శకునం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
శకునం (Omen) అనగా జరగబోవు పని గురించిన సంజ్ఞ. కొన్ని వస్తువులు, కొందరు వ్యక్తులు శుభ శకునాలు గాను కొన్ని అశుభ శకునాలు గానూ భావిస్తారు. శకునాల శాస్త్రీయత ప్రశ్నార్ధకమైనందువల్ల హేతువాదులు శకునాలను పట్టించుకోవటాన్ని మూఢ నమ్మకంగా కొట్టిపారేస్తారు. అయితే మానవ చరిత్రలో, జానపద వాజ్ఞ్మయంలో శకునాలకు చాలా ప్రధానపాత్ర ఉన్నది.
జానపదులు అనేక రకాల శకునాలు చూసుకుంటారు. అందునా ముఖ్యంగా కాకి శకునం వివరంగా చూసుకుంటారు. కాకి కూస్తూవుంటే చుట్టాలొస్తారని యెదురు చూస్తూవుంటారు. శిఖనరసింహ శతకం అనే పేరుతో ఒక ప్రాచీన తెలుగు కవి శకునశాస్త్రం పద్యాలుగా రచించాడు[1]. మచ్చుకు అందులోని ఒక పద్యం
“ | ఒక్కటి తీర్చిననిర్భయ మక్కట శుభఫలమురెండు నటతీర్పంగన్ నిక్కముగ మూఁడుదీర్చినఁ జిక్కునునొక రాజ్యలక్షి శిఖినరసింహా |
” |
శకునాలు తెచ్చే ఫలితాలను బట్టి వాటిని శుభ శకునాలు, అశుభ శకునాలుగా వర్గీకరిస్తారు. శకునాలు ఆయా దేశాల సంస్కృతిని బట్టి మారుతూ ఉంటాయి. ఒక సంస్కృతిలో శుభశకునంగా పరిగణించిన దాన్ని వేరొక సంస్కృతిలో అశుభ శకునంగా పరిగణించే అవకాశం ఉంది. ఉదాహరణకు అమెరికాలో నల్లపిల్లిని అశుభసూచకముగా భావిస్తే, ఇంగ్లాండులో శుభసూచకముగా భావిస్తారు.
భారతీయ సంస్కృతిలో సాధారణంగా నల్లపిల్లిని, ఎండు కట్టెలు, ఒంటి బ్రాహ్మణుని[2], విధవరాలిని, తుమ్మును అశుభసూచకాలుగా భావిస్తారు. ముత్తైదువులను (నిండు సుమంగళి)[3], జంట బ్రాహ్మణులను, ఆవును, పచ్చగడ్డిని శుభసుచకాలుగా భావిస్తారు.
శకున శాస్త్రం
[మార్చు]ఈ గ్రంథం గర్గ ముని ప్రణీతం. పక్షుల ద్ధ్వనులను బట్టి, మనుష్యుల మాటాలను బట్టి, శుభాశుభములను నిర్ణయించే విధానాలు ఇందులో తెలుప బడ్డాయి.
శుభ శకునాలు
[మార్చు]సువాసినీ, వేశ్య, ఇద్దరు బ్రాహ్మణులు, దండ(కఱ్ఱ)ధారుడగు శూద్రుడు, మంగళవాద్యం, పండ్లు, పూలు, గొడుగు, చామరము, గుఱ్ఱము, ఏనుగు, ఎద్దు, పూర్ణ కుంభము, చెరకు, అన్నము, పాలు, పెరుగు, మాంసము, కల్లుకుండ, పొగ లేని మంట, తేనె, చలువ వస్త్రములు, అక్షంతలు, వీణ, మద్దెల, శంఖము, వధూవరులు, ఘంటానాదము, జయ శబ్దము, మంగళప్రదవస్తువులు, ఎదురుగా వచ్చిన చల్లని పిల్లగాలి, అనుకూలమగు పశ్చాత్తాపము మెదలగు శకునములు శుభఫలితములనిచ్చును.
అశుభ శకునములు
[మార్చు]ఒంటి బ్రాహ్మణుడు, విధవ, కాషాయ వస్త్రదారి, కట్టెలు మోపు, పాము, కొత్త కుండ, నూనె కుండ, బిచ్చగాడు, కుంటి కుక్క, ముక్కులేనివాడు, రోగి, అంధుడు, కుంటివాడు, రజస్వల, ఒంటితుమ్ము, సకిలించుట, వస్త్రాధికము జారిపడుట, దురుక్తులు వినుట, భుజించి పొమ్మనుట, నేను కూడా వచ్చెదనుట, ఈ పూట వద్దనుట, ప్రధాన వస్తువు మరచుట, వెతికినా దొరకకు పోవుట, ఎదురు దెబ్బ తగులుట మెదలగునవి అశుభసూచకములు
పెద్దబాలశిక్ష ప్రకారం:
[మార్చు]- మండుచున్న నిప్పు, కన్య, సింహాసనము, గుర్రము, అక్షతలు, గంధము, పువ్వులు, ఛత్రము, పల్లకి, ఏనుగు, తేనె, నెయ్యి, పెరుగు, చేప, మాంసము, మద్యము, ఇస్త్రీబట్టలు, శంఖానాదము, మంగళ వాయిద్యములులు, వేదఘోష, ఏడ్పులేని శవము, పూర్ణకుంభము, వేశ్యలు, అద్దములు మొదలైనవి ఎదురైన మంచి శకునములు.
- ఒంటి బ్రాహ్మణుడు, పిచ్చివాడు, చెవిటి, కుంటి, జడధారి, మాలికలు, ఎముకలు, చర్మము, నూనె, ప్రత్తి, కట్టెలు, ఉప్పు, బెల్లము, మజ్జిగ, పాము, కసపు, దిగంబరుడు, క్షౌరం చేయించుకున్నవాడు, తల విరబోసుకున్నవాడు, దీర్ఘగోగి మొదలైనవి ఎదురైన చెడు శకునములు.
చరిత్రలో శకునాలు
[మార్చు]- శీర్షిక ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచయిత సురవరం ప్రతాపరెడ్డి సంవత్సరం 1950 ప్రచురణకర్త సురవరము ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి చిరునామా హైదరాబాదు... 83లో ఈ క్రింది విధముగా చెప్పి యున్నారు.
జనులలో శకునాలపై విశ్వాసము మెండుగా నుండెను. ఒక రాజకుమారుడు వేటకు వెళ్ళగా అతని కెదురయిన అపశకున పరంపర యెట్టిదనగా:-
సీ. పిల్లులు పోరాడె, బల్లి యూకర త్రెళ్ళె,
తమ్మళి పొడసూపె, తుమ్మి రెదుర,
తొరగుపోయిన లేగ కొరలుచు నొక కుర్రి
పరతెంచె, క్రంపపై నరచె కాకి,
ఉలుమ డొక్కడు నూనె తలతోడ నేతెంచె,
మైల చీరలచాకి మ్రోల నెదిరె
కాకియును, గోరువంకయు, రెక్కలపోతు,
నేటిరింతయు దాటె నెడమదిశకు
బైటవెరపు దప్ప పాలగుమ్మయు పారె
ఒంటిపాట పైడికంటి వీచె
ఎలుగుచేసె పెద్దపులుగు, పామటు తోచె
దబ్బి బొబ్బిలిడియె నుబ్బు లడర.
(కుర్రి=పాడియావు, పాలగుమ్మ=పాలపిట్ట, పెద్దపులుగు=పెద్దపిట్ట, గుడ్లగూబ, ఱెక్కలపోతు, దబ్బి అనునవి నిఘంటువులలో లేవు. ఉలుమడు అనగా కుష్ఠురోగియని సూ.రా.నిఘంటువులలో కలదు. (ఱెక్కలపోతు అన బట్టమేక అను పెద్దపక్షి యనియు, దబ్బియన ఒక పక్షియనియు ఊహింతును.)
శకునాలనుగూర్చి క్రీడాభిరామమం దిట్లు చెప్పినారు.
"చుక్కయొకింతనిక్కి బలసూదము దిక్కున రాయుచుండుటన్
జక్కగ వేగదిప్పుడు నిశాసమయంబిది ప్రస్ఫుటంబుగా
ఘుక్కని మాటిమాటికిని గోటడు పల్కెడు వామదిక్కునన్
జొక్కటమై ఫలించు మన శోభనకార్యములెల్ల టిట్టిభా.
మాగిలి మాగిలి వృక్షము
పూగొమ్ము ననుండి షడ్జము ప్రకాశింపన్
లేగొదమ నెమలిపల్కెడు
గేగోయని వైశ్యమనకు గెలుపగు జుమ్మా
కొనకొనం గోడియేట్రింత కొంకనక్క
నమలి యీనాలుగిటి దర్శనంబు లెస్స
వీని వలతీరు బలుకు నుర్వీజనులకు
కొంగుబంగారమండ్రు శాకునికవరులు.
</poem> "గోధూళి లగ్నంబు నంబురంబు ప్రవేశింపవలయు. విశేషించి యుష:కాలంబు సర్వప్రయోజనారంభములకు బ్రశస్తంబు"
"గార్గ్య సిద్ధాంతమత ముష:కాలకలన
శకున మూమట యది బృహస్పతిమతంబు
విప్రజనవాక్య మరయంగ విష్ణుమతము
సర్వసిద్ధాంత మభిజిత్తు సమ్మతమగు."
- https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Andrulasangikach025988mbp.pdf/105[permanent dead link]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ మిన్నేరు (జానపదగేయరత్నావళి) - నేదునూరి గంగాధరం పేజీ.183 ప్రాచీన గ్రంధావళి, రాజమహేంద్రవరం (1968)
- ↑ ఈమాట లో మన భాషలో అంకెలు, సంఖ్యలు - వేమూరి వేంకటేశ్వరరావు వ్యాసం
- ↑ యాహూ తెలుగు లో ఇంటి స్థలం కోసం వెళ్లే సమయంలో శకునాల జాగ్రత్తలు - బొప్పన శ్రీనివాసులు