లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్
లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ అమెరికాలో అతి ప్రాచీన ప్రభుత్వ సాంస్కృతిక సంస్థ. ఈ సంస్థ శాసనసభ (కాంగ్రెస్) కు పరిశోధనా విభాగముగా కూడా పని చేస్తోంది. 13 కోట్ల వస్తువులతో, 530 మైళ్ళు పొడవున ఉండే పుస్తకాల అరలతో, ఈ సంస్థ ప్రపంచములో అతి పెద్ద గ్రంథాలయం కూడా. ఈ వస్తు సముదాయములలో 2.9 కోట్ల పుస్తకాలు, ఇతర అచ్చు ప్రతులు, 27 లక్షల శబ్ద గ్రహణాలు (రికార్డింగులు), 1.2 కోట్ల ఫొటోలు, 48 లక్షల మ్యాపులు, 5.8 కోట్ల చేతివ్రాత ప్రతులూ ఉన్నాయి.
ఈ లైబ్రరీ బృహత్కార్యములు
- వనరులను కాంగ్రెసుకూ, ప్రజలకూ ఉపయోగపడేలా ఆందుబాటులో ఉంచటం
- సార్వత్రిక సముదాయమైన జ్ఞానమును సృజనాత్మకతను భావి తరములకు ఆందించుట
సభ్యత్వము
[మార్చు]ఈ లైబ్రరీ సామాన్య ప్రజలకు విద్యా విషయక పరిశోధనలకు, సందర్శకుల పర్యాటనలకు రోజూ తెరచి ఊండును. 18 సంవత్సరములు నిండిన వారు ఎవరైనా 'రీడరు గుర్తింపు కార్డు' పొంది రీడింగు రూములు, సముదాయము లను వీక్షించవచ్చును. కాని శాసనసభ సభ్యులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు వారి స్టాఫ్, కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు, లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ ఉద్యోగులు మాత్రమే పుస్తకాలను బయటకి తీసుకు వెళ్ళగలరు.
ఆమెరికాలో మిగతా గ్రంథాలయాలు ఇక్కడ నుండి 'ఆంతర గ్రంథాలయ ఋణము' (Inter-library loan) తీసుకొనవచ్చును.
సినారె కంఠస్వరం
[మార్చు]అమెరికా నేషనల్ లైబ్రరీవారు ప్రపంచం లోని ప్రముఖుల కంఠస్వరాన్ని భద్రపరిచే కార్యక్రమంలో భాగంగా సి.నా.రె. తెలుగు గజల్స్ ఆలపించిన టేపులను భద్రపరిచారు.