సీమ తంగేడు
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. (10 సెప్టెంబరు 2020) సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
సీమ తంగేడు | |
---|---|
సీమ తంగేడు చెట్టు పుష్పాలు | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Subfamily: | |
Tribe: | |
Subtribe: | |
Genus: | |
Species: | S. alata
|
Binomial name | |
Senna alata | |
Synonyms | |
|
సీమ తంగేడును అవిచిచెట్టు, మెట్టతామర, సీమ అవిసె, తంటెము అని కూడా అంటారు. దీని వృక్ష శాస్త్రీయనామం సెన్నా అలటా (Senna alata), దీనిని ఆంగ్లంలో కాండిల్ బుష్ (Candle Bush) అంటారు. ఇది ముఖ్యమైన ఔషధ వృక్షం, అలాగే Caesalpinioideae ఉపకుటుంబంలోని పుష్పించే మొక్కలకు చెందిన అలంకార మొక్క. ఈ చెట్టు యొక్క పువ్వులు తంగేడు చెట్టు పువ్వులను పోలి ఉండుట వలన సీమ తంగేడుగా ప్రసిద్ధి చెందింది. ఈ చెట్టును ఇంకా ఎంప్రెస్ కాండిల్ ప్లాంట్ (సామ్రాజ్ఞి కాండిల్ మొక్క), రింగ్వార్మ్ ట్రీ (తామరవ్యాధి చెట్టు) అని కూడా అంటారు. సెన్నా యొక్క ఒక అద్భుతమైన జాతి ఇది, కొన్నిసార్లు దానియొక్క సొంత ప్రజాతి Herpeticaగా వేరు చేయబడింది. సీమ తంగేడు మెక్సికో ప్రాంతానికి చెందినది, విభిన్న ప్రాంతాలలో కనుగొనబడింది. ఉష్ణ ప్రదేశాలలో ఇవి సముద్ర మట్టానికి 1200 మీటర్ల ఎత్తులో పెరుగుతాయి. ఆస్ట్రోనేషియాలో ఇది ఒక ఆక్రమిత జాతి. శ్రీలంక సాంప్రదాయ వైద్య ప్రక్రియలో దీనిని ఒక మూలపదార్థముగా (ముఖ్య మూలికగా) ఉపయోగిస్తారు. ఈ చెట్టు 3 నుంచి 4 మీటర్ల పొడవు ఉంటుంది. (The shrub stands 3–4 m tall, with leaves 50–80 cm long.) ఈ చెట్టు యొక్క పుష్పగుచ్ఛాలు పసుపు రంగులో ఉండి, పసుపు కొవ్వొత్తి వలె ఆకర్షంగా ఉంటాయి. ఈ చెట్టు యొక్క కాయలు చక్కగా, సరళంగా 25 సెంటీమీటర్ల పొడవు వరకు ఉంటాయి. ఈ చెట్టు యొక్క విత్తనాలు నీటి ద్వారా లేక జంతువుల చేత వివిధ ప్రదేశాలకు చేరి మొక్కలుగా పెరుగుతాయి. వీటి ఆకులు దగ్గరగా చూసినప్పుడు ముదురువిగా కనబడతాయి.
ఇవి కూడా చూడండి
[మార్చు]సీమ రేల - దీనిని కూడా సీమ తంగేడు అని పిలుస్తారు, అయితే ఇది ఎరుపు రంగు పువ్వులతో ప్రత్యేకంగా ఉంటుంది.