శిలాజము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Three small ammonite fossils, each approximately 1.5 cm across.
Petrified wood. The internal structure of the tree and bark are maintained in the permineralization process.

శిలాజాలు (ఆంగ్లం: Fossil) పురావస్తు శాస్త్రంలో విశేష ప్రాముఖ్యమున్నవి. ఫాజిల్ అనే పదం లాటిన్ పదం ఫాడెరి (fodere) నుండి ఉద్భవించింది. ప్రకృతి సిద్ధ కారణాల వల్ల, భూమిలో భద్రపరచబడిన ఖచ్ఛితమైన జీవావశేషాలను గాని, వాటి ఆనవళ్ళను గాని శిలాజాలు అని పిలుస్తారు. ఇవి సామాన్యంగా అవక్షేపిత శిలలో మాత్రమే ఏర్పడతాయి.

శిలాజాలు యేర్పడు విధానం

[మార్చు]

ఏదైనా ప్రాణి సహజంగానో లేక ప్రకృతిలో సంభవించే ప్రమాదాల వల్లనో మరణించినపుడు భూగర్బంలో కూరుకుపోతుంది. ఈ విధంగా కూరుకుపోయిన ప్రాణి భౌతిక శరీరంపై పనిచేసే పీడన బలాలు భౌతిక శరీరాన్ని శిలగా మార్చుతుంది లేక ఆ భౌతిక శరీరాన్ని అంటిపెట్టి యున్న పదార్థాలపై ప్రాణి భౌతిక చిహ్నాన్ని యేర్పరుస్తుంది. ఈ విధంగా ఏర్పడిన శిలలని లేదా చిహ్నాలను (ముద్రలను) సాధారణంగా శిలాజాలు అంటారు. శిలాజాలు సాధారణంగా త్రవ్వకాలలో లేక భూకంపం వచ్చినపుడు, భూమి లోపల నుండి బయటకు విసిరివేయబడిన పదార్థాలలో కనుగొనబడతాయి. ప్రపంచంలో చెప్పుకోతగ్గ శిలాజ అడవులు యెల్లోస్టోన్ నేషనల్ పార్కు ప్రాంతంలో ఉన్నాయి. ఇవి సుమారు అరవై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఆక్రమించి ఉన్నాయి. శాస్త్రవేత్తలు ఆఫ్రికా ఖండంలో రెండు మిలియన్ల సంవత్సరాల కంటే పూర్వపు మానవ శిలాజాల్ని కనుగొన్నారు.


శిలాజాల ప్రాముఖ్యము

[మార్చు]
  • భూమండలంపై జీవుల ఆవిర్భావదశ నుండి నేటి వరకు పుట్టి, పెరిగి, నశించిన అనేక జీవజాతుల ఉనికి, వానిలో సంభవించిన పరిణామ క్రమాన్ని అధ్యయనం చేయడానికి శిలాజాల పరిశీలన వల్లనే సాధ్యమౌతుంది.
  • భూమండలంపై వివిధ యుగాల్లో విశిష్టమైన జంతు, వృక్ష జాతులు ఉండేవి. వీటి శిలాజాలు లభించడం వల్ల, ఆ కాలపు శిలల వయస్సును నిర్ణయించడంలో ఇవి ఎంతో ఉపయోగపడతాయి. ఇటువంటి శిలాజాలను "సూచికా శిలాజాలు (en:Index Fossils)" అంటారు. ఇది భౌమకాలమాన పట్టికలను తయారుచేయడానికి ఉపయోగపడుతుంది.
  • శిలాజాల లక్షణాలను బట్టి పురాతన యుగాలలోని శీతోష్ణ పరిస్థితులను తెలుసుకోవచ్చును.
  • కొన్ని ప్రత్యేకమైన శిలాజాలను ఆధారంగా పెట్రోలియం, బొగ్గు గనుల ఉనికిని, వాటి విస్తీర్ణతను గణించవచ్చును.

శిలాజాలు-రకాలు

[మార్చు]
  • జీవి యధాతథంగా శిలాజంగా మారడం (Mummification) :
  • మంచులో కప్పబడిన శిలాజాలు (Ice embedded Fossils) :
  • రెసిన్ లో ఇమిడి ఉండే శిలాజాలు (Resin Fossils)
  • జీవుల గట్టిభాగాలు శిలాజంగా మారడం:
  • బాహ్యరూప శిలాజాలు:
    • ముద్రలు (Impressions) :
    • అచ్చులు (Moulds) :
    • పోతలు (Casts or Incrustations) :
  • శిలీభవనాలు (Petrifactions) :
  • కంప్రెషన్ శిలాజాలు (Compression Fossils) :
  • ఖనిజసంబంధ శిలాజాలు (Mineral Fossils) :
  • సూక్ష్మ శిలాజాలు (Microfossils)

సజీవ శిలాజాలు

[మార్చు]

ముఖ్య వ్యాసము: సజీవ శిలాజాలు

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=శిలాజము&oldid=4283779" నుండి వెలికితీశారు