స
స్వరూపం
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
| తెలుగు వర్ణమాల | |||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|
| అచ్చులు | |||||||||
| అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ||||
| ఋ | ౠ | ఌ | ౡ | ||||||
| ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | ||||
| ఉభయాక్షరమలు | |||||||||
| ఁ | ం | ః | |||||||
| హల్లులు | |||||||||
| క | ఖ | గ | ఘ | ఙ | |||||
| చ | ఛ | జ | ఝ | ఞ | |||||
| ట | ఠ | డ | ఢ | ణ | |||||
| త | థ | ద | ధ | న | |||||
| ప | ఫ | బ | భ | మ | |||||
| య | ర | ల | వ | ||||||
| శ | ష | స | హ | ||||||
| ళ | క్ష | ఱ | |||||||
| ౘ | ౙ | ||||||||
| చిహ్నములు | |||||||||
| ఽ | |||||||||
స అక్షరం తెలుగు భాష వ్యంజన వర్ణములలోని ముప్పదిరెండవ యక్షరము. ఉర్దూ వర్ణమాలలో నారవ యక్షరము.
హల్లులలో దంత్య శ్వాస ఊష్మ (voiceless alveolar fricative) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [s]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [s].
ఉచ్చారణా లక్షణాలు
[మార్చు]- స్థానం: దంత (dental) లేదా దంతమూలీయ (alveolar)
- కరణం: జిహ్వాగ్రము (tongue tip)
- సామాన్య ప్రయత్నం: మహాప్రాణ (aspirated), శ్వాసం (voiceless)
- విశేష ప్రయత్నం: ఊష్మం (fricative)
- నిర్గమనం: ఆస్యవివరం (oral cavity)
గుణింతం
[మార్చు]స, సా, సి, సీ, సు, సూ, సె, సే, సై, సొ, సో, సౌ, సం, సః
భారతీయ సంగీతంలో
[మార్చు]భారతీయ సంగీతంలో సప్తస్వరాలు : స, రి, గ, మ, ప, ద, ని. వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క పక్షి కూత లేక జంతువు అరుపు నుంచి పుట్టినది.
'స ' అనగా షడ్జమము, అనగా నెమలి క్రేంకారం
స అక్షరంతో జాతీయాలు
[మార్చు]- సచ్చింది గొర్రె
- సచ్చి చెడీ
- సత్యహరిశ్చంద్రుడు
- సన్నాయి నొక్కులు నొక్కు తున్నారు
- సన్యాసి పళ్ళు
- సప్తమీ విభక్తి
- స్వస్తి పలకడం
- సంపాతి జటాయువులు
- స్తన - శల్య పరీక్ష
- సరకులు నిండు కున్నాయ
- సర్వం జగన్నాథం
- సర్వభక్షకుడు
- సర్వమంగళం
- సమస్యేలేదు
- సముద్రంలో కాకి రెట్ట
- సముద్రంలో ఇంగువ కలిసినట్టు
- సమర్పయామి
- ససేమిరా
- సంకనెక్కాడు
- సంకెళ్లుతెగడం
- సంకెళ్ళు వేయటం
- సంతలో చింతపండు
- సంత గోల
- సంతాన గోపాలుడు
- సంపతి కుంటు
- సందట్లో సమారాధన
- సర్రలు కొయ్యటం
- సలసల
- స్వయంపాకం
- స్వస్తి పలికారు
