సయాలీ భగత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సయాలీ భగత్
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2007–2016
జీవిత భాగస్వామి
నవనీత్ ప్రతాప్ సింగ్
(m. 2013)
పిల్లలు1[1]

సయాలీ భగత్, మహారాష్ట్రకు చెందిన సినిమా నటి, మాజీ అందాల రాణి. 2004లో జరిగిన ఫెమినా మిస్ ఇండియా పోటీలో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ టైటిల్ గెలుపొందింది.[2]

జీవిత విశేషాలు

[మార్చు]

సయాలీ ఫ్రావాషి అకాడమీ,[3] నాసిక్‌లో చదువుకుంది. అల్కేష్ దినేష్ మోడీ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఫైనాన్షియల్ అండ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ నుండి బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.[4]

వృత్తి జీవితం

[మార్చు]

సయాలీ ప్రారంభంలో డెంట్జ్, కాలేజ్ షో, స్వరోవ్స్కీ జెమ్స్ ఫ్యాషన్ షో వంటి మోడలింగ్ అసైన్‌మెంట్‌లు చేసింది.[5] 2007లో వచ్చిన ది ట్రైన్: సమ్ లైన్స్ షుడ్ నెవర్ క్రాస్డ్ సినిమా ద్వారా హిందీ సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[6] ఎంటీవి బక్రా కార్యక్రమంలో సింగపూర్ జర్నలిస్ట్‌గా భారత క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌ను ఇంటర్వ్యూ చేస్తున్నట్లు నటించింది. 2009లో పేయింగ్ గెస్ట్స్‌లో జావేద్ జాఫ్రీ సరసన నటించింది.[6][7]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

2013 డిసెంబరు 10న హర్యానాకు చెందిన వ్యాపారవేత్త నవనీత్ ప్రతాప్ సింగ్‌తో సయాలీ వివాహం జరిగింది.[8][9]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు
2007 ది ట్రైన్ అంజలి దీక్షిత్ హిందీ
2008 గుడ్ లక్ సబా శర్మ
హల్లా బోల్ సయాలీ "ఇస్ పాల్ కీ సోచ్" పాటలో ప్రత్యేక ప్రదర్శన
బ్లేడ్ బాబ్జీ అర్చన తెలుగు
2009 న్యూటోనిన్ మూండ్రం విధి ప్రియా తమిళం అరంగేట్రం
కిర్కిట్ హిందీ
పేయింగ్ గెస్ట్స్ సీమ
జైల్ సయాలీ ప్రత్యేక స్వరూపం
2010 షౌట్
ది సెయింట్ హూ థాట్ అదర్ వైజ్ సంగీత కదమ్ ఆంగ్ల
మెయిన్ రోనీ ఔర్ రోనీ హిందీ
2011 ఇంపేషంట్ వివేక్ శృతి
నాటీ @ 40 సంజీవ్‌ను తిరస్కరించిన మహిళ
2012 ఘోస్ట్ సుహాని
థిస్ వీకెండ్ దివ్య
2013 రాజధాని ఎక్స్‌ప్రెస్ రీనా
ఛలో మూవీ
2014 యారియాన్ నిక్కి
2015 మై సెల్ఫ్ పెండు పంజాబీ కుడి పంజాబీ [10]
2016 హోమ్ స్టే కన్నడహిందీ
ధిగిల్ తమిళం

మూలాలు

[మార్చు]
  1. 'The Train' actress Sayali Bhagat shares first glimpse of daughter Ivankaa Singh, shares pregnancy photos. Times of India.
  2. "SAYALI BHAGAT – PROFILE". The Times of India. Archived from the original on 2013-05-13. Retrieved 2023-03-09.
  3. "Fravashi Academy :: We create values, We care..." fravashiacademy.com. Archived from the original on 2020-06-04. Retrieved 2023-03-09.
  4. "SAYALI BHAGAT – PROFILE". The Times of India. Archived from the original on 2013-05-13. Retrieved 2023-03-09.
  5. "Sayali Bhagat – Femina Miss India". The Times of India. Archived from the original on 2013-01-12. Retrieved 2023-03-13.
  6. 6.0 6.1 "Sayali wants to play Anarkali". The Hindu. Chennai, India. 24 November 2008. Archived from the original on 2012-11-09. Retrieved 2023-03-13.
  7. "Sayali wants to play Anarkali". The Hindu. Chennai, India. 24 November 2008. Archived from the original on 2012-11-09. Retrieved 2023-03-13.
  8. "रेवाड़ी की बहू बनीं पूर्व मिस इंडिया सयाली भगत". Amar Ujala. Retrieved 2023-03-13.
  9. "Sayali marriage".
  10. Service, Tribune News (18 August 2015). "Root cause". Retrieved 2023-03-09.

బయటి లింకులు

[మార్చు]