సాధారణ జ్ఞానం
సాధారణ జ్ఞానం (జనరల్ నాలెడ్జ్) అనేది వివిధ మాధ్యమాల ద్వారా కాలక్రమేణా సేకరించబడిన సమాచారం.[1] ఇది విస్తృతమైన శిక్షణ, ఒకే మాధ్యమానికి పరిమితం చేయబడిన సమాచారంతో మాత్రమే పొందగల ప్రత్యేక అభ్యాసానికి మినహాయింపు. సాధారణ జ్ఞానం మేధస్సు యొక్క ముఖ్యమైన భాగం. ఇది సాధారణ మేధస్సుతో, అనుభవముతో బలంగా ముడిపడి ఉంది.[2]
సాధారణంగా లభించే జ్ఞానమే సాధారణ జ్ఞానం, దీనిని ఇంగితజ్ఞానం అని కూడా అంటారు, దీని ప్రకారం సాంస్కృతికంగా నాన్-స్పెషలిస్ట్ మీడియా నుండి వచ్చే జ్ఞానం సాధారణ జ్ఞానం. వివిధ నిఘంటువుల ప్రకారం "అందరికీ లభించే జ్ఞానం" సాధారణ జ్ఞానం. సాధారణ జ్ఞానం విస్తృతమైన జ్ఞాన విషయాలను కలిగి ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం, సాధారణ జ్ఞానం యొక్క నిర్వచనాన్ని పూర్తి చేయడానికి 18 వేర్వేరు రంగాలు అవసరం: విజ్ఞానం, రాజకీయాలు, క్రీడలు, చరిత్ర, శాస్త్రీయ సంగీతం, కళ, సాహిత్యం, జనరల్ సైన్స్, భౌగోళికం, వంట, ఔషధం, ఆటలు, ఆవిష్కరణ, అన్వేషణ, బయాలజీ, ఫిల్మ్, ఫ్యాషన్, ఫైనాన్స్, పాపులర్ మ్యూజిక్. అయితే ఈ 18 రకాలు మాత్రమే కాక సాధారణ జ్ఞానమునకు అన్ని ఇతర రంగాలు కూడా ఉండవచ్చు.
మూలాలజాబితా
[మార్చు]- ↑ "GENERAL KNOWLEDGE". Cambridge English Dictionary (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2019-08-24.
- ↑ T. C. Bates and A. Shieles. (2003). Crystallized Intelligence is a product of Speed and Drive for Experience: The Relationship of Inspection Time and Openness to g and Gc. Intelligence, 31, 275-287