హల్లులు

వికీపీడియా నుండి
(హల్లు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

తెలుగులోని అక్షరాలను అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు అనే మూడు విభాగాలుగా విభజించారు. "" నుండి "" వరకు మొదటి 16 అక్షరాలను అచ్చులు అంటారు. తరువాత "" నుండి "క్ష" వరకు ఉన్న అక్షరాలను హల్లులు అంటారు. కొందరు "క్ష"అనేది ఒక ప్రత్యేక అక్షరంగా పరిగణించరు. క్రింది పట్టికలో "" అక్షరం చివరిలో ఉంది. కాని కొన్ని వర్ణమాలలలో "" తరువాత ""ను చూపుతారు.

వ్యంజనములు

[మార్చు]

హల్లులను ప్రాణులు లేదా వ్యంజనములు అని కూడా అంటారు. ప్రాణములు (అచ్చులు) కలిసి ఉన్నవి గనుక ప్రాణులు. ఎందుకంటే వీటిని అచ్చులతో కలిపి పలుకుతారు. "వ్యజతే అనేన ఇతి వ్యంజనం" - దీనిచేత అక్షరం స్పష్టం చేయబడుతుంది. కకారం నుండి హకారం వరకు ఉండే హల్లులకు ("వ్యంజనం కాదిహాంతేస్యాత్") వ్యంజనాలు అని పేరు. "నటభార్యావత్ వ్యంజనాణి భవంతి" అని సంస్కృతంలో చెప్పారు. ("వ్యంజనములు నటునియొక్క భార్య వంటివి"). అనగా ఒక నటి నాటకంలో ఒకరి భాఱ్యగా నటిస్తుంది. మరొక నాటకంలో మరొకరి భార్యగా నటిస్తుంది. ఆమె సహనటుని ప్రకారం ఆమె స్వరూపం వ్యక్తమౌతుంది. అలాగే ఒక హల్లు ఏ అచ్చుతో కలిస్తే ఆ అచ్చు ప్రకారం రూపుదిద్దుకుంటుంది. ఉదాహరణకు "క్" అనేది పొల్లు (అచ్చులేని హల్లు). ఇది "ఆ"తో కలిస్తే "కా" అవుతుంది. "ఏ"తో కలిస్తే "కే" అవుతుంది.


తెలుగులో హల్లులు
క్ష
తెలుగు వర్ణమాల
అచ్చులు
ఉభయాక్షరమలు
హల్లులు
క్ష
చిహ్నములు

హల్లులలో భేదాలు

[మార్చు]
  • పరుషములు: పలుకడానికి కొంత శ్రమ అవుసరమైనవి. వీటికి "శ్వాసములు" అన్న పేరు కూడా ఉంది. "క,చ,ట,త,ప"లు పరుషములు.
  • సరళములు : తేలికగా పలికేవి. వీటికి "నాదములు" అన్న పేరు కూడా ఉంది. - "గ,జ,డ,ద,బ"లు సరళములు
  • వర్గములు: ఐదేసి అక్షరాల సమూహాన్ని ఒక వర్గం అంటారు. ఇలాంటి ఐదు వర్గాలు కలిసి మొత్తం 25 అక్షరాలు అవుతాయి. అవి
    • "క"వర్గము - క,ఖ,గ,ఘ,ఙ
    • "చ"వర్గము - చ,ఛ,జ,ఝ,ఞ
    • "ట" వర్గము - ట, ఠ, డ, ఢ, ణ
    • "త" వర్గము - త, థ, ద, ధ, న
    • "ప" వర్గము - ప, ఫ, భ, భ, మ
  • వర్గయుక్కులు : "యుక్కు" అనగా జత. వర్గాలలో సరిసంఖ్యలో (2,4 సంఖ్యలు) ఉండే అక్షరాలు వర్గయుక్కులు - అవి మొత్తం పది - ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ
  • అనునాసికములు : ముక్కు సహాయంతో పలికే అక్షరాలు - ఙ, ఞ, ణ, న, మ
  • స్పర్శములు : నోటితో కాస్త గట్టిగా ప్రయత్నం చేసి ఉచ్ఛరించవలసినవి. మొత్తం 25 వర్గాక్షరాలూ స్పర్శములే.
  • అంతస్థములు : స్పర్శములకు, ఊష్మములకు మధ్యనున్న అక్షరాలు - య, ర, ల, వ
  • ఊష్మములు : గాలి ఊది పలికేవి - శ, ష, స, హ
  • ద్రుతము: అవసరం లేకుంటే కరిగిపోయేది ద్రుతం, అనగా "న"కారం - నిన్నన్,
  • ద్రుతప్రకృతికము ద్రుతం చివరగా ఉన్న పదం - అనెన్, కనెన్, వచ్చెన్
  • కళలు: ద్రుత ప్రకృతికములు కాని శబ్దములు. అనగా చివరలో నకారం లేనివి - రాముడు, విష్ణువు.

మూలాలు, వనరులు

[మార్చు]
  • విక్టరీ తెలుగు వ్యాకరణము -మల్లాది కృష్ణప్రసాద్ - విక్టరీ పబ్లిషర్స్, విజయవాడ (2008)

శ ష స లకు మీరో పేరు

"https://te.wikipedia.org/w/index.php?title=హల్లులు&oldid=3221109" నుండి వెలికితీశారు