వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హ
తెలుగు వర్ణమాల
అచ్చులు
ఉభయాక్షరమలు
హల్లులు
క్ష
చిహ్నములు

తెలుగు భాషకు అక్షరములు 56. అందులో 16 అచ్చులు, 37 హల్లులు, 3 ఉభయాక్షరములు ఉన్నాయి.

  • తెలుగు అక్షరమాలలో అచ్చులు 16 అక్షరాలు. స్వతంత్రమైన ఉచ్చారణ కలిగియుండుట వలన వీటిని ప్రాణములనీ, స్వరములనీ కూడా అంటారు.
  • అచ్చులు మూడు రకములు. అవి: హ్రస్వములు - కేవలము ఒక మాత్ర అనగా రెప్పపాటు కాలములో ఉచ్ఛరింపబడు అచ్చులను హ్రస్వములు అంటారు. ఇవి ఏడు అక్షరములు: అ, ఇ, ఉ, ఋ, ఌ, ఎ, ఒ. దీర్ఘములు - రెండు మాత్రల కాలములో ఉచ్ఛరింపబడు అచ్చులను దీర్ఘములు అంటారు. ఇవి తొమ్మిది అక్షరములు: ఆ, ఈ, ఊ, ౠ, ౡ, ఏ, ఓ.
  • ప్లుతములు - ఇవి ఉచ్ఛరించడానికి మూడు మాత్రల కాలం పట్టును. ఇవి రెండు అక్షరములు: ఐ, ఔ.
  • తెలుగు అక్షరమాలలో హల్లులు 37 . క నుండి హ వరకు గల అక్షరములను హల్లులు అంటారు. ఈ హల్లులు అచ్చుల సహాయము లేనిదే పలుకబడవు.
  • పరుషములు - హల్లులలో కఠినముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి - క, చ, ట, త, ప. సరళములు - హల్లులలో సులభముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి - గ, జ, డ, ద, బ. స్థిరములు - పరుషములు, సరళములు కాక మిగిలిన హల్లులన్నియు స్థిరములు. ఇవి - ఖ, ఘ, ఙ, ఛ, ఝ, ఞ, ఠ, ఢ, ణ, థ, ధ, న, ఫ, భ, మ, య, ర, ఱ, ల, ళ, వ, శ, ష, స, హ, క్ష. స్పర్శములు - ఇవి క నుండి మ వరకు గల అక్షరములు. ఇవి ఐదు వర్గములుగా విభజింపబడినవి. క వర్గము - క, ఖ, గ, ఘ, ఙ చ వర్గము - చ, ఛ, జ, ఝ, ఞ ట వర్గము - ట, ఠ, డ, ఢ, ణ త వర్గము - త, థ, ద, ధ, న మ వర్గము - ప, ఫ, బ, భ, మ
  • ఉభయాక్షరములు 3 అవి సున్న, అరసున్న, విసర్గము.

హల్లులలో కంఠమూలీయ శ్వాస ఊష్మ (voiceless glottal fricative) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [h]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [h].

ఉచ్చారణా లక్షణాలు

[మార్చు]

స్థానం: కంఠమూలీయ (glottal)

కరణం: నాద తంత్రులు (vocal cords)

సామాన్య ప్రయత్నం: శ్వాసం (voiceless)

విశేష ప్రయత్నం: ఊష్మ (fricative)

నిర్గమనం: ఆస్యవివరం (oral cavity)

చరిత్ర

[మార్చు]

హకారము ప్రాచీన ద్రవిడ భాషలో లేని అక్షరమని సామాన్య అభిప్రాయము. కానీ భద్రిరాజు కృష్ణమూర్తి గారు మూల ద్రావిడ భాషలో కంఠమూలీయ ధ్వని ఉండేదని, నేటికీ తమిళములో కనిపించే ఆయిదం అక్షరం దీనికి సాక్షమని అభిప్రాయపడ్డారు[1]. ప్రస్తుతం తమిళములో క, గ, హ ధ్వనులను ఒకటే అక్షరముతో రాస్తారు. తెలుగు మొదలైన ఇతర ద్రావిడ భాషల మాత్రం సంస్కృతం నుండి దీన్ని అక్షరంగా స్వీకరించినవి.[2]

ఏ అక్షరమునైనా పలికేటప్పుడు నాలిక ఆడించే బదులు ఊపిరి గొంతులోనుండి విడిస్తే హకారము పలుకుతుంది. పెసరపప్పును పెహరపప్పు అని అనటము మనము అప్పుడప్పుడు వింటూనే ఉంటాము. కన్నడములో పకారాది శబ్దములన్నీ చాలావరకు హకారాలు కావడము గమనించదగ్గ విషయము (పాలు = హాలు, పావు = హావు, పులి = హులి).[2]

హ గుణింతం

[మార్చు]

హ, హా, హి, హీ, హు, హూ, హె, హే, హై, హొ, హో, హౌ, హం, హః

మూలాలు

[మార్చు]
  1. "Evidence for Laryngeal *h in proto-Dravidian" Comparative Dravidian Linguistics: Current Perspectives By Bhadriraju Krishnamurti pp. 323-345 ISBN 0198241224
  2. 2.0 2.1 ఆంధ్ర భాషా వికాసము - గంటి జోగి సోమయాజి
  • Dravidian Languages - Bhadriraju Krishnamurti pp. 154–157 ISBN 0521771110
"https://te.wikipedia.org/w/index.php?title=హ&oldid=2329004" నుండి వెలికితీశారు