సుభా తోలె
సుభా తోలె | |
---|---|
జననం | August 1967 |
జాతీయత | భారతీయులు |
వృత్తి | Neuroscientist |
జీవిత భాగస్వామి | సందీప్ త్రివేది |
పిల్లలు | ఇద్దరు |
సుభా తోలె (జ. ఆగస్టు 1967) నాడీ శాస్త్రవేత్త. ఆమె ముంబయి లోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చిలో పనిచేస్తున్నది.
జీవిత విశేషాలు
[మార్చు]సుభా తోలె 1997 లో ముంబయి లోని సెయింట్ క్సావియర్ కాలేజీలో లైఫ్ సైన్సెస్, బయో కెమిస్ట్రీలలో బి.యస్సీ డిగ్రీని పొందారు. ఆమె కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎం.యస్సీ, పి.హెచ్.డి లను పొందారు. ఆమె "బయో మార్కర్స్" అనే అంశంపై డాక్టరేట్ చేశారు. యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో కొంతకాలం పనిచేశారు. 1999 లో ఇండియాకు తిరిగి వచ్చి టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో చేరారు. మనిషి మెదడులోని కేంద్రనాడీ మండలం వ్యవస్థ మీద పరిశోధనలు చేస్తున్నారు. మెదడులో ప్రత్యేక స్పందనల కేంద్రాలు, జన్యువుల పనితీరు మీద దృష్టి సారించిన ఆమె "ఇన్నోవేషన్ ఇన్ న్యూరో సైన్స్", "నేషనల్ ఉమెన్ బయోసైంటిస్ట్" అవార్డులు గెలుచుకొన్నారు.
ఆమె స్వరాజ్ ఫెలోషిప్ ను కూడా గెలుచుకొన్నారు. 1999 లో వెల్‌కం ట్రస్ట్ సీనియర్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్ ను పొందారు [1][2][3] ఆమె "సందీప్" అనే శాస్త్రవేత్తను వివాహమాడారు. ఆమెకు ఇద్దరు పిల్లలు.[4]
మూలాలు
[మార్చు]- ↑ Tata Institute of Fundamental Research. Faculty page: Shubha Tole
- ↑ Tata Institute of Fundamental Research. Principal Investigator: Shubha Tole
- ↑ Subramanyam, Chitra (8 February 2008). "Armed to go". India Today
- ↑ Scientist and Mommy, IndiaBioScience.org, accessed October 2012
ఇతర లింకులు
[మార్చు]- Jayan, T.V. (27 August 2007). "Snakes on ropes". The Telegraph
- http://www.tifr.res.in/~dbs/faculty/S_Tole.html