Jump to content

వికీపీడియా నుండి
శ
తెలుగు వర్ణమాల
అచ్చులు
ఉభయాక్షరమలు
హల్లులు
క్ష
చిహ్నములు

హల్లులలో తాలవ్య శ్వాస ఊష్మ (voiceless palatal fricative) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [ç]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [ś].

ఉచ్చారణా లక్షణాలు

[మార్చు]

చరిత్ర

[మార్చు]

ఆధునిక తెలుగు ఉచ్చారణలో ఈ ధ్వనిని తెలంగాణాలో // ద్వనికి సవర్ణంగా, కోస్తా ప్రాంతాలలో // ధ్వనికి సవర్ణంగా పలకడం గమనించవచ్చు.

శ గుణింతం

[మార్చు]

శ, శా, శి, శీ, శు, శూ, శె, శే, శై, శొ, శో, శౌ, శం, శః

గుణింతాక్షర పదాలు

[మార్చు]
  • శనగలు
  • శాసనం
  • శిఖరం
  • శీతలం
  • శునకము
  • శూలము
  • శృంఖలము
  • శేషుడు
  • శైశవము
  • శొంఠి
  • శోకము
  • శౌర్యము
  • శంఖము

శ, స, ష మధ్య తేడాలు

[మార్చు]
  • ఈ "శ" చూడటానికి కత్తెర లా ఉంటుందని "కత్తిరి శ" అని పిలుస్తారు. శాలివాహనులు, శాతవాహనులు, శనివారం, శనగ పిండి ఇలా కత్తెర శ పలికేటపుడు నాలుక అంచు పళ్ళను కొద్దిగా తాకుతుంది, అలాంటపుడు ఈ అక్షర ఉచ్చారణ జరుగుతుంది.
  • రెండవది కొడవలి స - పంట కోసే కొడవలి ఆకారం లో ఉంటుందని అలా పిలుస్తారు. సంధ్య, సాయంత్రం, సాలూరు, సామర్లకోట వంటి పదాలు పలికేటపుడు వాడే స ఇది. నాలుక అంచు, నోటి అంగుటి కి తగిలితే ఈ ఆక్షర ఉచ్చారణ జరుగుతుంది.
  • మూడవది విషమ ష - విషం పలికినపుడు వాడే ష ని విషమ ష అంటారు. ఆషాడం, అష్టలక్ష్మి, కషాయం, ఇలా నాలుక మడతపడి వెనక్కు వెళ్ళినపుడు ఈ "ష" పలుకుతుంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=శ&oldid=4646862" నుండి వెలికితీశారు