వృత్త్యానుప్రాసాలంకారము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వృత్త్యనుప్రాసాలంకారము : ఒక హల్లు అనేక పర్యాయములు వచ్చునట్లు చెప్పబడినది. ఈ హల్లు ఒకే అచ్చుతో గాని లేదా వివిధ అచ్చులతో కలసినవి అయినా ఉండవచ్చును.


లక్షణం : ఏకద్విప్రభృతీనాంతు వ్యంజనానాం యథాభవేత్ పునరుక్తి రసౌనామ్నా వృత్త్యను ప్రాస ఇష్యతే.

ఉదాహరణలు

[మార్చు]

ఉదాహరణ 1 : "చొక్క పుటుక్కు క్రిక్కిరిసి స్రుక్కక పెక్కువ నక్క జంబుగన్." ఇందులో 'క్క' అనే హల్లు అనేకసార్లు తిరిగి వచ్చినది.

ఉదాహరణ 2 : "ఇందువదన కుందరదన మందగమన సొగసులలనవే" అను సినిమా పాటలోని పల్లవి. ఇందులో బిందుపూర్వక దకారం 'ంద' అనేక సార్లు తిరిగి తిరిగి రావడం జరిగింది.

ఉదాహరణ 3 : "కామాక్షీ! నీ కుక్షికి శిక్షగా కక్షతో అన్నం అక్షయ రక్షగా ప్రత్యక్షం నీ అక్షికి కనబడేలా చేయించనా ?" ఇందులో 'క్ష' అనే హల్లు అనేక సార్లు తిరిగి తిరిగి వచ్చింది.

ఉదాహరణ 4 : "అడుగులు తడబడ బుడతడు వడివడి నడిచెను?" ఇందులో అనే హల్లు అనేక సార్లు తిరిగి తిరిగి వచ్చింది.

ఉదాహరణ 5 : "ఆ జెర్రి మర్రి తొర్రలో బిర్రబిగిసి పరుండి యున్నది?" ఇందులో అనే హల్లు అనేక సార్లు తిరిగి తిరిగి వచ్చింది.

ఉదాహరణ 6 : "అమ్మల గన్నయమ్మ ముగురమ్మలగన్న మూలపుటమ్మ" మ్మ అని ప్రాసలో నాలుగు సార్లే కాకుండా మరొక ఆరు సార్లు మ్మ కారం ప్రయోగించబడింది.

'ఉదాహరణ 7 : "నిష్టల పోష్టు మాష్టారు గారి కనిష్ట పుత్రుడు అష్టకష్టాలు పడి హిష్టరీలో ఫష్టు మార్కులు తెచ్చు కొనెను" ఇందులో 'ష్ట' అనే హల్లు పలుమార్లు వచ్చింది.