శుంగ సామ్రాజ్యం
శుంగ సామ్రాజ్యం | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
185 బిసిఈ–75 బిసిఈ | |||||||||
Approximate extent of the Shunga empire (c. 180 BCE). | |||||||||
రాజధాని | Pataliputra Vidisha | ||||||||
సామాన్య భాషలు | Sanskrit Prakrit | ||||||||
మతం | Hinduism Buddhism | ||||||||
ప్రభుత్వం | Monarchy | ||||||||
Emperor | |||||||||
• 185–151 BCE | Pushyamitra Shunga | ||||||||
• 151–141 BCE | Agnimitra | ||||||||
• 83–75 BCE | Devabhuti | ||||||||
చారిత్రిక కాలం | Antiquity | ||||||||
• స్థాపన | 185 బిసిఈ | ||||||||
• పతనం | 75 బిసిఈ | ||||||||
| |||||||||
Today part of | India Bangladesh Nepal |
శుంగ సామ్రాజ్యం (IAST: Śuṅga) పురాతన భారత రాజవంశం, క్రీ. పూ.187 నుండి 78 వరకు మగధ నుండి మధ్య, తూర్పు ప్రాంతాల్లో భారత ఉపఖండంలో వీరి పాలన సాగింది. మౌర్య సామ్రాజ్యం పతనం తరువాత ఈ రాజవంశం పుష్యమిత్ర శుంగుడుచే స్థాపించబడింది. దీని రాజధాని పాటలీపుత్ర, కానీ తరువాత భాగభద్రా వంటి చక్రవర్తులు కూడా తూర్పు మాల్వాలోని బెస్నగర్ (ఆధునిక విదిష) వద్ద దర్బారును నిర్వహించారు.[1]
ఆవిర్భావం
[మార్చు][2] అశోకుడు మరణించిన సుమారు 50 సంవత్సరాల తరువాత మౌర్య సామ్రాజ్యం చివరి పాలకుడు బృహద్రథమౌర్య చక్రవర్తిని ఆయన సన్యాధ్యక్షుడు పుష్యమిత్ర హత్య చేసిన తరువాత క్రీస్తుపూర్వం 185 లో శుంగవంశం స్థాపించబడింది.[3] శుంగవంశానికి మొదటి చక్రవర్తిగా పుష్యమిత్రశుంగా సింహాసనాన్ని అధిష్టించాడు.[4]
పుష్యమిత్రశుంగా మగధకూ పొరుగు ప్రాంతాలకు కూడా పాలకుడు అయ్యాడు. ఆయన రాజ్యం తప్పనిసరిగా పాత మౌర్య సామ్రాజ్యం కేంద్ర భాగాల మీద కూడా ఆధాత్యాన్ని స్థిరపరిచింది.[5] ధనదేవ-అయోధ్య శాసనం ఆధారంగా శుంగాకు కచ్చితంగా ఉత్తర మధ్య భారతదేశంలోని కేంద్ర నగరం అయోధ్యపై నియంత్రణ ఉంది.[5] ఏది ఏమయినప్పటికీ మధురలో శుంగా ఉనికికి సంబంధించిన పురావస్తు ఆధారాలు ఏవీ కనుగొనబడనందున మరింత పశ్చిమాన ఉన్న మధుర నగరం శుంగాల ప్రత్యక్ష నియంత్రణలో ఉన్న ఆధారాలు లభించలేదు.[6] దీనికి విరుద్ధంగా యవనరాజ్య శాసనం ఆధారంగా మధుర బహుశా క్రీస్తుపూర్వం 180 - క్రీస్తుపూర్వం 100 మధ్య కొంతకాలం నుండి ఇండో-గ్రీకుల నియంత్రణలో ఉండవచ్చు.[6]
అయితే కొన్ని పురాతన వనరులు శుంగా సామ్రాజ్యానికి అధిక భూభాగవిస్తరణ ఉందని వాదిస్తున్నాయి: దివ్యవదానంలోని అశోకవదాన వృత్తాంతం వాయవ్యంలోని పంజాబు ప్రాంతంలోని సకాల (సియాల్‌కోట) వరకు బౌద్ధ సన్యాసులను హింసించడానికి శుంగాలు సైన్యాన్ని పంపారని పేర్కొన్నారు:
...... పుష్యమిత్ర నాలుగు రెట్లు సైన్యాన్ని కలిగి ఉంది. బౌద్ధ మతాన్ని నాశనం చేయాలనే ఉద్దేశ్యంతో ఆయన పాటలీపుత్రలోని కుక్కుతారామ వెళ్ళాడు. ... అందువల్ల పుష్యమిత్రుడు సంఘరామాలను నాశనం చేసి, అక్కడి సన్యాసులను చంపి, బయలుదేరాడు. ... కొంత సమయం తరువాత, అతను సకాలకు చేరుకున్నాడు, బౌద్ధ సన్యాసి తలని ఎవరు తీసుకువచ్చాడో వారికి ... బహుమతి ఇస్తానని ప్రకటించాడు.[7]: 293
అలాగే పుష్యమిత్ర సామ్రాజ్యం దక్షిణాన నర్మదా నది వరకు విస్తరించిందని మాలవికాగ్నిమిత్ర పేర్కొంది. వారు ఉజ్జయిని నగరాన్ని కూడా నియంత్రించి ఉండవచ్చని భావిస్తున్నారు.[5] ఇంతలో ఇండో-గ్రీకులు కాబూలు, చాలా పంజాబు స్వాధీనం చేసుకున్నాయి. దక్కను పీఠభూమిని శాతవాహన రాజవంశం స్వాధీనం చేసుకున్నది.
పుష్యమిత్ర 36 సంవత్సరాలు (క్రీ.పూ. 187–151) పాలించిన తరువాత మరణించారు. ఆయన తరువాత కుమారుడు అగ్నిమిత్రను పాలనాధికారం వరించింది. ఈ యువరాజు భారతదేశపు గొప్ప నాటక రచయితలలో ఒకరైన కాళీదాసుడు రచించిన ప్రసిద్ధ నాటకానికి కథానయకుడయ్యాడు. కథ జరిగినప్పుడు అగ్నిమిత్రుడు విధిషాప్రాంతానికి రాజప్రతినిధిగా ఉన్నాడు.
శుంగాల శక్తి క్రమంగా బలహీనపడింది. శుంగ చక్రవర్తులు వరుసగా 10 మంది పాలన సాగించారని భావిస్తున్నారు. శుంగాలు బలహీనం అయిన తరువాత క్రీస్తుపూర్వం 73 లో కన్వా రాజవంశం క్రమంగా ఆస్థానాన్ని ఆక్రమించింది.
చరిత్ర
[మార్చు]శుంగ వంశము, క్రీ. పూ. 185 వ సంవత్సరములో, సుమారుగా అశోకుని మరణానికి 50 సంవత్సరాల తరువాత, ఏర్పాటు చేయబడింది. అప్పటి మౌర్య చక్రవర్తియైన బృహద్రథుడు, తన సైన్యాధిపతి చేతిలో దారుణంగా హత్యచేయబడ్డాడు. ఆ సైన్యాధిపతి పుష్యమిత్ర శుంగుడు, శుంగవంశము వాడు; బ్రాహ్మణుడు. ఇతను సైనిక వందనం స్వీకరించుతున్న రాజు బృహద్రధుని చంపి, తరువాత సింహాసనాన్ని అధిష్టించాడు.
పుష్యమిత్ర శుంగుడు 36 సంవత్సరాల పాటు పాలించాడు. ఆ తర్వాత అతని కుమారుడు అగ్నిమిత్ర రాజ్యాధికారం చేపట్టాడు. శుంగ సామ్రాజ్యంలో పదిమంది శుంగ పాలకులు ఉన్నారు. అయితే, రాజవంశం యొక్క రెండవ రాజు అగ్నిమిత్ర మరణం తరువాత, సామ్రాజ్యం వేగంగా విచ్ఛిన్నమైంది.[8] శాసనాలు, నాణేలు ప్రకారం ఉత్తర; మధ్య భారతదేశం యొక్క ప్రాంతాలు చిన్న సామ్రాజ్యాలుగా, నగర-రాజ్యాలుగా శుంగ ఆధిపత్యంలో ఉండి స్వతంత్రంగా ఉన్నాయని సూచించబడ్డాయి.[9] ఈ రాజవంశం అనేక విదేశీ శక్తులు, స్వదేశీ శక్తులు రెండింటితోనూ జరిపిన యుద్ధాలకు ప్రసిద్ధి చెందింది. వీరు కళింగ, శాతవాహన రాజవంశం, ఇండో-గ్రీక్ రాజ్యంతో; బహుశా పాంచాల, మధుర రాజులతో పోరాడారు.
ఈ కాలంలో కళ, విద్య, తత్వశాస్త్రం, ఇతర రకాల అభ్యాసాలు, చిన్న చిన్న టెర్రకోట చిత్రాలు, పెద్ద రాతి శిల్పాలు, భహ్రుత్ స్తూపం, సాంచి వద్ద ప్రఖ్యాత గ్రేట్ స్తూపం ఉన్నాయి. శుంగ పాలకులు శిక్షణ, కళలకు రాయల్ స్పాన్సర్షిప్ సంప్రదాయం ఏర్పాటుకు సహాయం చేశారు. శుంగ సామ్రాజ్యం ఉపయోగించే లిపి, బ్రాహ్మీలిపికి కొంత విభిన్నంగా ఉంటుంది; ఇది సంస్కృతం వ్రాయడానికి ఉపయోగించబడింది. హిందూ తాత్వికతలో చాలా ముఖ్యమైన పరిణామాలు జరుగుతున్న కాలంలో శుంగ సామ్రాజ్యం సంస్కృతి పోషణలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. వీరి కాలంలోలోనే పతంజలి మహాభాష్యం రచించబడింది. శుంగ పాలకుల కాలంలో మధుర కళ శైలి పెరుగుదలతో పాటు కళాత్మకత కూడా పురోగమించింది.
బుద్ధిజం
[మార్చు]మతవిశ్వాసాలు
[మార్చు]మౌర్యుల తరువాత అధికారానికి వచ్చిన మొదటి పుష్యమిత్ర శుంగా బౌద్ధులను హింసించారని, ఇది బౌద్ధమతాన్ని కాశ్మీరు, గాంధార, బాక్ట్రియా వరకూ నెట్టివేసింది.[10] బౌద్ధ మత గ్రంథాలైన దివ్యవదాన అశోకవదానలో బౌద్ధులను హింసించిన వృత్తాంతం వర్ణించబడింది. ప్రాచీన టిబెటను చరిత్రకారుడు తారనాథ బౌద్ధులను హింసించడం గురించి రాశారు. పుష్యమిత్ర బౌద్ధ మఠాలను తగలబెట్టించి, స్థూపాలను నాశనం చేయించి, బౌద్ధ సన్యాసులను ఊచకోత కోయించాడు. వారి తలను నరికి తీసుకుని వచ్చిన వారికి బహుమతులు ప్రకటించాడని కథనాలు ప్రచారం ఉన్నాయి. కాని కొందరు ఈ కథలను అతిశయోక్తిగా భావిస్తారు.[10][11]
"... పుష్యమిత్ర నాలుగు రెట్లు సైన్యాన్ని కలిగి ఉన్నాడు. బౌద్ధ మతాన్ని నాశనం చేయాలనే ఉద్దేశ్యంతో ఆయన కుక్కుటారామానికి వెళ్ళాడు. ... కాబట్టి పుష్యమిత్రుడు సంఘరామాలను నాశనం చేశాడు. అక్కడి సన్యాసులను చంపి బయలుదేరాడు. ... కొంతకాలం తరువాత ఆయన సకలాకు వచ్చి బౌద్ధ సన్యాసి తలని ఎవరు తీసుకువచ్చాడో వారికి ... బహుమతి ఇస్తానని ప్రకటించాడు. "
- దివ్యవదనంలో అశోకవదన వృత్తాంతం [12]: 293
భారతీయ పురాణ మూలాలు, భవష్య పురాణం ప్రతిసర్గ పర్వ వంటివి, మౌర్య రాజవంశం తరువాత బ్రాహ్మణిజం పునరుద్ధరణ, మిలియన్ల మంది బౌద్ధులను చంపడం గురించి వివరిస్తాయి:
"ఈ సమయంలో (చంద్రగుప్తా, బిందుసార, అశోక పాలన తరువాత) కన్యాకుబ్జా అత్యుత్తమమైన స్థితిలో ఉన్న బ్రాహ్మణులు అర్బుదా అనే పర్వతం పైన యాగం చేసాడు. వేద మంత్రాల ప్రభావంతో, యజ్ఞం (త్యాగం) నుండి నాలుగు క్షత్రియులు కనిపించారు. (...) వారు అశోకను తమ ఆధీనంలో ఉంచి బౌద్ధులందరినీ సర్వనాశనం చేశారు. అక్కడ 4 మిలియన్ల మంది బౌద్ధులు ఉన్నారని, వారందరూ అసాధారణ ఆయుధాలతో చంపబడ్డారని చెబుతారు ".[13]
-ప్రతీసర్గా పర్వం.
పుష్యమిత్ర బ్రాహ్మణిక మతం ఆధిపత్యాన్ని పునరుద్ధరించాడని, అశోకుడు నిషేధించిన జంతు బలులను (యజ్ఞాలు) తిరిగి స్థాపించాడని భావిస్తున్నారు.[11]
మద్ధతు
[మార్చు]తరువాత శుంగా చక్రవర్తులు బౌద్ధమతానికి అనుకూలంగా ఉండి భార్హటు వద్ద స్థూపం నిర్మాణంలో పాల్గొన్నట్లు భావించబడింది.[14] ఏది ఏమయినప్పటికీ శుంగా రాజ్యం వికేంద్రీకృత పాలనా విధానం ఆధారంగా అనేక నగరాలు వారి స్వంత నాణేలను జారీ చేసారు. బౌద్ధ మతం పట్ల షుంగాలకు అయిష్టత ఉన్న కారణంగా కొంతమంది రచయితలు సాంచిలో ఆ కాలం నిర్మాణాలంలో నిజంగా శుంగాల భాగస్వామ్యం ఉందని భావించలేము అని పేర్కొన్నారు. మౌర్యుల కాలంలో జరిగినట్లు అవి రాజపోషణ ఫలితంగా నిర్మించబడినవి కాదు. సాంచి వద్ద అనేక నిధిసహాయాలకు రాజ ప్రోత్సాహక ఫలితం కంటే సామాన్యప్రజానీకం భాగస్వామ్యం ఉందని లేదా సమష్టి భాగస్వామ్యం ఉందని భావిస్తున్నారు.[15]
కొంతమంది రచయితలు గంగా మైదానంలో బ్రాహ్మణిజం బౌద్ధమతంతో రాజకీయ, ఆధ్యాత్మిక విషయాలలో పోటీ పడిందని విశ్వసించారు. [10] బౌద్ధమతం బాక్ట్రియా రాజుల రాజ్యాలలో వృద్ధి చెందింది.[ఆధారం చూపాలి]
సనాతన షుంగా చక్రవర్తులు బౌద్ధమతం పట్ల అసహనంతో లేరని, శుంగా చక్రవర్తుల కాలంలో బౌద్ధమతం అభివృద్ధి చెందిందని కొందరు భారతీయ విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. షుంగా కాలంలో బెంగాలులో బౌద్ధమతం ఉనికిని తామ్రలిప్తి వద్ద లభించిన టెర్రకోట ఫలకాల ఆధారంగా కూడా ఊహించవచ్చు. ఇవి కోల్కతాలోని అసుతోష్ మ్యూజియంలో ప్రదర్శనలో ఉన్నాయి.
రాజపోషణ
[మార్చు]రాజా బ్రహ్మమిత్ర, రాజా ఇంద్రాగ్నిమిత్ర రాజు చేసిన రెండు యాగాలు బుద్ధగయాలోని మహాబోధి ఆలయంలో నమోదు చేయబడ్డాయి. ఇది బౌద్ధమతానికి శుంగాల మద్దతుకు సాక్ష్యంగా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఈ రాజుల గురించిన ఖచ్ఛితమైన ఆధారాలు వ్యక్తంకాలేదు. శుంగాలు నమోదుచేసిన వంశవృక్షంలో వీరు భాగంగా లేరు. కాని వారు అశోకుడి అనంతర శుంగా పాలన కాలానికి చెందినవారని భావిస్తారు.[16][17] బ్రహ్మమిత్రను మధుర స్థానిక పాలకుడిగా భావించినప్పటికీ కాని ఇంద్రగ్నిమిత్ర తెలియదు. కొంతమంది రచయితల అభిప్రాయం ఆధారంగా ఇంద్రాగ్నిమిత్ర వాస్తవానికి అసలు శాసనంలో రాజుగా కూడా పేర్కొనబడలేదు.[17][18]
- మహాబోధి ఆలయంలోని బుద్ధగయ వద్ద ఉన్న ఒక శాసనం ఆలయ నిర్మాణాన్ని ఈ క్రింది విధంగా నమోదు చేస్తుంది:
"బ్రహ్మమిత్ర రాజు భార్య నాగదేవి ఇచ్చిన బహుమతి."
- మరొక శాసనం ఇలా ఉంది:
"కోసికి కుమారుడు రాజు అయిన ఇంద్రగ్నిమిత్ర భార్య కురంగి బహుమతి. రాజభవన మందిరం శ్రీమా(రాజమాత) బహుమతి కూడా.[19][20] "
ఈ ముఖ్యమైన రికార్డుల తరువాతి భాగాన్ని కోల్పోయినందుకు కన్నింఘం విచారం వ్యక్తం చేశారు. మొట్టమొదటి కాపీచేయబడిన శాసనం గురించి ఆయన "కురంగియే దానం" తరువాత పదకొండు బ్రాహ్మి అక్షరాల జాడలను కనుగొన్నాడు. వాటిలో మొదటి తొమ్మిది "రాజప్రాసాద-సెటికా సా" అని వ్రాయబడ్డాయి. బ్లోచి ఈ తొమ్మిది అక్షరాలను "రాజా-పసాడా-సెటికాసా"గా చదువబడ్డాయి. మునుపటి పదాలకు సంబంధించి ఈ వ్యక్తీకరణ వ్యక్తీకరించబడింది:
""(ఇంద్రగ్నిమిత్ర భార్య, కుమారుల తల్లి అయిన కురంగి బహుమతి)," గొప్ప ఆలయం కైత్య (సెటికా) కు ", పసాడకు ముందు రాజా అనే పదాన్ని ఆర్నాల పై ఒక సారాంశంగా తీసుకొని ఆలయాన్ని ప్రత్యేకంగా గుర్తించారు. రాజహస్థి 'ఒక గొప్ప ఏనుగు'. రాజహంస ` (హంసా 'ఒక బాతు' నుండి వేరుపడే పక్షి) వంటి వ్యక్తీకరణలకు సమానమైన పెద్ద గంభీరమైన భవనం."
కన్నింగ్హాం "రాజభవనం, కైత్య" ద్వారా ఈ వ్యక్తీకరణను అనువదించారు. "రాజా-ప్రసాదా ప్రస్తావన దాతను రాజు కుటుంబంతో అనుసంధానించినట్లు అనిపిస్తుంది" అని సూచిస్తుంది. "రాజా-ప్రసాదా-సెటికాసా" అనువాదంగా "రాజు ఆలయానికి" ఉండవచ్చని లూడర్సు సందేహం వ్యక్తం చేస్తున్నాడు.
శుంగాపాలనలో సాంచికార్యక్రమాల నిర్వహణ
[మార్చు]అశోకవదన ఆధారంగా క్రీస్తుపూర్వం 2 వ శతాబ్దంలో ఈ స్థూపం ఒక సమయంలో ధ్వంసం చేయబడిందని భావించవచ్చు. ఈ సంఘటన మౌర్య సామ్రాజ్య సైనికాధికారిగా మౌర్యులను అధిగమించి శుంగ సామ్రాజ్యాన్ని స్థాపించిన పుష్యమిత్ర చక్రవర్తి శుంగాల పెరుగుదల కాలంలో సంభవించిందని భావిస్తున్నారు. పుష్యమిత్ర అసలు స్థూపాన్ని నాశనం చేసి ఉండవచ్చని, ఆయన కుమారుడు అగ్నిమిత్ర దానిని పునర్నిర్మించాడని సూచించబడింది.[21] అసలు ఇటుక స్థూపం శుంగా కాలంలో రాతితో కప్పబడి ఉంది.
గ్రేటు స్థూపం ( 1 వ స్థూపం)
[మార్చు]తరువాత శుంగా పాలనలో స్థూపం రాతి పలకలతో దాని అసలు పరిమాణానికి దాదాపు రెండు రెట్లు విస్తరించబడింది. గోపురం పైభాగాన చదును చేయబడి, ఒక చదరపు రైలింగు లోపల మూడు సూపర్పోజ్డు పారాసోల్సు గోపురం చేయబడింది. అనేక శ్రేణులతో ఇది ధర్మానికి చిహ్నం (వీలు ఆఫ్ ది లా) గా ఉంది. చుట్టుకొలత కోసం ఉద్దేశించిన అధిక వృత్తాకార డ్రం మీద గోపురం ఏర్పాటు చేయబడింది. రెండు వైపులా నిర్మించబడిన సోపానాల ద్వారా దీనిని చేయవచ్చు. భూస్థాయిలో రెండవ రాతి మార్గం రాతి బ్యాలస్ట్రేడు చేత కప్పబడి ఉంది. మొదటి స్థూపం చుట్టూ ఉన్న రైలింగుకు కళాత్మక అలంకారాలు లేవు. ఇవి కొన్ని శాసనాలు కలిగిన స్లాబులు మాత్రమే కలిగి ఉన్నాయి. ఈ అంశాలు సిర్కా క్రీ.పూ 150 నాటివి.[22]
2 వ స్థూపం - 3 వ స్థూపం
[మార్చు]శుంగాల పాలనలో ఆరంభించినట్లు కనిపించే భవనాలు రెండవ, మూడవ స్థూపాలు ( కాని అత్యంత అలంకరించబడిన ద్వారాలు కాదు ఇవి శాతవాహన కాలం నాటివని శాసనాల ఆధారంగా తెలిసినవి), గ్రౌండు బ్యాలస్ట్రేడు, రాతి కూర్పు గొప్ప స్థూపం (స్థూపం సంఖ్య 1). సరిపుత్రా, మహామోగ్గల్లనా అవశేషాలు స్థూపాలు 3 ఉన్నట్లు భావిస్తున్నారు.[23] వీటిలో మెడల్లియన్లు (క్రీ.పూ 115 లో), ద్వారబంధ శిల్పాలు (క్రీ.పూ 80) నిర్మించబడ్డాయి.[24] భార్హటు తరువాత సా.శ.. 1 వ శతాబ్దం వరకు కొన్ని పునర్నిర్మించబడ్డాయి.[22][24] సాంచిలోని శుంగకాలం అలంకరణల శైలి భార్హూటుతో అలాగే బుద్ధగయ వద్ద ఉన్న బ్యాలస్ట్రేడును పోలి ఉన్నాయి. ఇవి మూడింటిలో పురాతనమైనవిగా భావిస్తారు.
Shunga structures and decorations (150-80 BCE) | |
Great Stupa (Stupa expansion and balustrades only are Shunga). Undecorated ground railings dated to approximately 150 BCE.[22] |
|
Stupa No 2 Entirely Shunga work. The reliefs are thought to date to the last quarter of the 2nd century BCE (circa 115 BCE for the medallions, 80 BCE for the gateway carvings), [24] slightly after the reliefs of Bharhut, with some reworks down to the 1st century CE.[22][24] |
|
Stupa No 3 (Stupa and balustrades only are Shunga). |
|
శుంగాల యుద్ధాలు
[మార్చు]శుంగాలు కళింగులు, శాతవాహనులు, ఇండో-గ్రీకులు, బహుశా పాంచాల, మధురాలతో యుద్ధం చేసినట్లు తెలుస్తుంది.[ఆధారం చూపాలి]. ఇండో-గ్రీకు రాజ్యంతో శుంగా సామ్రాజ్యం చేసిన యుద్ధాలు ఈ కాల చరిత్రలో గొప్పవిగా ఉన్నాయి. క్రీస్తుపూర్వం 180 నుండి గ్రీకో-బాక్ట్రియా పాలకుడు డెమెట్రియసు కాబూల్ లోయను జయించి శుంగాగాలను ఎదుర్కోవటానికి ట్రాన్సు-సింధులోకి ప్రవేశించినట్లు సిద్ధాంతీకరించబడింది.[11] ఇండో-గ్రీకు మొదటి మెనాండరు ఇతర భారతీయ పాలకులతో పాటలీపుత్రకు పోరాటంలో చేరిన (నాయకత్వం వహించిన) ఘనత సాధించాడు. ఏదేమైనా పోరాటం కచ్చితమైన స్వభావం, విజయం గురించి చాలా తక్కువ ఆధారాలు మాత్రమే లభించాయి. ఈ యుద్ధాల ఖచ్ఛితమైన ఫలితం అనిశ్చితంగా ఉంది.[ఆధారం చూపాలి]
సాహిత్య సాక్ష్యాలు
[మార్చు]మహాభారత, యుగ పురాణం వంటి అనేక రచనలు శుంగాలు, ఇండో-గ్రీకుల మధ్య సంఘర్షణను వివరించాయి.
శుంగాల సైనిక దాడులు
[మార్చు]అశోకవదన వంటి గ్రంథాలు బ్రహదీతను కూల్చివేసి అనేక మంది బౌద్ధ సన్యాసులను చంపారు.[27] ఇది పుష్యమిత్రుడు సైన్యాన్ని పాటలీపుత్రకు, పంజాబులోని సకాల (సియాల్‌కోట) వరకు బౌద్ధసైన్యాసులను హింసించడానికి ఎలా పంపించాడో వివరిస్తుంది.[28][29]
యవనులతో యుద్ధాలు
[మార్చు]భారతీయ వనరులలో యవనులు అని పిలువబడే ఇండో-గ్రీకులు మొదటి డెమెట్రియసు (మొదటి మెనాండరు) నేతృత్వంలో తరువాత భారతదేశం మీద దండెత్తారు. బహుశా బౌద్ధుల సహాయం పొంది ఉండవచ్చు అని భావిస్తున్నారు.[30] ముఖ్యంగా మెనాండరును మిలిందపంహాలో బౌద్ధమతంలోకి మారినట్లు వర్ణించారు.
భారతీయ చారిత్రక సంఘటనలను ఒక జోస్యం రూపంలో వివరించే యుగ పురాణం హిందూ వచనం నగరానికి రాబోయే యుద్ధాన్ని వివరిస్తుంది:, [31] [note 1] మెఘస్తనెసు వ్రాతల ఆధారంగా 570 గోపురాలు, 64 ద్వారాలతో పఠిష్టంగా సురక్షితంగా నిర్మించబడిన శుంగసామ్రాజ్య పాటలీపుత్ర రాజధాని మీద ఇండో- గ్రీకులు దండయాత్ర సాగించారు.[33]
నగరం మీద జరిగిన అతి తీవ్రమైన దాడి:
- "అప్పుడు, పాంచాల, మధురాలతో కలిసి సాకేతను సంప్రదించిన తరువాత యుద్ధంలో పరాక్రమవంతుడైన యవనులులు కుసుమధ్వాజ [" పుష్ప-ప్రామాణిక పట్టణం ", పటాలిపుత్ర] చేరుకుంటారు. చేరుకుంది, దాని ప్రసిద్ధ మట్టి కోటను పడగొట్టబడడంతో అన్ని రాజ్యాలు అస్తవ్యస్తంగా ఉంటాయి. " (యుగ పురాణం, పేరా 47-48, 2002 ఎడిషన్)
ఏదేమైనా యుగ పురాణం బాక్ట్రియాలో అంతర్యుద్ధాన్ని ఎదుర్కొన్నప్పటికీ యవనులు (ఇండో-గ్రీకులు) పటాలిపుత్రలో ఎక్కువ కాలం ఉండలేదని సూచిస్తుంది.
భారతదేశంలోకి గ్రీకులు చేసిన ఈ కొత్త దాడి వారిని రాజధాని పటాలిపుత్ర వరకు నడిపించిందని పాశ్చాత్య వర్గాలు సూచిస్తున్నాయి:[34]
అలెగ్జాండరు తరువాత వచ్చిన వారు గంగా, పటాలిపుత్రకు వెళ్లారు.స్ట్రాబో, 15.698
సింధూతీరంలో యుద్ధం
[మార్చు]కాళిదాసు విరచిత మాళవికాగ్నిమిత్రం నాటకంలో శుంగాల మధ్య ప్రత్యక్ష యుద్ధం కథనం కనుగొనబడింది. కాళిదాసు ఇందులో గ్రీకు అశ్వికదళ సిబ్బంది పుష్యమిత్ర మనవడు వసుమిత్రా మధ్య జరిగిన యుద్ధాన్ని వివరిస్తుంది. పుష్యమిత్ర మనవడు వసుమిత్ర 100 మంది సైనికులతో కలిసి "సింధు" నది " తీరానికి చేరుకుని భారతీయ సైనికులు గ్రీకుల సైనికులను ఓడించారు. పుష్యమిత్ర అశ్వమేధ యజ్ఞాన్ని విజయవంతంగా పూర్తి చేశాడు.[35] ఈ నది వాయువ్య దిశలో ఉన్న సింధు నది కావచ్చు ఊహించబడుతుంది. కాని శుంగాలు ఇక్కడి వరకు విస్తరించడానికి అవకాశం లేదు కనుక రచనలలో పేర్కొన్న నది సింధు నది లేదా గంగా పరీవాహక ప్రాంతంలోని " కాళి సింధు నది " అయి ఉండవచ్చు.[36]
శిలాశాసనాల సాక్ష్యాలు
[మార్చు]ధనదేవ- అయోధ్య- శాసనాలు
[మార్చు]అంతిమంగా శుంగాల పాలన అయోధ్య ప్రాంతానికి విస్తరించినట్లు తెలుస్తోంది. ఉత్తర మధ్య భారతదేశంలోని అయోధ్యలోని శుంగా శిలాశాసనాలు సాక్ష్యంగా ఉన్నాయి;[5] ముఖ్యంగా ధనదేవ-అయోధ్య శాసనం స్థానిక రాజు ధనదేవను సూచిస్తుంది. ఆయనను పుష్యమిత్ర షుంగా ఆరవ వారసుడని పేర్కొన్నారు. అయోధ్యలో పుష్యమిత్రుడు రెండు అశ్వమేధాలను చేసినట్లు శాసనం నమోదు చేసింది.[37]
యవనరాజ్య శీలాశాసనాలు
[మార్చు]గ్రీకులు మధుర మీద నియంత్రణను కొనసాగించినట్లు తెలుస్తోంది. మధురలో కనుగొనబడిన "మాఘేరా శాసనం" అని పిలువబడే యవనరాజ్య శాసనం క్రీస్తుపూర్వం 1 వ శతాబ్దంలో ఇండో-గ్రీకులు మధుర మీద నియంత్రణలో ఉన్నారని సూచిస్తుంది.[38][39] ఈ శాసనం దాని అంకిత తేదీని "యవనా ఆధిపత్యం (యవనరాజ్య) 116 వ సంవత్సరం చివరి రోజు"గా పేర్కొనడంలో ముఖ్యమైనది. ఈ శాసనం మధురలో క్రీస్తుపూర్వం 2 వ - 1 వ శతాబ్దాలలో ఇండో-గ్రీకుల నియంత్రణను ధ్రువీకరిస్తోందని భావిస్తారు. ఇది సంఖ్యా, సాహిత్య ఆధారాల ద్వారా కూడా ధ్రువీకరించబడింది.[6] అంతేకాకుండా శుంగా నాణేలు, శాసనాలు అక్కడ కనుగొనబడనందున శుంగాలు మధుర లేదా సురసేనలో పాలించినట్లు అనిపించదు.[6]
మధుర నగరం యవనులు, కంబోజుల ఉమ్మడి నియంత్రణలో ఉందని మహాభారతంలోని అనుశాసన పర్వం ధ్రువీకరిస్తుంది.[40]
అయినప్పటికీ తరువాత మధుర నగరాన్ని వారి నుండి తిరిగి ఇతరులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. బహుశా ఇతర దేశీయ పాలకులైన దత్తా రాజవంశం లేదా మిత్రా రాజవంశం లేదా రాజువుల ఆధ్వర్యంలోని ఇండో-సిథియా ఉత్తరప్రాంతాలలోని సాత్రపాలు దీనిని స్వాధీనం చేసుకుని ఉండవచ్చు. మధుర ప్రాంతంలో, అర్జునయన్లు, యౌదేయులు తమ నాణేల మీద ముద్రించి విడుదల చేసిన సైనిక విజయాలు ("అర్జునయాల విజయం", "యౌధేయుల విజయం") ఇందుకు సాక్ష్యంగా నిలిచాయి. క్రీస్తుపూర్వం 1 వ శతాబ్దంలో త్రిగార్తులు, ఆడుంబరలు, చివరకు కునిందాలు కూడా వారి స్వంత నాణాలను ముద్రించడం ప్రారంభించారు. ఇండో-గ్రీకుల నుండి స్వాతంత్ర్యాన్ని ధ్రువీకరిస్తూ వారి స్వంత నాణేలను ముద్రించినప్పటికీ వారి నాణేల ముద్రణాశైలి ఇండో-గ్రీకుల నుండి తీసుకోబడింది.
హెలియోడోరసు స్థూపాలు
[మార్చు]నిశ్చయంగా చెప్పలేకపోయినప్పటికీ ఇండో- గ్రీకు, శుంగరాజ్యాలు రెండు రాజ్యాలు ఆయా పాలకుల తరువాతి పాలనలలో సరళీకృతమైన దౌత్య సంబంధాలను ఏర్పరచుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఇండో-గ్రీకులు, శుంగాలు క్రీ.పూ 110 లోనే దౌత్య కార్యకలాపాల ఏర్పాటు చేసుకుని పరస్పర సమాచారమార్పిడి చేసినట్లు తెలుస్తోంది. హెలియోడోరసు స్తంభంలో సూచించినట్లు ఇది హెలియోడోరసు అనే గ్రీకు రాయబారి ఇండో-గ్రీకు రాజు అంటియలు సిడాసు రాజ్యసభ నుండి మధ్య భారతదేశంలోని విదిషాలోని శుంగా చక్రవర్తి భగభద్ర కోర్టుకు పంపినట్లు నమోదు చేయబడింది.
శుంగ రాజ్యం పతనం
[మార్చు]గ్రీకు నాయకుడు మీనాందరు; పాంచాలము, మధుర, సాకేతము జయించి పాటలీపుత్రము మీదకు కూడా వచ్చాడు. కాని, పుష్యమిత్రుడు అతనిని ఓడించి, పంజాబ్ లోనికి తరిమి వేశాడు. శత్రువులను జయించిన దానికి గుర్తుగా, పూర్వరాజుల వలె అశ్వమేధయాగము చేసాడు. ఇతడు చనిపోయిన తర్వాత ఇతని సంతతి వారు తొమ్మిది మంది రాజ్యాన్నేలారు. వీరిలో ఆఖరివాడు దేవభూతి; మంత్రియైన వసుదేవుడి చేతిలో క్రీ.పూ.73లో వధించ బడ్డాడు. తదుపరి కణ్వ వంశము స్థాపించ బడింది.
సాంచిస్థూపం విధ్వంశం
[మార్చు]సాంచి స్తూపాన్ని సాశపూ రెండో శతాబ్దిలో కొంతమేర ధ్వంసం చేశారు. శుంగ చక్రవర్తి పుష్యమిత్ర శుంగుడి హయాంలో ఇది జరిగి ఉండవచ్చు. పుష్యమిత్రుడు మూల స్థూపాన్ని ధ్వసం చేయగా అతడి కుమారుడు అగ్నిమిత్రుడు దాన్ని పునర్నిర్మించాడని భావిస్తున్నారు. శుంగ వంశీయుల తదుపరి పాలనా కాలంలో, ఈ స్థూపాన్ని రాతి కట్టడాలతో రెట్టింపు పరిమాణంలో విస్తరింపజేశారు. గుమ్మటాన్ని స్థూపం పైభాగానికి సమీపంలో విస్తరించారు; మూడు పెద్ద ఛత్రాలను ఉంచారు. అనేక దొంతరలతో కూడిన ఈ గుమ్మటం ధర్మానికి నమునాగా ధర్మచక్రంగా ఉంటుంది. ఈ గుమ్మటం ఒక పెద్ద వృత్తాకారపు వేదికపై ప్రదక్షిణ కోసం ఏర్పర్చచ బడింది, దీన్ని రెండు వరుసల మెట్ల దారి గుండా దర్శించవచ్చు. నేలకు సమాంతరంగా రెండవ రాతి బాట వద్ద పలు రాతిస్తంభాల వరుసను కట్టారు. దీనికి నలువైపులా నాలుగు పెద్ద ద్వారాలు (తోరణాలు) ఎదురెదురుగా ఉన్న రీతిలో కట్టారు. శుంగ వంశ పాలనా కాలంలో నిర్మించినట్లు భావిస్తున్న భవంతులే రెండవ, మూడవ స్తూపాలుగా ఉన్నాయి. (అయితే ఇవి బాగా అలంకరించిన తోరణాలు కావు, శాసనాలను బట్టి ఇవి శాతవాహన కాలానికి చెందినవిగా తెలుస్తోంది.) [21]
కళలు
[మార్చు]పర్షియా కళ ద్వారా ప్రభావితమైన మౌర్య శైలి కళకంటే శుంగ కళా శైలి భిన్నంగా ఉంది. దీనికి విరుద్ధంగా జానపద కళ పాత అంశాలు దేవీ ఆరాధనలు శుంగకళా శైలిలో కనిపిస్తాయి. శుంగ శైలిని 'మరింత భారతీయత' గా చూశారు. వీరిని దీనిని తరచుగా స్వదేశీయులుగా అభివర్ణిస్తారు.[41] ఈ కాలంలో కళ, విద్య, తత్వశాస్త్రం, ఇతర అభ్యాసాలు వర్ధిల్లాయి. ముఖ్యంగా, పతంజలి యోగ సూత్రాలు, మహాభాష్యాలు ఈ కాలంలో రచించబడ్డాయి. మాలవికకాగ్నిమిత్రంలో దాని తదుపరి ప్రస్తావనకు కూడా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ పనిని తరువాతి గుప్తా కాలంలో కాళిదాస స్వరపరిచారు. రాజ్యసభలో జరిగిన కుట్ర నేపథ్యంతో మాలవికా, రాజు అగ్నిమిత్ర ప్రేమను శృంగారభరితంగా రచించబడింది.
ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, మరింత హెలెనిస్టికు గాంధారా పాఠశాలకు స్వదేశీ ప్రతిరూపంగా పరిగణించబడే మధుర పాఠశాల పెరుగుదలతో ఉపఖండంలోని కళాత్మకత కూడా అభివృద్ధి చెందింది.
శుంగా చారిత్రకకాలంలో (క్రీ.పూ 185 నుండి 73 వరకు), సాంచి, బర్హూటు స్థూపాల వద్ద కొన్ని నిర్మాణ విస్తరణలు జరిగినట్లు భావిస్తున్నారు. అశోక చక్రవర్తి పాలనలో ప్రారంభమైన మధ్య భారతదేశంలో (మధ్యప్రదేశ్) బౌద్ధ కార్యకలాపాలు శుంగాల పాలనలో కొంతవరకు మనుగడ సాగించాయి. ఈ ప్రాంతాలలో శుంగాల నియంత్రణ బలహీనత కారణంగా ఇది సంభవించిందా లేదా వారి వైపు సహనానికి సంకేతమా అనేది అనిశ్చితంగా ఉంది.
Shunga statuettes and reliefs |
|
మూలాలు
[మార్చు]- ↑ Stadtner, Donald (1975). "A Śuṅga Capital from Vidiśā". Artibus Asiae. 37 (1/2): 101–104. doi:10.2307/3250214. JSTOR 3250214.
- ↑ Between the Empires: Society in India 300 BCE to 400 CE By Patrick Olivelle, Oxford University Press, Page 147-152
- ↑ "Pushyamitra is said in the Puranas to have been the senānī or army-commander of the last Maurya emperor Brihadratha" The Yuga Purana, Mitchener, 2002.
- ↑ Thapar 2013, p. 296.
- ↑ 5.0 5.1 5.2 5.3 Ancient Indian History and Civilization, Sailendra Nath Sen, New Age International, 1999, p.169
- ↑ 6.0 6.1 6.2 6.3 History of Early Stone Sculpture at Mathura: Ca. 150 BCE - 100 CE, Sonya Rhie Quintanilla, BRILL, 2007, p.8-10 [1]
- ↑ John S. Strong (1989). The Legend of King Aśoka: A Study and Translation of the Aśokāvadāna. Motilal Banarsidass. ISBN 978-81-208-0616-0. Retrieved 30 October 2012.
- ↑ K.A. Nilkantha Shastri (1970), A Comprehensive History of India: Volume 2, p.108: "Soon after Agnimitra there was no 'Sunga empire.'"
- ↑ Bhandare, Shailendra. "Numismatics and History: The Maurya-Gupta Interlude in the Gangetic Plain." in Between the Empires: Society in India, 300 to 400, ed. Patrick Olivelle (2006), p.96
- ↑ 10.0 10.1 10.2 Sarvastivada pg 38–39
- ↑ 11.0 11.1 11.2 A Journey Through India's Past Chandra Mauli Mani, Northern Book Centre, 2005, p.38
- ↑ John S. Strong (1989). The Legend of King Aśoka: A Study and Translation of the Aśokāvadāna. Motilal Banarsidass. ISBN 978-81-208-0616-0. Retrieved 30 October 2012.
- ↑ Pratisarga Parva p.18
- ↑ Akira Hirakawa, Paul Groner, "A History of Indian Buddhism: From Sakyamuni to Early Mahayana", Motilal Banarsidass Publ., 1996, ISBN 81-208-0955-6 pg 223
- ↑ Buddhist Landscapes in Central India: Sanchi Hill and Archaeologies of Religious and Social Change, c. Third Century BC to Fifth Century AD Julia Shaw, Routledge, 2016 p.58
- ↑ Asoka, Mookerji Radhakumud, Motilal Banarsidass Publishe, 1962 p.152
- ↑ 17.0 17.1 Between the Empires: Society in India 300 BCE to 400 CE Patrick Olivelle, Oxford University Press, 2006 p.58-59
- ↑ Between the Empires: Society in India 300 BCE to 400 CE Patrick Olivelle, Oxford University Press, 2006 p.75
- ↑ (Barua, B.M., 'Old Buddhist Shrines at Bodh-Gaya Inscriptions)
- ↑ "Bodh Gaya from 500 BCE to 500 CE". buddhanet.net.
- ↑ 21.0 21.1 "Who was responsible for the wanton destruction of the original brick stupa of Ashoka and when precisely the great work of reconstruction was carried out is not known, but it seems probable that the author of the former was Pushyamitra, the first of the Shunga kings (184-148 BC), who was notorious for his hostility to Buddhism, and that the restoration was affected by Agnimitra or his immediate successor." in John Marshall, A Guide to Sanchi, p. 38. Calcutta: Superintendent, Government Printing (1918).
- ↑ 22.0 22.1 22.2 22.3 Buddhist Landscapes in Central India: Sanchi Hill and Archaeologies of Religious and Social Change, C. Third Century BC to Fifth Century AD, Julia Shaw, Left Coast Press, 2013 p.88ff
- ↑ Marshall p.81
- ↑ 24.0 24.1 24.2 24.3 24.4 Buddhist Landscapes in Central India: Sanchi Hill and Archaeologies of Religious and Social Change, C. Third Century BC to Fifth Century AD, Julia Shaw, Left Coast Press, 2013 p.90
- ↑ Marshall p.82
- ↑ D.N. Jha,"Early India: A Concise History"p.150, plate 17
- ↑ John S. Strong (1989). The Legend of King Aśoka: A Study and Translation of the Aśokāvadāna. Motilal Banarsidass. ISBN 978-81-208-0616-0. Retrieved 30 October 2012.
- ↑ Buddhism in India: From the Sixth Century B.C. to the Third Century A.D. Ashok Kumar Anand, Gyan Books, 1996, p.96
- ↑ "Pushyamitra equipped a fourfold army, and intending to destroy the Buddhist religion, he went to the Kukkutarama (in Pataliputra). ... Pushyamitra therefore destroyed the sangharama, killed the monks there, and departed. ... After some time, he arrived in Sakala, and proclaimed that he would give a ... reward to whoever brought him the head of a Buddhist monk."John S. Strong (1989). The Legend of King Aśoka: A Study and Translation of the Aśokāvadāna. Motilal Banarsidass. ISBN 978-81-208-0616-0. Retrieved 30 October 2012.
- ↑ A Journey Through India's Past Chandra Mauli Mani, Northern Book Centre, 2005, p.39
- ↑ "For any scholar engaged in the study of the presence of the Indo-Greeks or Indo-Scythians before the Christian Era, the Yuga Purana is an important source material" Dilip Coomer Ghose, General Secretary, The Asiatic Society, Kolkata, 2002
- ↑ Rocher, Ludo (1986). The Purāṇas (in ఇంగ్లీష్). Otto Harrassowitz Verlag. pp. 253–254. ISBN 9783447025225.
- ↑ "Megasthenes: Indika". Project South Asia. Archived from the original on 10 December 2008.
The greatest city in India is that which is called Palimbothra, in the dominions of the Prasians [...] Megasthenes informs us that this city stretched in the inhabited quarters to an extreme length on each side of eighty stadia, and that its breadth was fifteen stadia, and that a ditch encompassed it all round, which was six hundred feet in breadth and thirty cubits in depth, and that the wall was crowned with 570 towers and had four-and-sixty gates. (Arr. Ind. 10. 'Of Pataliputra and the Manners of the Indians')
- ↑ Indian History Allied Publishers
- ↑ The Malavikágnimitra : a Sanskrit play by Kālidāsa; Tawney, C. H. p.91
- ↑ "Indo-Greek, Indo-Scythian and Indo-Parthian coins in the Smithsonian institution", Bopearachchi, p16. Also: "Kalidasa recounts in his Mālavikāgnimitra (5.15.14–24) that Puṣpamitra appointed his grandson Vasumitra to guard his sacrificial horse, which wandered on the right bank of the Sindhu river and was seized by Yavana cavalrymen- the latter being thereafter defeated by Vasumitra. The "Sindhu" referred to in this context may refer the river Indus: but such an extension of Shunga power seems unlikely, and it is more probable that it denotes one of two rivers in central India -either the Sindhu river which is a tributary of the Yamuna, or the Kali-Sindhu river which is a tributary of the Chambal." The Yuga Purana, Mitchener, 2002.
- ↑ Bakker, The rise of Ayodhya as a place of pilgrimage 1982.
- ↑ Sonya Rhie Quintanilla (2007). History of Early Stone Sculpture at Mathura: Ca. 150 BCE - 100 CE. BRILL. p. 254. ISBN 978-90-04-15537-4.
- ↑ Shankar Goyal, ed. (2004). India's ancient past. Jaipur: Book Enclave. p. 189. ISBN 9788181520012.
Some Newly Discovered Inscriptions from Mathura : The Meghera Well Stone Inscription of Yavanarajya Year 160 Recently a stone inscription was acquired in the Government Museum, Mathura.
- ↑ "tatha Yavana Kamboja Mathuram.abhitash cha ye./ ete ashava.yuddha.kushaladasinatyasi charminah."//5 — (MBH 12/105/5, Kumbhakonam Ed)
- ↑ Kulke, Hermann; Rothermund, Dietmar (2004). A History of India (in ఇంగ్లీష్). Psychology Press. ISBN 9780415329200.
చిత్రమాలిక
[మార్చు]-
Shunga balustrade and staircase.
-
Shunga stonework.
-
Shunga vedika (railing) with inscriptions.
-
Deambulatory pathway.
-
Summit railing and umbrellas.
-
Elephant and Riders.
-
Balustrade post with Lakshmi.
-
Balustrade post with Yaksha.
-
Pillar with elephants supporting a wheel.
-
Personnage.
-
Lotus.
-
Floral motif.
-
Foreigner on a horse, circa 115 BCE.
-
Ashoka supported by his two wives. Similar to the later relief at Gateway 1.
-
Relic boxes found inside the stupa.
-
Stairway and railing.
-
Lotus medallions.
-
Floral designs.
-
Post relief.
ఉల్లేఖన లోపం: "note" అనే గ్రూపులో <ref>
ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="note"/>
ట్యాగు కనబడలేదు
- Pages using infobox country with unknown parameters
- మూలాలు చేర్చవలసిన పాఠ్యమున్న వ్యాసాలు
- మూలాలు చేర్చవలసిన పాఠ్యమున్న వ్యాసాలు from December 2011
- మూలాలు చేర్చవలసిన పాఠ్యమున్న వ్యాసాలు from September 2017
- సామ్రాజ్యాలు, భారతదేశ రాజ్యాలు
- బెంగాల్ రాజవంశాలు
- బెంగాల్ చరిత్ర
- రాజవంశాలు
- మగధ డివిజను
- శుంగ సామ్రాజ్యం
- 185 బిసిఈ
- 2వ శతాబ్దం బిసి స్థాపితాలు
- 1 వ శతాబ్దం బిసి
- ఆసియా మాజీ సామ్రాజ్యాలు
- దక్షిణాసియా మాజీ రాచరికాలు
- భారతదేశ చరిత్ర
- 2 వ శతాబ్దం బిసి
- మూలాల లోపాలున్న పేజీలు
- Pages with reference errors that trigger visual diffs