Jump to content

లై-ఫై

వికీపీడియా నుండి

లై-ఫై (లైట్ ఫిడిలిటీ) అనగా కాంతి ద్వారా అంతర్జాలం పొందు నూతన సాంకేతిక పద్ధతి. దీనిని చైనీయులు కనిపెట్టారు. ఈ సరికొత్త విప్లవాత్మకమైన విధానంలో రేడియో పౌనఃపున్యానికి బదులుగా కాంతిని వాహకంగా ఉపయోగిస్తారు. ఈ సాంకేతికతతో ఒక వాట్ సామర్థ్యం ఉన్న ఎల్‌ఇడి బల్బుతో నాలుగు కంప్యూటర్లను అంతర్జాలానికి అనుసంధానం చేయవచ్చు. మైక్రోచిప్ లను కలిగివుండే ఒక బల్బు సెకనుకు 150 మెగా బిట్ల దత్తాంశంను (డేటా) ప్రసారం చేయగలదు.

లై-ఫై మాడ్యూల్స్

నేపథ్యం

[మార్చు]

ఈ పద్ధతిలో బల్బు ఉంటే చాలు దాన్నే అంతర్జాల (ఇంటర్నెట్) మాధ్యమంగా వినియోగించుకోవచ్చు. అంతర్జాల సదుపాయాన్ని ఒక్క కంప్యూటర్కు మాత్రమే కాకుండా కొన్ని సిస్టమ్స్‌కు కావాలంటే రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్‌ ఉపయోగించుకునే వై-ఫై రూటర్‌ (రౌటర్) ద్వారా నెట్‌ ప్రసారాలు చేయాల్సి వచ్చేది. పైగా ఈ పరికరాల ఖర్చు కూడా ఎక్కువే. దాంతో చైనా శాస్త్రవేత్తలు ఎల్‌ఇడి (లైట్ ఎమిటింగ్ డయోడ్) బల్బ్‌ ద్వారా ఈ ప్రసారాలు విజయవంతంగా చేసి నిరూపించారు. దీనివల్ల వై-ఫై కంటే కూడా రేడియేషన్‌ స్థాయి తక్కువగా ఉండటమే కాదు, శక్తి వినియోగం కూడా చాలా తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు. అంతేకాదు కాంతి ఉపయోగించి ఈ టెక్నాలజీని పనిచేసేలా చేస్తున్నారు. కాబట్టి దానికి లై-ఫై అని పేరు పెట్టారు. చైనాకు చెందిన షాంగై ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఫిజిక్స్‌ వారు. 2013 నవంబరు 5న చైనాలోని షాంగైలో దీన్ని ప్రదర్శనకు పెట్టారు. ఒకవేళ లైట్ ఆపివేస్తే సిగ్నల్‌ ఆగిపోయి నెట్‌ వర్క్‌ కూడా నిలిచిపోతుందని వీరు ప్రకటించారు. త్వరలోనే దీన్ని వాణిజ్యపరంగా వాడనున్నట్లు వారు తెలియచేశారు.

విశిష్టతలు

[మార్చు]

నీటిలో ప్రసారం కాగలదు

బయటి లంకెలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=లై-ఫై&oldid=4340395" నుండి వెలికితీశారు