సిస్కో
సిస్కో సిస్టమ్స్ | |
---|---|
తరహా | Public |
స్థాపన | సాన్ జోసె,కాలిఫోర్నియా (1984)అమెరికా |
ప్రధానకేంద్రము | సాన్ జోసె,కాలిఫోర్నియా అమెరికా |
కీలక వ్యక్తులు | చక్ రొబ్బిన్స్, సి.ఈ.ఓ లియోనార్డ్ బోసాక్,సాండీ లెర్నర్(వ్యవస్థాపకులు) |
పరిశ్రమ | కంప్యూటర్ సాఫ్టువేరు కంప్యూటర్ హార్డ్వేర్ |
ఉత్పత్తులు | మొత్తం ఉత్పత్తులు లింకు |
రెవిన్యూ | $51.90 బిలియన్ USD (2019) |
సిస్కో సిస్టమ్స్ ఇంక్, ఒక అమెరికన్ సాంకేతిక సమ్మేళనం. దీని ప్రధాన కార్యాలయం సాన్ జోసె లోని సిలికాన్ వ్యాలీ మధ్యలో ఉన్నది. సిస్కో వివిధ సాఫ్ట్వేర్, నెట్వర్కింగ్ హార్డ్వేర్, ఉన్నత సాంకేతికంగా రూపొందించిన ఉత్పత్తులు తయారీ చేస్తుంది.[1] సిస్కో అనేక సంస్థలను సముపార్జన చేసుకుంది. అందులో చెప్పదగినవి వెబ్బెక్స్, ఓపెన్ డి న్ స్, జబ్బర్, జాస్పర్.
2020 లో ఫార్చ్యూన్ మగజినె విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో పని చేయడానికి ఉత్తమమైన సంస్థల్లో సిస్కో 4 వ స్థానం లో నిలిచింది.[2]
సిస్కో చరిత్ర
[మార్చు]సిస్కో సిస్టమ్స్ డిసెంబర్ 1984 వ సంవత్సరంలో సాండీ లెర్నర్, తన భర్త అయినా లియోనార్డ్ బోసాక్ ఇద్దరిచె స్థాపించబడింది. వీళ్లిద్దరు స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం లో పనిచేసే వారు. విద్యాలయం లో ఉన్న అన్ని కంప్యూటర్లని కనెక్ట్ చేయడానికి ఒక బ్లూ బాక్స్[3] అనే ఉత్పత్తి ని కనుగొన్నారు. ఇందులో వాడిన ఆధునిక సాంకేతిక పద్ధతులు సిస్కో తుది రోజుల్లో విజయానికి చాలా సహకరించాయి[4]. సిస్కో పేరు శాన్ ఫ్రాన్సిస్కో అనే పట్టణ పేరు నుండి ధృవీకరించ పడింది. ఫిబ్రవరి 16 ,1990 లో మార్కెట్ లో పబ్లిక్ కి వెళ్ళింది. ఆధునిక రౌటర్ల అమ్మకాలు మొదలు పెట్టిన మొదటి సంస్థల్లో సిస్కో ప్రధాన పాత్రా పోషించింది.
1990లో ఇంటర్నెట్ ప్రోటోకాల్ ప్రపంచం వ్యాప్తంగా చాలా విస్తీరించింది. సిస్కో తాయారు చేసిన వివిధ ఉత్పత్తుల వల్ల మార్కెట్ లో చాల ముఖ్యమైన సంస్థ అయింది. మార్చ్ 2000లో, డాట్ కామ్ బబుల్ శిఖరాల్లో ఉన్నపుడు సిస్కో ప్రపంచం లో నే అత్యంత విలువైన సంస్థగ నిలిచింది[5]. 2000 దశాబ్దంలో సిస్కో ఇండియా లోకి ప్రవేశించి, బెంగుళూరు లో $1 బిలియన్ USD తో కార్యాలయం నిర్మాణం చేసి ఇండియా లో విలువని బల పరుచుకుంది[6].
ఉత్పత్తులు, సేవలు
[మార్చు]సిస్కో ఉత్పత్తులు, సేవలు మూడు విభాగాల్లో ఎక్కువగా ఉన్నాయ్- ఎంటర్ప్రైస్, సేవా ప్రదాత, మధ్యస్థ వ్యాపారాలు. ఈ మూడు దశాబ్దాల్లో సిస్కో ఆసియా-పాకెఫిక్, ఆస్ట్రేలియా మార్కెట్ లో అన్ని రంగాల్లో స్థానాన్ని బలపరుచుకుంది.
విఓఐపి సేవలు
[మార్చు]వాయిస్ ఓవర్ ఐపి సేవలు అందించడం లో సిస్కో ప్రధాన సంస్థ అయింది. సైంటిఫిక్ అట్లాంట, లింక్సిస్ అనే సంస్థలు ని సముపార్జన చేసుకుని గృహ వినియోగదారుల మార్కెట్ లో కి ప్రవేశిస్తుంది. లింక్సిస్, చాల పెద్ద సంస్థలు అయిన స్కైప్, మైక్రోసాఫ్ట్, యాహు తో కలిసి వైర్లెస్ అండ్ కార్డ్లెస్ సేవలు వినియోగదారులకి అందించింది.
హోస్టెడ్ కొలాబరేషన్ సొల్యూషన్
[మార్చు]సిస్కో భాగస్వాములు క్లౌడ్ సేవలు యూనిఫైడ్ కంప్యూటింగ్ సిస్టం(యూ సి స్) ద్వారా అందించగలరు. ఇందులో భాగంగా వివిధ సేవలను వినియోగదారులకు అందచేస్తున్నరు. అందులో ముఖ్యమైనవి సిస్కో యూనిటీ కనెక్షన్, సిస్కో వెబెక్స్, సిస్కో యూనిఫైడ్ ప్రెజన్స్, సిస్కో యూనిఫైడ్ మొబిలిటీ.[7]
నెట్వర్క్ ఎమర్జెన్సీ రెస్పాన్స్
[మార్చు]వ్యూహాత్మక కార్యకలాపాల లో భాగంగా సిస్కో అనేక నెట్వర్క్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ వెహికల్స్[8] ని నిర్వహించింది. ఈ వాహనాలని సహజ విపత్తు లో వాడతారు. విపత్తుల్లో ఈ వాహనాలు వైర్డ్, వైర్లెస్ సేవలు అందచేస్తాయి. సంక్షోభ ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులకు సురక్షితమైన వీడియో సమావేశాలను అందచేస్తుంది[9]. సిస్కో అందించిన సేవలకు అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థ ఇన్నోవేషన్ ప్రిపరేషన్ అవార్డు ని అందచేసింది[10].
సిస్కో తాయారు చేసిన ఉత్పత్తులు అనేక సినిమా లో కనిపించడం జరిగింది. ఈ సంస్థ 2011 లో సొమెథింగ్ వెంచర్డ్ అనే డాక్యుమెంటరీ లో ప్రచురించపడింది.[11] 2003 లో యూ స్ ప్రభుత్వం రొన్ బ్రౌన్ అవార్డుని సిస్కో కి అందచేశారు[12].[13] 2019 లో ప్రపంచం లో పనిచేయడానికి ఉత్తమ కార్యాలయాలో సిస్కో మొదటి స్థానం లో నిలిచింది[14]. 2020 లో ఫార్చ్యూన్ విడుదల చేసిన 100 ఉత్తమ కార్యాలయాలో సిస్కో నాలుగవ స్థానం లో నిలిచింది.[15] లేక్స్ ఇన్నోవా అనే సాంకేతిక సంస్థ, 2015 లో ఇచ్చిన నివేదిక లో నెట్వర్క్-సెక్యూరిటీ భాగం లో అత్యధికమైన పేటెంట్స్(6442) సిస్కో వె.[16]
వివాదాలు
[మార్చు].* వినియోగదారుల వాడుక ని మీనోటర్ చేయడం సిస్కో ఒక్క లింక్సిస్ తాయారు చేసిన E2700, E3500, E4500 పరికరాలను ఫర్మ్వేర్ నవీకరణ వల్ల వినియోగదారుల క్లౌడ్ సేవలకు నమోదు చేసుకోవాల్సి వొచింది. దీని వల్ల సిస్కో వినియోగదాయురాల వాడుక ని మానిటర్ చేయడానికి కుదిరింది[17][18].
- పన్ను మోసం పై దర్యాప్తు అక్టోబర్ 2007 లో సిస్కో బ్రెజిల్ ఉద్యోగులను పన్ను కట్టకుండా పరికరాలను దిగుమతి చేస్తున్నారని బ్రెజిల్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. దీని తర్వాత సిస్కో తాను సొంతంగా బ్రెజిల్ లో కి దిగుమతులు చేయదని, మధ్యవర్తుల ద్వారా చేస్తుందని ప్రచురించింది[19].
- ఇండియా నెట్ సెన్సార్షిప్ రోల్ కాశ్మీర్ లో ఉన్న జనాలు ఇంటర్నెట్ వాడకాన్ని పరిమితం చేయడానికి సిస్కో సిస్టమ్స్ ఫైర్వాల్ రూపొందించింది. దీని వల్ల వినియోగదారుల నిరోధించబడిన వెబ్సైటులను వాడలేరు.[20]
ఇవి కూడా చూడండి
[మార్చు]- సిస్కో సర్టిఫికేషన్స్
- సిస్కో దేవ్ నెట్
- సిస్కో ఐ ఓ స్
- సిస్కో వెబెక్స్
- సిస్కో క్యాటలిస్ట్
- సిస్కో సిస్టమ్స్ వి పి న్ క్లయింట్
మూలాలు
[మార్చు]- ↑ "Cisco, Form 10-K, Annual Report, Filing Date Sep 12, 2012" (PDF). secdatabase.com. Archived from the original (PDF) on 2019-07-12.
- ↑ Snouwaert, Jessica. "The 25 best companies to work for, based on employee satisfaction". Business Insider. Retrieved 2020-08-22.
- ↑ Carey, pete (July 26, 2012). "A start-up's true tale". San Jose Mercury News. Archived from the original on 2019-10-10.
- ↑ "The creator of the multiprotocol router reflects on the development of the device that fueled the growth of networking". networkworld. Archived from the original on 2014-02-01.
- ↑ "సిస్కో మైక్రోసాఫ్ట్ ని మార్కెట్ విలువ లో దాటుట". CBS Marketwatch.
- ↑ Segal, Adam (January 10, 2011). Advantage: How American Innovation Can Overcome the Asian Challenge. 978-0-393-06878-8: W. W. Norton. pp. 191.
{{cite book}}
: CS1 maint: location (link) - ↑ "Cisco Launches Hosted Collaboration Solution". UCStrategies.com. Archived from the original on July 9, 2010. Retrieved August 4, 2010.
- ↑ "Cisco Tactical Operations (TacOps)". Cisco.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "నెట్వర్క్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ వెహికల్స్". Youtube.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ 2011 Innovative Preparedness—Cisco Tactical Operations. Youtube.com. Retrieved September 10, 2011.
- ↑ "Q and A With 'Something Ventured' Producer Paul Holland". Forbes.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Cisco News website Cisco Systems Receives Presidential Award for Corporate Leadership Archived ఫిబ్రవరి 20, 2011 at the Wayback Machine. Retrieved April 10, 2011.
- ↑ Smith, Abby (September 30, 2003). "Cisco Systems Receives Presidential Award for Corporate Leadership; Cisco's Networking Academy Program Recognized for Highest Quality Corporate Citizenship" (Press release). Business Wire. Retrieved 2020-05-17.
- ↑ "World's Best Workplaces 2019". Great Place to Work®. Archived from the original on 2020-07-07.
- ↑ "The 25 best companies to work for, based on employee satisfaction". Business insider.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Australia is world's fourth-largest holder of network-security patents, analysis finds cisco is top leader". CSO. Archived from the original on 2019-02-23.
- ↑ "Cisco Pushing 'Cloud Connect' Router Firmware, Allows Web History Tracking". Slashdot. Archived from the original on 2020-07-20.
- ↑ "Cisco's cloud vision: Mandatory, monetized and killed at their discretion". Extreme Tech. Archived from the original on 2020-07-19.
- ↑ "Cisco offices raided, executives arrested in Brazil: reports". Networkworld. Archived from the original on 2007-10-20.
- ↑ "US firm helps J&K build firewall to keep social media off-limits even when internet returns". The print. Archived from the original on 2020-07-29.
మరింత తెలుసుకోవటానికి వనరులు
[మార్చు]- Bunnell, D. & Brate, A. (2001). Die Cisco Story (in German). Moderne Industrie. ISBN 3-478-35995-3.
- Slater, R. (2003). The Eye of the Storm: How John Chambers Steered Cisco Through the Technology Collapse. HarperCollins. ISBN 0-06-018887-1.
- Stauffer, D. (2001). Nothing but Net Business the Cisco Way. Wiley. ISBN 1-84112-087-1.
- Young, J. S. (2001). Cisco Unauthorized: Inside the High-Stakes Race to Own the Future. Prima Lifestyles. ISBN 0-7615-2775-3.
ఇంటర్నెట్ లో సిస్కో వెబ్‌సైట్లు
[మార్చు]- http://www.cisco.com సిస్కో వెబ్సైట్
- https://www.cisco.com/c/en/us/training-events/training-certifications/certifications.html సిస్కో సర్టిఫికేషన్స్
- https://www.cisco.com/c/en_in/index.html సిస్కో ఇండియా వెబ్సైట్.