వికీ కాన్ఫరెన్స్ ఇండియా
వికీ కాన్ఫరెన్స్ ఇండియా 2023 | |
---|---|
తేదీలు | 2923 ఏప్రిల్ 28 - 30 |
స్థలం | హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం |
ప్రారంభించినది | 2011 |
ఇటీవలి | 2016 |
Filing status | లాభాపేక్ష లేనిది |
వికీ కాన్ఫరెన్స్ ఇండియా (ఆంగ్లం: Wiki Conference India) అనేది భారతదేశంలో నిర్వహించబడిన జాతీయ వికీపీడియా సమావేశం. మొదటి వికీ కాన్ఫరెన్స్ ఇండియా నవంబరు 2011లో మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగింది. వికీమీడియా ఫౌండేషన్ సహకారంతో వికీమీడియా ఇండియా చాప్టర్[1][2] భాగస్వామ్యంతో ముంబై వికీపీడియా సంఘం దీనిని నిర్వహించింది.[3] ఈ సమావేశం దేశంలో వికీమీడియాకు వార్షిక జాతీయ ప్రధాన కార్యక్రమం కాగా అన్ని దేశాల పౌరుల భాగస్వామ్యం ఉంది. ఆంగ్లంతో సహా ఇతర భారతీయ భాషలలో వికీపీడియా ప్రాజెక్ట్‌లు, ఇతర సోదర ప్రాజెక్టులపై దేశానికి సంబంధించిన విషయాలపై దృష్టి కేంద్రీకరించబడింది.[4][5]
కాగా రెండవ సదస్సు 2016లో మొహాలీ నగరంలో నిర్వహించారు. ఇక మూడవ సదస్సు 2020లో అనుకున్నప్పటికీ, కోవిడ్-19 మహమ్మారి కారణంగా రద్దయింది. అయితే వికీపీడియా అభివృద్దిలో ఎంతో కీలక పాత్ర పోషించే ఈ సమావేశాలను 2023లో హైదరాబాదులో నిర్వహించారు.
వికీ కాన్ఫరెన్స్ ఇండియా 2011
[మార్చు]మహారాష్ట్ర రాష్ట్రంలోని ముంబైలో 2011 నవంబరు 18 నుండి 20 మధ్య జరిగిన వికీఇండియా మొదటి సమావేశం.[6]
వికీ కాన్ఫరెన్స్ ఇండియా 2016
[మార్చు]పంజాబ్ రాష్ట్రంలోని మొహాలీ నగరంలో రెండవ వికీ కాన్ఫరెన్స్ ఇండియా జరిగింది.[7]
వికీ కాన్ఫరెన్స్ ఇండియా 2023
[మార్చు]ఈ సదస్సు 2023 ఏప్రిల్ 28 నుంచి 30 వరకు హైదరాబాద్‌లో జరిగింది.[8] ఇది వికీమీడియన్లు, భారతీయ-భాష వికీమీడియా ప్రాజెక్ట్‌లు, భారతదేశంలో అలాగే కొన్ని దక్షిణాసియా ప్రాంతాలలో ఉద్యమం ఇతర అంశాల పట్ల ఆసక్తి ఉన్నవారికి ఒక ఉమ్మడి వేదికను అందించే జాతీయ స్థాయి సమావేశం.[9]
మూలాలు
[మార్చు]- ↑ IANS (9 November 2011). "Mumbai to host first WikiConference in India". India Current Affairs. Archived from the original on 26 డిసెంబరు 2018. Retrieved 15 November 2011.
- ↑ Unattributed (9 November 2011). "Mumbai To Host First Ever National WikiConference In India". EFY Times. EFY Enterprises. Archived from the original on 1 April 2012. Retrieved 15 November 2011.
- ↑ IANS (9 November 2011). "Wikipedia conference comes to India, set for Nov 18". Northern Voices Online. Retrieved 15 November 2011.
- ↑ "Wikipedia woos India with local languages". Hindustan Times. 19 November 2011. Archived from the original on November 21, 2011. Retrieved 19 November 2011.
- ↑ Unattributed (10 November 2011). "Wikipedia eyes India for language growth". Dawn.com. Retrieved 15 November 2011.
- ↑ Gupta, Bhawna (10 November 2011). "Jimmy Wales To Open The First WikiConference In India". techcircle.in. Retrieved 15 November 2011.
- ↑ Hindustan Times
- ↑ "WikiConference India 2023". Meta. 12 October 2022. Retrieved 19 February 2023.
- ↑ "WikiConference India 2023: Lessons promote the spread of knowledge about Indian culture and history on Wikipedia and other Wikimedia projects". web.archive.org. 2023-06-01. Archived from the original on 2023-06-01. Retrieved 2023-06-01.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)