షాట్‌వెల్
షాట్‌వెల్ | |
---|---|
ఫెడోరా నందు షాట్‌వెల్ 0.10.1 | |
అభివృద్ధిచేసినవారు | యోర్బ ఫౌండేషన్ |
మొదటి విడుదల | 26 జూన్ 2009 |
సరికొత్త విడుదల | 0.10.1 / జూన్ 3, 2011 |
ప్రోగ్రామింగ్ భాష | వాలా (GTK+) |
నిర్వహణ వ్యవస్థ | లినక్స్ |
వేదిక | GNOME |
భాషల లభ్యత | బహుళభాషలు |
ఆభివృద్ది దశ | క్రియాశీలం |
లైసెన్సు | GNU LGPL v2.1 |
వెబ్‌సైట్ | యోర్బ/షాట్‌వెల్ |
షాట్‌వెల్ అనేది గ్నోమ్ డెస్కుటాప్ పర్యావరణం నందు వ్యక్తిగత ఛాయాచిత్రాల నిర్వహణకు రూపొందించిన ఒక చిత్ర నిర్వాహకం. ఇది GNOME ఆధారిత లినక్స్ పంపకాలయిన ఫెడోరా 13, ఉబుంటు 10.10 మావెరిక్ మీర్కట్ రూపాంతరాలలో ప్రామాణిక బొమ్మ సాధనంగా ఉన్న F_Spot స్థానాన్ని ఆక్రమించింది.
విశిష్టతలు
[మార్చు]షాట్‌వెల్ ఒక డిజిటల్ కెమెరా నేరుగా నుండి ఫోటోలు, వీడియోలను దిగుమతి చేయగలదు. షాట్‌వెల్ స్వయంచాలకంగా తేదీ ద్వారా ఫోటోలు, వీడియోలను సమూహాలుగా ఉంచుతుంది అంతేకాకుండా టాగింగ్ కూడా మద్దతిస్తుంది. దీని ఇమేజ్ ఎడిటింగ్ విశిష్టతలు ఫొటోలను కత్తిరించడానికి, ఎర్ర కన్ను ప్రభావాన్ని తొలగించడానికి, స్థాయిలు, రంగు సమతూకం సర్దుబాటు చేయడానికి వాడుకరులను అనుమతిస్తుంది. ఇందులో బొమ్మను మెరుగుపరుచుటకు మెరుగుపరుచు ఐచ్ఛికము ఉన్నది దీని ద్వారా బొమ్మను మరింత ఆకర్షనీయంగా చేయవచ్చు. షాట్‌వెల్ ద్వారా వాడుకరులు వారి చిత్రాలు, వీడియోలను ఫేస్‌బుక్, ఫ్లికర్, పికాసా వెబ్ ఆల్బమ్స్, పివిగో, యూట్యూబ్ వంటి సామాజిక అనుసంధాన వేదికలలో ప్రచురించడానికి అనుమతిస్తుంది.
సాంకేతిక సమాచారం
[మార్చు]షాట్‌వెల్ Vala ప్రోగ్రామింగ్ భాషలో వ్రాయబడింది. ఇది F.Spot, gThumb వంటి ఇతర చిత్ర నిర్వాహకాల వలె libgphoto2 లైబ్రరీ ఉపయోగించి ఫొటోలను దిగుమతి చేసుకుంటుంది.
బాహ్య లింకులు
[మార్చు]- అధికారిక వెబ్సైటు Archived 2011-07-27 at the Wayback Machine