెవీ స్ట్రాస్ |
ప్రధాన కార్యాలయం | సాన్ ఫ్రాన్సిస్కో, క్యాలిఫోర్నియా, అమెరికా |
సేవ చేసే ప్రాంతము | ప్రపంచవ్యాప్తం |
కీలక వ్యక్తులు | రిచార్డ్ ఎల్. కాఫ్ మన్ Chairman of the Board జాన్ ఆండర్సన్ President and CEO లెవీ క్రాక్ నెల్ |
ఉత్పత్తులు | జీన్స్ |
యజమాని | లెవీ స్ట్రాస్ వంశీకులు |
ఉద్యోగుల సంఖ్య | 11,400 (2008)[1] |
విభాగాలు | లెవీస్, డాకర్స్, సిగ్నేచర్. |
వెబ్సైట్ | [1] |
సంస్థ
[మార్చు]లెవీ స్ట్రాస్ అండ్ కో. డెనిం జీన్స్ లను తయారు చేసే ఒక ప్రైవేటు సంస్థ. 1853 లో లెవీ స్ట్రాస్ బవేరియా రాజ్యానికి చెందిన ఫ్రాంకోనియాలోని బుట్టెన్ హైం నుండి క్యాలిఫోర్నియా లోని సాన్ ఫ్రాన్సిస్కోకి వచ్చి తన సోదరుడు నిర్వహిస్తున్న వ్యాపారాన్ని పడమటి సముద్ర తీరాన నెలకొల్పు సందర్భంలో స్థాపింపబడింది. 1870 లలోనే డెనిం ఓవరాల్ లను రూపొందించినప్పటికీ, ఆధునికీ జీన్స్ 1920 వరకు రూపొందించబడలేదు. లెవీ స్ట్రాస్ యొక్క నలుగురు మేనల్లుళ్ళచే ప్రస్తుతం నిర్వహింపబడుతున్నది.
ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉన్న లెవీ స్ట్రాస్ మూడు విభాగాలుగా పనిచేస్తుంది. సాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా లెవీ స్ట్రాస్ అమెరికా, బ్రసెల్స్ కేంద్రంగా లెవీ స్ట్రాస్ ఐరోపా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, సింగపూర్ కేంద్రంగా ఏషియా పసిఫిక్ డివిజన్. ప్రపంచవ్యాప్తంగా 10,500 మంది పనిచేస్తున్న లెవీ స్ట్రాస్ రివెట్ లు వేసిన డెనిం జీన్స్ కి పెట్టింది పేరు.
1960, 70 లలో బ్లూ జీన్స్ కి ఉన్న ఆదరణ సంస్థ బాగా వృద్ధి చెందటానికి దోహదపడినది. జె. వాల్టర్ హాస్ సీనియర్, పీటర్ హాస్ సీనియర్, పాల్ గ్లాస్కో, జార్జ్ పి. సింప్కిన్స్ సీనియర్ ల నాయకత్వంలో గ్రేట్ వెస్టర్న్ గార్మెంట్ కో. (GWG) అను కెనెడియన్ సంస్థను కైవసం చేసుకోవటంతో బాటు సరిక్రొత్త ఫ్యాషన్లు, మాడళ్ళను (స్టోన్ వాష్ లాంటివి) పరిచయం చేశాయి. ఇప్పటికి కూడా లెవిస్ స్టోన్ వాష్ లలో GWG సాంకేతికతనే ఉపయోగించటం విశేషం.
భారతదేశంలో ఫిట్టింగ్ స్టయిల్ లు
[మార్చు]పురుషులకు
[మార్చు]- 501 - ఒరిజినల్:
- 504 - రెగ్యులర్ స్ట్రెయిట్: లో, స్లిం, స్లిం
- 505:
- 508 - రెగ్యులర్ టేపర్:
- 510 - స్కిన్నీ:
- 511 - స్లిం: హై రైజ్, రిలాక్స్డ్ లెగ్, స్ట్రెయిట్ బాటం
- 517: లో, టైట్, బూట్ కట్
- 531 - స్ట్రెయిట్: మిడ్, టైట్, స్ట్రెయిట్
- 541: లో, టైట్, స్ట్రెయిట్
- 65504 - స్కిన్నీ స్ట్రెయిట్:
స్త్రీలకు
[మార్చు]- 596: లో, స్లిం, న్యారో
- 595: మిడ్, స్లిం, న్యారో
- 594: హై, స్ట్రెయిట్
- 599: హై, టైట్
భారతదేశంలో లెవీ ఉత్పత్తుల తయారీదారులు
[మార్చు]- ఫూల్ చంద్ ఎక్స్ పోర్ట్స్ కి చెందిన ప్రతీక్ అపారెల్స్
- గోకాల్ దాస్ ఎక్స్ పోర్ట్స్ Archived 2010-02-13 at the Wayback Machine
- వండర్ బ్లూస్
ఇవి కూడా చూడండి
[మార్చు]బాహ్య లంకెలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;hoovers1
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు