వాతాపి గణపతిం భజే
Appearance
వాతాపి గణపతిం భజే ముత్తుస్వామి దీక్షితులు రచించిన కీర్తన.
ఈ కీర్తన సామాన్యంగా హంసధ్వని రాగంలో ఆది తాళంలో గానం చేయబడుతుంది.
కీర్తన
[మార్చు]వాతాపి గణపతిం భజే
హం వారణాస్యం వరప్రదం | | వాతాపి | |
భూతాది సంసేవిత చరణం
భూత భౌతికా ప్రపంచ భరణం
వీతరాగిణం వినత యోగినం
విశ్వకారణం విఘ్నవారణం
పురాకుంభ సంభవమునివర
ప్రపూజితం త్రిభువన మధ్యగతం
మురారీ ప్రముఖ ద్యుపాసితం
మూలాధారా క్షేత్రాస్థితం
పరాది చత్వారి వాగాత్మకం
ప్రణవ స్వరూప వక్రతుండం
నిరంతరం నిఖిల చంద్రఖండం
నిజ వామకర విదృతేక్షు దండం
కరాంబుజపాశ బీజాపూరం
కలుష విదూరం భూతాకారం
హరాది గురుగుహ తోషిత బింబం
హంసధ్వని భూషిత హేరంబం | | వాతాపి | |
గానం చేసిన ప్రముఖులు
[మార్చు]- ఎం.ఎస్.సుబ్బలక్ష్మి [1]
- ఎం.ఎల్.వసంతకుమారి [2]
- వినాయక చవితి సినిమాలో టైటిల్ సాంగ్ గా ఈ పాటను [huj[ఘంటసాల వెంకటేశ్వరరావు]] గానం చేశారు. [3]parari
వివరణ
[మార్చు]- ముత్తుస్వామి దీక్షితార్ రచించిన ఈ కృతిలో త్రికోణ అనే పదం త్రిభువన గా, నిటల అనే పదం నిఖిల గా, ఘంటసాల గానంచేసిన వినాయక చవితి చిత్రంలో పాడారు. ఈ కృతి వివరణకు "వాతాపి గణపతింభజే: గణపతి పై అంత అందమైన కృతి ఎలా అయింది"[4] అన్న భక్తి బ్లాగ్ లో వివరించడమైనది.