సర్విక్స్ గర్భాశయ క్యాన్సర్
సర్విక్స్ గర్భాశయ కాన్సర్ | |
---|---|
ఇతర పేర్లు | సర్వైకల్ కాన్సర్ |
సర్వైకల్ కాన్సర్ కనిపించే ప్రదేశము, సాధారణ కణాలు ఇంకా కాన్సర్ కణాలు | |
ఉచ్చారణ | |
ప్రత్యేకత | గర్భకోశ వ్యాధులు, ఆంకాలజీ |
లక్షణాలు | లక్షణాలు కనిపించవు. తరువాత, అసాధారణ యోని రక్తస్రావం, కటి నొప్పి, లైంగిక సంపర్కం సమయంలో నొప్పి కొన్నిసార్లు ప్రేగు, మూత్రాశయం పనితీరుతో సమస్యలు ఉండవచ్చు |
సాధారణ ప్రారంభం | 10 నుండి 20 సంవత్సరాల మధ్య |
రకాలు | 90% పొలుసుల కణ క్యాన్సర్ , 10% అడెనో క్యార్సినోమా, కొంతవరకు ఇతర రకాలు |
కారణాలు | మానవ పాపిల్లోమావైరస్ సంక్రమణ |
ప్రమాద కారకములు | ధూమపానం, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, గర్భ నియంత్రణ మాత్రలు, చిన్న వయస్సులోనే లైంగిక సంబంధం ప్రారంభించడం, చాలా మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉండటం |
రోగనిర్ధారణ పద్ధతి | గర్భాశయ పరీక్ష, బయాప్సీ, మెడికల్ ఇమేజింగ్ |
నివారణ | పాప్ పరీక్ష, ఎసిటిక్ ఆమ్లాన్నీ ఉపయోగించి గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ |
చికిత్స | శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియేషన్ |
రోగ నిరూపణ | 68%లో 5 సంవత్సరాల మనుగడ, అమెరికా లో 46% |
తరుచుదనము | 570,000 new cases (2018) |
మరణాలు | 311,000 (2018) |
సర్విక్స్ గర్భాశయ క్యాన్సర్ అనేది గర్భాశయంలోని సర్విక్స్ భాగంలో ఏర్పడ్డ కా.[2] సర్విక్స్ అంటే గర్భాశయ దిగువ భాగం. ఇది గర్భాశయాన్ని, యోనితో అనుసంధానించుతుంది.
కారణాలు
[మార్చు]దీనికి కారణం శరీర ఇతర భాగాలపై దాడి చేయగల లేదా వ్యాప్తి చెందే సామర్థ్యం ఉన్న కణాల అసాధారణ పెరుగుదల .[3] సాధారణంగా ప్రారంభంలో, ఎటువంటి లక్షణాలు కనిపించవు..[2] తరువాత, అసాధారణ యోని రక్తస్రావం, కటి నొప్పి, లైంగిక సంపర్కం సమయంలో నొప్పి కొన్నిసార్లు ప్రేగు, మూత్రాశయం పనితీరుతో సమస్యలు ఉండవచ్చు.[2] సంభోగం తర్వాత రక్తస్రావం తీవ్రంగా ఉండకపోవచ్చు కానీ ఇది గర్భాశయ క్యాన్సర్ ఉనికిని కూడా సూచించవచ్చు.
90% పైగా సర్విక్స్ గర్భాశయ క్యాన్సర్ కేసులకు మానవ పాపిల్లోమావైరస్ సంక్రమణ (HPV) కారణమవుతుంది.[4][5] అయితే, HPV సంక్రమణలు ఉన్న అంత మందికి గర్భాశయ క్యాన్సర్ అభివృద్ధి చెందదు.[6] ఇతర ప్రమాద కారకాలలో ధూమపానం, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, గర్భ నియంత్రణ మాత్రలు, చిన్న వయస్సులోనే లైంగిక సంబంధం ప్రారంభించడం, చాలా మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉండటం వంటివి ఉన్నాయి, కానీ ఇవి ఎక్కువ ముఖ్యమైనవి కావు.[7][8]
సర్విక్స్ గర్భాశయ క్యాన్సర్ సాధారణంగా 10 నుండి 20 సంవత్సరాల కాలం ముండు నుంచి జరుగుతున్న మార్పుల నుండి అభివృద్ధి చెందుతుంది.[6] ఈ క్యాన్సర్ కేసులలో సుమారు 90% పొలుసుల కణ క్యాన్సర్ (squamous cell carcinomas), 10% అడెనోక్యార్సినోమా, కొంతవరకు ఇతర రకాలు.[7]
వ్యాధి నిర్ధారణ, నివారణ
[మార్చు]రోగనిర్ధారణ సాధారణంగా గర్భాశయ పరీక్ష, తరువాత బయాప్సీ ద్వారా జరుగుతుంది. క్యాన్సర్ వ్యాపించిందో లేదో తెలుసుకోవడానికి మెడికల్ ఇమేజింగ్ చేస్తారు.[8] హెచ్.పి.వి. (HPV) టీకాలు అధిక-ప్రమాదకర వైరస్ల కుటుంబానికి చెందిన రెండు నుండి ఏడు వైరస్ల వరకు రక్షిస్తాయి. 90% సర్విక్స్ గర్భాశయ క్యాన్సర్లను నివారించవచ్చు.[9][10][11] అయితే క్యాన్సర్ ప్రమాదం ఎప్పటికీ ఉన్నందున, మార్గదర్శకాలు సాధారణంగా పాప్ పరీక్షలను కొనసాగించాలని సిఫార్సు చేస్తాయి.[9] ఇతర నివారణ పద్ధతులు ఏమంటే లైంగిక భాగస్వాములను తక్కువ కలిగి ఉండటం, కండోమ్ల వాడకం.[12] పాప్ పరీక్ష లేదా ఎసిటిక్ ఆమ్లాన్నీ ఉపయోగించి గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ముందస్తు మార్పులను గుర్తించగలదు, ఇది చికిత్స చేసినప్పుడు, క్యాన్సర్ అభివృద్ధిని నిరోధించగలదు.[13] చికిత్సలో శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియేషన్ కలపి ఉండవచ్చు.[8] అమెరికాలో ఐదేళ్ల మనుగడ రేటు 68%. [14] అయితే, క్యాన్సర్ను ఎంత త్వరగా గుర్తించారన్న దానిపై ఈ ఫలితాలు ఆధారపడి ఉంటుంది .[7]
వ్యాధి ప్రాబల్యం
[మార్చు]ప్రపంచవ్యాప్తంగా, క్యాన్సర్కు ఈ సర్విక్స్ గర్భాశయ క్యాన్సర్ నాల్గవ అత్యంత సాధారణ కారణం . మహిళల్లో క్యాన్సర్ మరణాలకి నాల్గవ కారణం కూడా.[6] 2012 లో, సర్విక్స్ గర్భాశయ క్యాన్సర్ కేసులు 528,000 , ఇంకా 266,000 మరణాలు సంభవించాయి.[6] ఇది మొత్తం క్యాన్సర్ మరణాలలో సుమారు 8%.[15] అభివృద్ధి చెందుతున్న దేశాలలో సుమారు 70% సర్విక్స్ గర్భాశయ క్యాన్సర్లు, 90% మరణాలు సంభవిస్తున్నాయి.[6][16] తక్కువ ఆదాయ దేశాలలో, క్యాన్సర్ మరణానికి ఇది అత్యంత సాధారణ కారణాలలో ఒకటి .[13] అభివృద్ధి చెందిన దేశాలలో, సర్విక్స్ గర్భాశయ పరీక్ష కార్యక్రమాల విస్తృత వినియోగం సర్విక్స్ గర్భాశయ క్యాన్సర్ రేట్లను బాగా తగ్గించింది.
సూచనలు
[మార్చు]- ↑ "CERVICAL | meaning in the Cambridge English Dictionary". dictionary.cambridge.org (in ఇంగ్లీష్). Archived from the original on 16 May 2018. Retrieved 5 October 2019.
- ↑ 2.0 2.1 2.2 Armstrong, Deborak K. (2020). "189. Gynaecologic cancers". In Goldman, Lee; Schafer, Andrew I. (eds.). Goldman-Cecil Medicine (in ఇంగ్లీష్). Vol. 1 (26th ed.). Philadelphia: Elsevier. pp. 1327–1329. ISBN 978-0-323-55087-1. Archived from the original on 2022-07-08. Retrieved 2022-07-08.
- ↑ "Defining Cancer". National Cancer Institute. 2007-09-17. Archived from the original on 25 June 2014. Retrieved 10 June 2014.
- ↑ Kumar V, Abbas AK, Fausto N, Mitchell RN (2007). Robbins Basic Pathology (8th ed.). Saunders Elsevier. pp. 718–721. ISBN 978-1-4160-2973-1.
- ↑ Kufe, Donald (2009). Holland-Frei cancer medicine (8th ed.). New York: McGraw-Hill Medical. p. 1299. ISBN 9781607950141. Archived from the original on 2015-12-01.
- ↑ 6.0 6.1 6.2 6.3 6.4 World Cancer Report 2014. World Health Organization. 2014. pp. Chapter 5.12. ISBN 978-9283204299.
- ↑ 7.0 7.1 7.2 "Cervical Cancer Treatment (PDQ®)". National Cancer Institute. 2014-03-14. Archived from the original on 5 July 2014. Retrieved 25 June 2014.
- ↑ 8.0 8.1 8.2 "Cervical Cancer Treatment (PDQ®)". NCI. 2014-03-14. Archived from the original on 5 July 2014. Retrieved 24 June 2014.
- ↑ 9.0 9.1 "Human Papillomavirus (HPV) Vaccines". National Cancer Institute. 2011-12-29. Archived from the original on 4 July 2014. Retrieved 25 June 2014.
- ↑ "FDA approves Gardasil 9 for prevention of certain cancers caused by five additional types of HPV". U.S. Food and Drug Administration. 10 December 2014. Archived from the original on 10 January 2015. Retrieved 8 March 2015.
- ↑ Tran NP, Hung CF, Roden R, Wu TC (2014). Control of HPV infection and related cancer through vaccination. Vol. 193. pp. 149–71. doi:10.1007/978-3-642-38965-8_9. ISBN 978-3-642-38964-1. PMID 24008298.
{{cite book}}
:|work=
ignored (help) - ↑ "Cervical Cancer Prevention (PDQ®)". National Cancer Institute. 2014-02-27. Archived from the original on 6 July 2014. Retrieved 25 June 2014.
- ↑ 13.0 13.1 World Health Organization (February 2014). "Fact sheet No. 297: Cancer". Archived from the original on 2014-02-13. Retrieved 2014-06-24.
- ↑ "SEER Stat Fact Sheets: Cervix Uteri Cancer". NCI. National Cancer Institute. November 10, 2014. Archived from the original on 6 July 2014. Retrieved 18 June 2014.
- ↑ World Cancer Report 2014. World Health Organization. 2014. pp. Chapter 1.1. ISBN 978-9283204299.
- ↑ "Cervical cancer prevention and control saves lives in the Republic of Korea". World Health Organization. Archived from the original on 5 November 2018. Retrieved 1 November 2018.