సహజ సంఖ్యలు
Jump to navigation
Jump to search
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (నవంబర్ 2016) |
సాధారణంగా మనం ఏవైనా వస్తువులను లెక్కించటానికి వాడే సంఖ్యలను "సహస సంఖ్యలు" అంటారు. వీటిని గణన సంఖ్యలు అనికూడా పిలుస్తారు. వీటీని ఆంగ్లంలో Natural Numbers అంటారు. వీటి సంఖ్యా సమితిని "N"తో సూచిస్తారు.
సంకలన ధర్మాలు
[మార్చు]సంవృత ధర్మం
[మార్చు]- ఏ రెండు సహజ సంఖ్యల మొత్తం ఒక ఒక సహజ సంఖ్య అవుతుంది. a, b అనునవి సహజ సంఖలైతే a+b కూడా ఒక సహజ సంఖ్య.
- ఉదా: 2,3 లుసహజ సంఖ్యలు అయిన 2+3=5 కూడా ఒక సహజ సంఖ్య
స్థిత్యంతర ధర్మం
[మార్చు]- a, b అనునవి సహజ సంఖ్య లైతే a+b = b+a అవుతుంది.
- ఉదా: 5,8 అనునవి రెండు రెండు సహజ సంఖ్యలైన 5+8 = 8+5 అగును.
సహచర ధర్మం
[మార్చు]- a, b, c అనునవి మూడు సహజ సంఖ్యలైతే (a+b) +c =a+ (b+c) అవుతుంది.
- ఉదా: 7,8, 9 మూడు సహజ సంఖ్యలు అయిన (7+8) +9=7+ (8+9) అవుతుంది.
తత్సమాంశము
[మార్చు]- a ఒక సహజ సంఖ్య అయితే a+0=a అయ్యేటట్లు "0" అనే సంఖ్య సహజ సంఖ్యలలో లేదు. అందువల్ల సహజ సంఖ్యా సమితి తత్సమ ధర్మం పాటించదు.
సంకలన విలోమము
[మార్చు]- a ఒక సహజ సంఖ్య అయిన a+ (-a) =0 అయ్యేటట్లు -a అనే సంఖ్య సంఖ్య సహజ సంఖ్యలలో లేదు. అందువలన సహజ సంఖ్యలలో సంకలన విలోమం ఉండదు.
గుణకార ధర్మాలు
[మార్చు]సంవృత ధర్మం
[మార్చు]- ఏ రెండు సహజ సంఖ్యల లబ్ధం ఒక సహజ సంఖ్య అవుతుంది. a, b అనునవి సహజ సంఖ్య లైతే axb కూడా ఒక సహజ సంఖ్య.,
- ఉదా: 2,3 లుసహజ సంఖ్యలు అయిన 2x3=6 కూడా ఒక సహజ సంఖ్య
స్థిత్యంతర ధర్మం
[మార్చు]- a, b అనునవి సహజ సంఖ్యలైతే axb = bxa అవుతుంది.
- ఉదా: 5,8 అనునవి రెండు సహజ సంఖ్యలు అయిన 5x8 = 8x5 అగును.
సహచర ధర్మం
[మార్చు]- a, b, c అనునవి మూడుసహజ సంఖ్యలైతే (axb) xc =ax (bxc) అవుతుంది.
- ఉదా: 7,8, 9 మూడు సహజ సంఖ్యలు అయిన (7x8) x9=7 (8x9) అవుతుంది.
తత్సమాంశము
[మార్చు]- a ఒక పూర్ణసంఖ్య అయితే ax1=a అయ్యేటట్లు "1" అనే సహజ సంఖ్య ఉంది. "1"ను గుణకార తత్సమాంశము అంటారు.
- ఒక సంఖ్యను ఏ సంఖ్యతో గుణించిన మరల అదే సంఖ్య వచ్చి ఆ గుణించిన సంఖ్య ఆ సంఖ్యా సమితిలో ఉన్నచో ఆ సంఖ్యను గుణకార తత్సమ మూలకం అంటారు.
- ఉదా: 5 ఒక సహజ సంఖ్య అయిన 5x1=5 అగును.
గుణకార విలోమము
[మార్చు]- a ఒక పూర్ణ సంఖ్య అయిన ax1/a=1 అయ్యేటట్లు 1/a అనే సహజ సంఖ్య లలో లేదు. అందువలన సహజ సంఖ్యాసమితిలో గుణకార విలోమం ఉండదు.
- ఒక సంఖ్యను ఏ సంఖ్యతో గుణించిన గుణకార తత్సమాంశము వస్తుందో ఆ గుణించిన సంఖ్య ఆ సంఖ్యా సమితిలో ఉన్నచో ఆ సంఖ్యను గుణకార విలోమం అంటారు.
- సహజ సంఖ్యలలో అకరణీయ సంఖ్యలు (భిన్నాలు) ఉండవు కావున గుణకార విలోమం ఉండదు.
వ్యవకలన ధర్మాలు
[మార్చు]- సహజ సంఖ్యలలో ఋణ సంఖ్యలు ఉండవు కావున వ్యవకలన ధర్మములు పాటించవు.
భాగహార ధర్మములు
[మార్చు]- సహజ సంఖ్యలలో భిన్న సంఖ్యలు ఉండవు కావున భాగహార ధర్మములు పాటించవు.
విభాగ న్యాయం
[మార్చు]- a, b, c లు మూడు సహజ సంఖ్యలయిన (a+b) c = (axc) + (bxc) అవుతుంది. ఈ న్యాయమును విభాగ న్యాయం అంటారు.