Jump to content

శిశునాగ వంశం

వికీపీడియా నుండి

Shaishunaga dynasty

413 BCE–345 BCE
Location of Shaishunaga dynasty
రాజధానిRajgir, Vaishali, later Pataliputra (modern Patna)
సామాన్య భాషలుSanskrit
Magadhi Prakrit
Other Prakrits
మతం
Hinduism
Buddhism
Jainism[1]
ప్రభుత్వంMonarchy
• 413 –395 BCE
Shishunaga
• 395 –373 BCE
Mahanandin
చరిత్ర 
• స్థాపన
413 BCE
• పతనం
345 BCE
Preceded by
Succeeded by
Haryanka dynasty
Nanda Empire
Image of the Shaishunaga period.

శిశునాగ రాజవంశం (IAST: Śaiśunāga, అక్షరాలా "శిశునాగ") పురాతన భారతదేశ సామ్రాజ్యం అయిన మగధసామ్రాజ్యానికి మూడవ పాలక రాజవంశం అని విశ్వసించారు. హిందూ పురాణాల ఆధారంగా ఈ రాజవంశం మగధ రెండవ పాలక రాజవంశం అని దీనిని బృహద్రధుడు స్థాపించిన పురాణరాజవంశం అని ప్రస్తావించబడింది.[2]

రాజవంశం స్థాపకుడైన శిశునాగ చివరి హర్యంకా రాజవంశం పాలకుడు నాగదాసకా వద్ద "మంత్రి" (అమాత్యుడు) పనిచేసి క్రీ.పూ. 421 లో ప్రజా తిరుగుబాటు తరువాత సింహాసనం అధిరోహించాడు.[3] ఈ రాజవంశం రాజధాని ముందుగా రాజ్‌గీరు ఉండేది. కానీ తరువాత కాకవర్ణ పాలనలో ప్రస్తుత పాట్నాకు సమీపంలో ఉన్న పాటాలిపుత్రకు మార్చబడింది. సాంప్రదాయం ప్రకారం, కాకవర్ణ తరువాత అతని పది మంది కుమారులు ఉన్నారు. [4] ఈ రాజవంశం తరువాత నంద సామ్రాజ్యం (సి. క్రీ.పూ. 345) మగధను పాలించింది.[5]

స్థాపన

[మార్చు]

బౌద్ధసంప్రదాయం ఆధారంగా హర్యంకా రాజ్యంలో శిశునాగ అమాత్య రాజుమీద తిరుగుబాటు చేసి అయ్యాడు.[6]

పాలకులు

[మార్చు]

శిశునాగ

[మార్చు]

క్రీ.పూ 413 లో శిశునాగ తన రాజవంశాన్ని స్థాపించాడు. రాజ్యస్థాపన చేసేనాటికి రాజగీరు రాజధానిగా ఉండగా తరువాత పాటలీపుత్రను రాజధానిగా చేసుకుని (రెండూ ఇప్పుడు బీహారులో ఉన్నాయి) పాలించాడు. బౌద్ధ వర్గాలు ఆయన వైశాలి వద్ద ద్వితీయ రాజధానిని కలిగి ఉన్నాడని సూచిస్తున్నాయి.[6] గతంలో ఉన్న రాజధాని వాజ్జీని మగధ పాలకులు జయించారు. శిశునాగ రాజవంశం భారత ఉపఖండంలోని అతిపెద్ద సామ్రాజ్యాలలో ఒకటిగా పరిపాలించింది. అవంతిని పాలించిన ప్రడియోతా రాజవంశాన్ని నాశనం చేయడం శిశునాగ సాధించిన అత్యంత ముఖ్యమైన ఘనతగా భావించబడింది. ఇది మగధ, అవంతి మధ్య 100 సంవత్సరాల నాటి శత్రుత్వాన్ని అంతం చేసింది. అప్పటి నుండి అవంతి శిశునాగ సారాజ్యంలో ఒక భాగంగా మారింది.

కాకవర్న (కాలశోక)

[మార్చు]

పురాణాల ఆధారంగా శిషునాగా తరువాత అతని కుమారుడు కాకవర్ణ అని భావించబడగా సింహళ వృత్తాంతాల ఆధారంగా అతని కుమారుడు కలషోక భావిస్తున్నారు.[6] అశోకవదాన, హర్మను జాకోబీ, విల్హెల్ము గీగరు, రామకృష్ణ గోపాలు భండార్కరు ఇద్దరూ ఒకటేనని తేల్చారు. శిశునాగ పాలనలో ఆయన కుమారుడు వారణాసి గవర్నరుగా పనిచేశారు. అతని పాలనలో రెండు ముఖ్యమైన సంఘటనలు క్రీస్తుపూర్వం 383 లో వైశాలి వద్ద ఉన్న రెండవ బౌద్ధ మండలి, చివరిగా పాటలీపుత్రకు తరలించబడింది.[6][7] హర్షచరిత ఆధారంగా ఆయన తన రాజధాని పరిసరాలలో గొంతులోకి ఒక బాకును విసిరి చంపబడ్డాడు.[8] బౌద్ధ సంప్రదాయం ఆధారంగా అతనికి తొమ్మిది లేదా పది మంది కుమారులు ఉన్నారు. వీరిని ఉగ్రసేన నంద బహిష్కరించాడు.[9]

తరువాత పాలకులు

[మార్చు]

సంప్రదాయం ఆధారంగా [ఏవి?] కలషోకా పది మంది కుమారులు ఒకేసారి పాలించారు. మహాబోధివంశం వారి పేర్లను భద్రసేన, కోరందవర్ణ, మంగూరా, సర్వంజహా, జలికా, ఉభాకా, సంజయ, కోరవ్య, నందివర్ధన, పంచమక అని పేర్కొంది. వారిలో ఒకరు మాత్రమే పురాణ జాబితాలలో ఒకటైన నందివర్ధనలో పేర్కొనబడింది.[4] నందివర్ధన (మహానందుడు) బహుశా ఈ రాజవంశం చివరి పాలకుడుగా ఉండి ఉంటాడని భావిస్తున్నారు. అతని సామ్రాజ్యాన్ని చట్టవిరుద్ధంగా ఆయనకు జన్మించిన కుమారుడు మహాపద్మ నంద వారసత్వంగా పొందాడు.[ఆధారం చూపాలి]


పురాణాలు నందివర్ధనను తొమ్మిదవ శిశునాగ రాజుగా, ఆయన కుమారుడు మహానందుడు పదవ, చివరి శిశునాగ రాజుగా భావిస్తున్నారు. మహానందుడు శూద్రవనితకు చట్టవిరుద్ధంగా తనకు జన్మించిన కుమారుడు మహపద్ముని చేత చంపబడ్డాడు.[10]

మగధ శిశునాగ రాజవంశంలో నాణేలు

పతనం

[మార్చు]

పురాణాల ఆధారంగా శిశునాగుల తరువాత నందులు మగధను పాలించారు.[6]

మూలాలు

[మార్చు]
  1. Upinder Singh 2016, p. 273.
  2. Raychaudhuri 1972, p. 103.
  3. Raychaudhuri 1972, pp. 193, 201.
  4. 4.0 4.1 Raychaudhuri 1972, p. 196.
  5. Raychaudhuri 1972, p. 201.
  6. 6.0 6.1 6.2 6.3 6.4 Upinder Singh 2016, p. 272.
  7. Raychaudhuri 1972, pp. 195–6.
  8. Mahajan 2007, p. 251.
  9. Sastri 1988, p. 14.
  10. Mookerji 1988, p. 10.

వనరులు

[మార్చు]
  • Mookerji, Radha Kumud (1988) [first published in 1966], Chandragupta Maurya and his times (4th ed.), Motilal Banarsidass, ISBN 81-208-0433-3
  • Singh, Upinder (2016), A History of Ancient and Early Medieval India: From the Stone Age to the 12th Century, Pearson PLC, ISBN 978-81-317-1677-9
  • Raychaudhuri, H.C. (1972), Political History of Ancient India, Calcutta: University of Calcutta
  • Sastri, K. A. Nilakanta, ed. (1988) [1967], Age of the Nandas and Mauryas (Second ed.), Delhi: Motilal Banarsidass, ISBN 81-208-0465-1
  • Mahajan, V.D. (2007) [1960], Ancient India, New Delhi: S. Chand, ISBN 81-219-0887-6
అంతకు ముందువారు
Haryanka dynasty (Magadha)

Pradyota dynasty (Avanti)

Shaishunaga Dynasty
413–345 BCE
తరువాత వారు
Nanda Dynasty

మూస:Middle kingdoms of India