వైజాగ్ బ్యాక్-టు-బ్యాక్ HVDC కన్వర్టర్ స్టేషన్
వైజాగ్ బ్యాక్-టు-బ్యాక్ HVDC స్టేషన్, భారతదేశపు తూర్పు, దక్షిణ ప్రాంతాల మధ్య అనుసంధానం కలగజేసే బ్యాక్-టు-బ్యాక్ HVDC (హై వోల్టేజి డిసి ట్రాన్స్‌మిషను) లింకు. ఇది విశాఖపట్నం నగరానికి సమీపంలో ఉంది. ఇది పవర్ గ్రిడ్ కార్పొరేషన్ యాజమాన్యంలో ఉంది.
దీనిలో వైజాగ్ 1, వైజాగ్ 2 అనే రెండు స్వతంత్రమైన స్తంభాలుంటాయి. ఒక్కొక్క దాని నామమాత్రపు శక్తి ప్రసార రేటింగు 500 MW ఉంటుంది. వైజాగ్ 1 ను ఆల్స్టామ్ సంస్థ 1996 - 1999 మధ్య నిర్మించింది. దాని DC వోల్టేజి, కరెంట్ రేటింగులు 205 kV, 2475 A. దీని డిజైన్ చంద్రపూర్ బ్యాక్-టు-బ్యాక్ HVDC కన్వర్టర్ స్టేషన్‌ను పోలి ఉంటుంది.
వైజాగ్ 2 ను 2002 - 2005 మధ్య ABB నిర్మించింది. దీని నామమాత్రపు DC వోల్టేజి 176 కెవి, కరెంట్ రేటింగు 2841 ఎ.
వైజాగ్ 1, వైజాగ్ 2 రెండింటి లోనూ ఎయిర్-ఇన్సులేటెడ్, వాటర్-కూల్డ్ థైరిస్టర్ వాల్వ్‌లను ఉపయోగించారు.
2013 డిసెంబరు 31 న, ఉత్తర, తూర్పు, పశ్చిమ గ్రిడ్‌లను దక్షిణ ప్రాంతీయ గ్రిడ్‌తో సమకాలీకరించారు. దాంతో భారతదేశం మొత్తం ఒకే సింక్రోనస్ AC గ్రిడ్ ఏర్పడింది.[1] ఫలితంగా, తూర్పు, దక్షిణ గ్రిడ్‌లను అసమకాలికంగా అనుసంధానించడానికి కన్వర్టర్ స్టేషన్ ఇకపై అవసరం లేదు. AC సిస్టమ్‌లో విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించడంలో సహాయపడటానికి ఇది ఎంబెడెడ్ పవర్ ఫ్లో పరికరంగా దాన్ని ఇప్పటికీ ఉపయోగించవచ్చు. ఇతర దేశాల నుండి విద్యుత్‌ను ఎగుమతి/దిగుమతి చేయడానికి ఈ స్టేషన్‌లను విప్పదీసి, ఇతర ప్రాంతాలకు తరలించవచ్చు.
స్థానాలు
[మార్చు]సైటు | నిర్దేశాంకాలు |
---|---|
వైజాగ్ 1 | 17°38′33″N 83°07′57″E / 17.64250°N 83.13250°E |
వైజాగ్ 2 | 17°38′26″N 83°08′10″E / 17.64056°N 83.13611°E |
- ↑ One Nation – One Grid Archived 2017-02-26 at the Wayback Machine, Powergrid website (retrieved 18 November 2015).