వికీపీడియా:వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/ఆంధ్ర లొయోల కళాశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వికీప్రాజెక్టు ఆంధ్ర లొయోల కళాశాల



ముంగిలి వేడుకలు & శిక్షణ శిబిరాలు తెవికీ వ్యాసాల అభివృద్ధి వికీసోర్స్ తోడ్పాటు నివేదికలు చిత్రాలు సంప్రదింపులు



సీఐఎస్-ఏ౨కే మరియు ఆంధ్ర లొయోల కళాశాల మధ్య జరిగిన సంస్థాగత ఒప్పందం ప్రకారం ఆంధ్ర లొయోల కళాశాల విద్యార్థులు తెవికీ అభివృద్ధికి తోడ్పడనున్నారు. ఆంధ్ర లొయోల కాలేజీ యాజమాన్యం వారు, బోటనీ శాఖ ద్వారా సీఐఎస్ వారిని కాలేజీకి జూన్ నెలలో ఆహ్వానించడం జరిగింది. ఆ సమయంలో ఎంపిక చేసిన బోధనా సిబ్బందికీ, విద్యార్థులకూ సీఐఎస్ వారు వికీపీడియా, అంతర్జాలంలో విజ్ఞానం మొదలగు పలు విషయాలపై అవగాహన, శిక్షణ కలిపించడం జరిగింది. ఆ కార్యక్రమం యాజమాన్యానికి నచ్చి, ప్రిన్సిపాల్ ద్వారా వికీపీడియా, అంతర్జాల విజ్ఞానం అంశాలపై విద్యార్థులకు మరింత విజ్ఞానాన్ని అందించడం కోసం సీఐఎస్ ను తరచూ కళాశాలకు వచ్చి శిక్షణ ఇవ్వవలసినదిగా కోరడం జరిగింది. అలానే కళాశాలలోని వివిధ కంప్యూటర్ లాబుల్లోని సాఫ్టువేరులను స్వేచ్ఛా సాఫ్టువేరుతో మార్చాలని కోరారు. కళాశాలలోని ఆచార్యులు వ్రాసిన కొన్ని పుస్తకాలను కూడా అంతర్జాలం వేదికగా నలుగురికీ చేరేలా చెయ్యమని అడగటం జరిగింది. కళాశాల స్వయంప్రతిపత్తి గల సంస్థ కావున బోధనాంశాల్లో మారుతున్న సాంకేతికాంశాలను జోడించి, పాఠ్యాంశాల ప్రక్షాళన కోసం కూడా అడగటం జరిగింది. ఈ విషయాలను సీఐఎస్-ఏ౨కే జట్టు తిరిగి అంతరాలోచన జరిపి, ఏఎల్సీ తో కలిసి కొన్ని కార్యక్రమాలను ప్రతిపాదించి, కళాశాల యాజమాన్యం కోరిన విషయాలను వికీపిడియన్ల సహకారంతో, వికీపీడియా-వికీసోర్స్-వికీమీడియా ప్రకరణాలు వేదికగా చెయ్యాలని నిర్ణయించింది. ఇందుకు గానూ సంస్థాగత భాగస్వామ్య ఒప్పందానికి రావాలని నిర్ణయించుకున్నాము. ఈ విషయాన్ని కళాశాల యాజమాన్యానికి తెలియజేసినప్పుడు, వారు కూడా అదే ఆలోచనలో ఉన్నట్టుగా తెలిసింది. ఆగస్టు ౧౪న ఒప్పందం పై సంతకాలు జరిగాయి. "పాఠ్యాంశంగా వికీపీడియా" అనే కార్యక్రమం ద్వారా వికీపీడియా సంబంధిత కార్యక్రమాలను కళాశాలలో చేపట్టాలని సీఐఎస్-ఏ౨కే నిర్ణయించింది. ఈ ఒప్పందం చర్చలు లొయోల యాజమాన్యంతో జరుగుతున్న సమయంలో మొత్తం 80 మంది బోధన సిబ్బందిలో నుండి 10 మంది ఈ కార్యక్రమానికి తాము సంధానకర్తలుగా వ్య్వహరిస్తామని ముందుకొచ్చారు. వికీపీడియాను బోధనలో భాగంగా విద్యార్థులకు అందించడంలో వీరు ఆస్సక్తి కనబరచారు. వీరి ఆసక్తి వలన ఈ పది మందినీ ఆంధ్ర లొయోల కళాశాల కోర్ ఫాకల్టీ గ్రూప్ గా వ్యవహరించాలని నిర్ణయించడమయినది. ఈ కోర్ ఫాకల్టీ లోని ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు(/రాలు) పది మంది విద్యార్థులను ఎంపిక చేసి, వారి ద్వారా వికీపీడియా సంబంధిత కార్యక్రమాలను కళాశాలలో నిర్వహిస్తారు. ఇలా ఎంపికయిన విద్యార్థులను వికీపీడియా స్టూడెంట్ అంబాసడర్ గా గుర్తించి, వారికి విశేష శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ పది విద్యార్థుల ఎంపిక సంబంధిత ఉపాధ్యాయుడు/రాలు చేయవలసి ఉన్నప్పటికీ, వాళ్ళ నిష్పత్తి మాత్రం, 50% మొదటి సంవత్సరం గ్రాడ్యుయేట్, 20% రెండో సంవత్సరం గ్రాడ్యుయేట్ మిగితా వారు మూడో సంవత్సరం గ్రాడ్యుయేట్ లేదా మొదటి సంవత్సరం పీజీ నుండి ఉండాలి. ఈ విధంగా విద్యార్థులు ఎక్కువ కాలం ఈ కార్యక్రమంతో అనుబంధంగా ఉండవచ్చు. ఈ కోర్ ఫాకల్టీ, వికీపీడియా కాంపస్ అంబాసిడర్స్ కాలిసి వారి సబ్జెక్టులో ఉన్న 500 అవసరమయిన వ్యాసాలను గుర్తించి, ఆంగ్ల తెలుగు వికీపీడియాలలో ఆ వ్యాసాల పరిస్థితిని బేరీజు వేయాలి. ఈ వ్యాసాలు ఆయా సబ్జెక్టులకు సంబంధించిన బోధనాంశాలలో భాగంగా ఉండాలి.

ఈ బేరీజు వేసే పద్ధతి కింద తెలిపిన విధంగా ఉంటుంది :

౧. వ్యాసాన్ని గుర్తించడం, ఆ వ్యాసం తెలుగు వికీ/ఆంగ్ల వికీ లో ఉందో లేదో నిర్ధారించడం

౨. ఒకవేళ వ్యాసం ఇప్పటికే ఉంటే, ఆ వ్యాసం నిడివి, ఎన్ని ఋజువులు (సైటేషన్/రెఫరెన్స్) ఉన్నాయి, ఎన్ని బొమ్మలు ఉన్నాయి, ఎన్ని వికీలంకెలున్నాయి, ఎన్ని బాహ్య లంకెలున్నాయి.

౩. పైన కనుగొన్న లక్షణాలతో ఒక బేస్ లైన్ అనేది విద్యార్థుల సహాయంతో కోర్ ఫాకల్టీ రూపొందించాలి.

౪. ఈ బేస్ లైన్ ఆధారంగా ఎన్ని వ్యాసాల సృష్టి అవసరం, ఎన్ని వ్యాసాలు ఏ విధంగా మెరుగుపరచవచ్చు అన్న నిర్ధారణ చేసుకోవడం కుదురుతుంది.

౫. ఈ బేస్ లైన్ ఆధారంగానే మూడు నెలలకొకసారి కార్యక్రమం పురోగతిని విశ్లేషించవచ్చు.

ఈ బేస్ లైన్ సిద్ధం అయిన వెంటనే సీఐఎస్-ఏ౨కే సంబంధిత కోర్ ఫాకల్టీ సభ్యుడు-అంబాసిడర్ లకు పూర్తి సహకారం అందజేస్తూ తగు శిక్షణ ఇస్తుంది. ౩ నెలల వ్యవధిలో ఎలాంటి పురోగతి సాధించాల్సి ఉంది అన్న విషయమై కోర్ ఫాకల్టీ సీఐఎస్-ఏ౨కే వారితో చర్చించాలి. వ్యాసాల జాబితా, ప్రత్యేక సబ్జెక్టు సిబ్బంది, అంబాసిడర్లు మొ॥ వివరాలు ప్రాజెక్టు పేజీలో ఉంచబడతాయి. ఈ ప్రాజెక్టు పేజీలోనే కార్యక్రమ పురోగతి కూడా ఎప్పటికప్పుడు చేర్చబడుతుంది. తెవికీ సభ్యులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసే విధంగా సీఐఎస్--ఏ౨కే సభ్యులను ఆన్లైన్ మెంటర్లుగా ఆహ్వానించనుంది. శిక్షణ జరుగుతున్నపుడు కూడా తెవికీ సభ్యులు శిక్షణ కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. వారి రవాణా మరియు వసతి సదుపాయాలకు సీఐఎస్-ఏ౨కే సహకారం అందజేస్తుంది. సీఐఎస్-ఏ౨కే ఆంధ్ర లొయోల కళాశాల వద్ద చేపట్టబోయే కార్యక్రమాలలో మొదటిది ఈ విధంగా వికీపీడియాలో నేరుగా వ్యాసాల చేర్పు మరియు మెరుగుపరచడం.

ఇక రెండో కార్యక్రమం వికీసోర్స్ కు అనువుగా పుస్తకాల పునరావిష్కరణ. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్ర లొయోల కళాశాలలోని వివిధ బోధనా సిబ్బంది, ఆచార్యులు, భాషావేత్తలు వ్రాసిన అనేకానేక క్కృతులను CC-BY-SA ద్వారా విడుదల చేసే విధంగా ఆయా వ్యక్తులను ప్రభావితం చేయడం, వారి ద్వారా ఆ పుస్తకాలు స్వేచ్ఛా లైసెన్సులో విడుదలయ్యాక వాటిని వికీసోర్స్ ద్వారా అందరికీ అందించడం. ఇదే కాక తెలుగు విభాగం వారితో పని చేస్తూ ఇప్పటికే కాపీరైటు కాలపరిమితి దాటిన పుస్తకాలను వికీసోర్స్ లో టైపు చేసే విధంగా తెలుగును ద్వితీయ భాషగా అభ్యసించే విద్యార్థులకు శిక్షణనివ్వటం. తెలుగు టైపు చేయడం, పుస్తకాలను వికీసోర్స్/కామన్స్ లో చేర్చడం, పుస్తకాలను సరిచూడడం, పూర్తి స్థాయి ఈఎ-పుస్తకం గా పుస్తకాలను మలచడం మొ॥ విషయాలలో తెలుగు విభాగం విద్యార్థులకూ, సిబ్బందికీ శిక్షణ ఇవ్వనున్నాము. ఈ కార్యక్రమం ద్వారా సీఐఎస్-ఏ౨కే--ఆంధ్ర లొయోల కళాశాల తెలుగు విభాగం--తెలుగు వికీపీడియనుల మధ్య బలమైన బంధం ఏర్పడి దీర్ఘకాలం నిలుస్తుందని అభిలషిస్తున్నాము.

ఇక కార్యక్రమంలో మూడో భాగం స్వేచ్ఛా వాతావరణాన్ని కళాశాలలో ఏర్పరచడం. ఆగస్టులో ఆంధ్ర లొయోల కళాశాలను సందర్శించినప్పుడు కళాశాలలోని వివిధ విభాగాల కంప్యూటర్ లాబులను పరిశీలించడం జరిగింది, అవన్నీ విండోస్ ఎక్స్పీ లో తెలుగు-భారతీయ భాషలకు సహకారంలేని స్థితిలో ఉన్నాయి. వాటిలో వాడే వివిధ ఉపకరణాలు కూడా చాలా పాతవి-కాలపరిమితి చెల్లిపోయినవి ఉన్నాయి. దాదపుగా 500 కంప్యూటర్లు కళాశాలలో కలవు (ఇది ఆంధ్ర లొయోల ఇంజనీరింగ్ కళాశాలను మినహాయించి). కళాశాల యాజమాన్యానికీ, బోధన సిబ్బందికీ జూన్ లో జరిగిన సమావేశంలోనే స్వేచ్ఛా సాఫ్టువేర్ల గురించి తెలియపరచటం, దాని పనితనం గురించి చెప్పటం జరిగిపోయింది. యాజమాన్యం, ముఖ్యంగా ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ నుండి లాబులలో స్వేచ్ఛా సాఫ్టువేరులు స్థాపించాల్సిందిగా వారు కోరారు. తొలి ప్రయత్నంగా కళాశాలలోని ౩౦ కంప్యూటర్లు గల ఒక ల్యాబును పూర్తిగా స్వేచ్ఛా సాఫ్టువేరుతో స్థాపించడం జరిగింది. ఈ పనిలో కళాశాల విద్యార్థులూ, స్వచ్ఛంద స్వేచ్ఛా సాఫ్టువేర్ సభ్యులు పాల్గొనటం జరిగింది. దశల వారీగా అన్ని కళాశాల కంప్యూటర్లలో స్వేచ్ఛా సాఫ్టువేరును స్థాపించమని కళాశాల యాజమాన్యం సీఐఎస్-ఏ౨కే ను కోరారు. ఈ దిశగా సీఐఎస్-ఏ౨కే వారు ఆరు మాసాల పాటూ ఈ పనిని చేపట్టి, కళాశాల యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు, మరీ ముఖ్యంగా కంప్యూటర్ లాబ్ సిబ్బందిని స్వేచ్ఛా సాఫ్టువేరులు వాడేందుకు సుశిక్షితులను చేస్తారు. అవకాశమున్న మేర FOSS సభ్యులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తాము.