Jump to content

క్ష

వికీపీడియా నుండి
తెలుగు అక్షరం"క్ష"
తెలుగు వర్ణమాల
అచ్చులు
ఉభయాక్షరమలు
హల్లులు
క్ష
చిహ్నములు

ఈ వర్ణాన్ని తెలుగు, సంస్కృతాలలో , ధ్వనుల సంయుక్తాక్షరంగా పలుకుతారు. దీనిని ప్రత్యేక వర్ణంగా గుర్తింపు లేకున్నా, ఎక్కువ పదాలలో ఈ ధ్వనులు జంటగా రావడం వలన దీనికి వర్ణమాలలో ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించారు.

ఇవి సంయుక్తాక్షరాలైనా వర్ణమాలలలో చేర్చటానికి ప్రధాన కారణం అసంయుక్త హల్లుల మూల రూపాలనుంచి వీటి సంయుక్త రూపాలను పోల్చుకోనంత గా మారిపోవడమే. అయితే తెలుగులో క్ష మాత్రమే కొంతవరకూ పోల్చుకోనంత మార్పు కలిగింది.

ఉచ్చారణా లక్షణాలు

[మార్చు]

చరిత్ర

[మార్చు]

ఈ వర్ణాన్ని తెలుగు, సంస్కృతాలలో ఇప్పుడు ప్రత్యేక ధ్వనిగా కాక , ధ్వనుల సంయుక్తాక్షరంగా పలుకుతారు. నన్నయ్య ఈ అక్షరానికి , అక్షరాలతో యతి పాటించగా, తిక్కన అక్షరంతో యతిమైత్రి కుదర్చడం ఆసక్తిదాయకమైన అంశం.

ఇతర విషయాలు

[మార్చు]

క్ష ను ఒక ప్రత్యేక అక్షరంగా తెలుగు సంస్కృత వ్యాకరణాలు చెప్పలేదు. నిఘంటువులు గూడా దీన్ని క గుణింతము క్రమంలోనే చూపాయి.

ఇది సంయుక్తాక్షరం. కకార షకారాల కలయిక ఇది.

క్షమ ,క్షితి , క్షేమము , పక్షము ,రక్షణ మొదలైన పదాలలో ఈ అక్షరం వస్తుంది.

క్+ష్+అ= క్ష — ఇది స్పష్టంగా " రిక్షా " లో వినిపిస్తుంది.

కొన్ని సదృశ ఉచ్చారణలకు ఒక లిపి ఏర్పాటు చేసుకుంటారు. సదృశం అంటే ' అలాంటిది' అని గానీ, అదే ఇది అని కాదు..

క్ ష్ అ = క్ష , క్ష రెండింటికీ ఆట్టే తేడా లేదు. అందుచేత వేర్వేరు అక్షరాలుగా చెప్ప లేదు.

మంత్ర శాస్త్రం లో క్ష విడిగా ఒక వర్ణం గా చెప్పబడింది.

  • "ఆది క్షాంత సమస్త వర్ణనకరీ శంభోస్త్రిభావా కరీ " అని ఆది శంకరాచార్యులు అన్నపూర్ణేశ్వరిని స్తుతించారు.
  • కానీ నిఘంటువులలో గూడా ఈ వర్ణం ' క ' వరుసలోనే కనిపిస్తుంది.

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=క్ష&oldid=4630697" నుండి వెలికితీశారు